BSNL : జియో, ఎయిర్‌టెల్‌కు చుక్కలు చూపిస్తున్న బిఎస్ఎన్ఎల్.. రూ.225తో సూపర్ రీచార్జ్ ప్లాన్

Published : Jul 06, 2026, 10:03 PM IST

ప్రభుత్వరంగ టెలికాం కంపెనీ BSNL కేవలం రూ.225కే బంపర్ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో 30 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజూ 2.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. జియో, ఎయిర్‌టెల్ అందిస్తున్న ఖరీదైన ప్లాన్‌లకు ఇది గట్టి పోటీ ఇస్తోంది.

PREV
13
బిఎస్ఎన్ రూ.225 రీచార్జ్ ప్లాన్

దేశంలో నంబర్ వన్ టెలికాం కంపెనీ రిలయన్స్ జియోకు చుక్కలు చూపిస్తోంది ఓ రీఛార్జ్ ప్లాన్. అంబానీల కంపెనికీ పోటీగా ప్రభుత్వరంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) రూ.225కే బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీంతో ఎక్కడ కస్టమర్ల ఆ నెట్ వర్క్ కు షిప్ట్ అవుతారోనని జియోకు టెన్షన్ మొదలైంది. ఇంతకీ BSNL రూ.225 ప్లాన్ ప్రత్యేకతలు, లాభాలు ఏంటో చూద్దాం.

23
బిఎస్ఎన్ఎల్ రూ.225 రీచార్జ్ ప్లాన్ బెనిఫిట్స్

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL తన కస్టమర్ల కోసం రూ.225కే బంపర్ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ రీఛార్జ్‌తో దేశంలోని ఏ నంబర్‌కైనా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే, రోజూ 100 SMSలను ఉచితంగా పంపుకోవచ్చు.

అంతేకాదు ఈ రీఛార్జ్ ప్లాన్‌లో కస్టమర్లకు రోజూ 2.5GB డేటా లభిస్తుంది. 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అంటే నెల రోజుల్లో మొత్తం 75GB డేటా వాడుకోవచ్చు. జియో, ఎయిర్‌టెల్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువ ధరకే ఎక్కువ ప్రయోజనాలు అందిస్తోంది.

33
జియో, ఎయిర్ టెల్ లో ఇవే బెనిఫిట్స్ ఎంత రీచార్జ్ తో లభిస్తాయో తెలుసా?

రిలయన్స్ జియో రూ.399కే 2.5GB డేటా ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇది BSNL ప్లాన్ కంటే రెండు రోజులు తక్కువ. అయితే జియో ప్లాన్ ఖరీదైనప్పటికీ, అదనపు ప్రయోజనాలు ఉన్నాయి.  

ఎయిర్‌టెల్‌లో రోజువారీ 2.5GB డేటా ప్లాన్ రూ.429కు అందుబాటులో ఉంది. నెల రోజుల వ్యాలిడిటీ ఉండే ఈ ప్లాన్‌లో రూ.5 టాక్‌టైమ్, ఎయిర్‌టెల్ అడోబ్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రీమియం యాక్సెస్, ఫ్రీ హెలోట్యూన్స్, OTT ప్లాట్‌ఫామ్ ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే యాక్సెస్, అన్‌లిమిటెడ్ 5G, రోజుకు 100 SMSలు వంటివి లభిస్తాయి. జియో, ఎయిర్‌టెల్‌తో పోలిస్తే BSNL ప్లానే చౌక.

Read more Photos on
click me!

Recommended Stories