ఎల్ సాల్వడార్ అధికారిక కరెన్సీగా బిట్‌కాయిన్.. ముందుగానే భారీగా కొనుగోలు.. మరిన్ని కొనేందుకు రెడీ..?

Ashok Kumar   | Asianet News
Published : Sep 07, 2021, 01:08 PM IST

సెంట్రల్ అమెరికాలోని ఎల్ సాల్వడార్ దేశం మంగళవారం చట్టపరమైన టెండర్‌గా స్వీకరించిన మొదటి దేశంగా బిట్‌కాయిన్ 12 సంవత్సరాల చరిత్రలో అతిపెద్ద పరీక్షను ఎదుర్కొంటోంది. 

PREV
15
ఎల్ సాల్వడార్ అధికారిక కరెన్సీగా బిట్‌కాయిన్.. ముందుగానే భారీగా కొనుగోలు.. మరిన్ని కొనేందుకు రెడీ..?

బిట్‌కాయిన్ యు.ఎస్ డాలర్‌తో చెలామణి అవుతున్నప్పుడు అధిక సంఖ్యలో ప్రజలు లావాదేవీలు చేయాలనుకుంటున్నారా, దేశానికి ఏదైనా ప్రయోజనం చేకూరుస్తుందా లేదో తెలుసుకోవడానికి క్రిప్టో ఔత్సాహికులు, క్రిటోకరెన్సీల వ్యతిరేకులు ఈ ప్రయోగాన్ని పర్యవేక్షిస్తారు.
 

25

ప్రస్తుత ధరల ప్రకారం దాదాపు 20 మిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ఎల్ సాల్వడార్ దేశం 400 బిట్‌కాయిన్‌లను ముందుగానే కొనుగోలు చేసింది. ఇంకా మరిన్ని కొనుగోలు చేయాలని యోచిస్తోంది అని ఎల్ సాల్వడార్ ప్రెసిడెంట్ నయీబ్ బుకెలే మొదటి బ్యాచ్ లో 200 బిట్‌కాయిన్లు కొనుగోలు చేసిన తర్వాత ట్విట్టర్ ద్వారా తెలిపారు.


ఈ ప్రయోగం విజయవంతమైతే ఇతర దేశాలు ఎల్ సాల్వడార్ ఆధిపత్యాన్ని అనుసరించవచ్చు. దీనిని స్వీకరించడం అనేది ప్రభుత్వ బిట్‌కాయిన్ వాలెట్ చివో నుండి ప్రోత్సాహాన్ని పొందుతుంది, ఇది సాల్వడోరన్ నేషనల్ ఐ‌డి నంబర్‌తో నమోదు చేసుకున్న వినియోగదారుల కోసం  30 డాలర్ల విలువైన కరెన్సీని ముందే లోడ్ చేస్తుంది.

వస్తువులు, సేవల కోసం వ్యాపారాలు బిట్‌కాయిన్‌ను అంగీకరించాలి అలాగే పన్ను చెల్లింపుల కోసం ప్రభుత్వం దానిని అంగీకరిస్తుంది. ఈ ప్లాన్ ఎల్ సాల్వడార్ 40 ఏళ్ల ప్రెసిడెంట్ ఆలోచన, ఇంకా ఆర్థిక వ్యవస్థలోకి ఎక్కువ మందిని ఆకర్షిస్తుందని, చెల్లింపులు చేయడం ఈజీగా ఉంటుందని చెప్పారు.
 

35

"ఇది ధైర్యమైన కొత్త ప్రపంచ అంశం, ఈ ప్రయోగంతో మేము అన్‌చార్టర్డ్ వాటర్స్‌లో ఉన్నాము, కానీ ఈ ప్రయోగం మొత్తం జరగడం చూసి నేను సంతోషిస్తున్నాను దాని నుండి మనం చాలా నేర్చుకుంటామని నేను అనుకుంటున్నాను." " అని మయామి ఆధారిత Blockchain.com రీసర్చ్ హెడ్ గ్యారీక్ హిలేమన్ అన్నారు. 


బిట్‌కాయిన్ ఏ‌టి‌ఎంలు
28 ఆగష్టు 2021 శనివారం ఎల్ సాల్వడార్‌ రాజధాని  శాన్ సాల్వడార్  గెరార్డో బారియోస్ ప్లాజాలోని చివో బిట్‌కాయిన్ ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ (ఎటిఎం) బూత్‌లోకి ఒక పాదచారుడు డోర్ తెరిచాడు. ఎల్ సాల్వడార్ బిట్‌కాయిన్ ఏ‌టి‌ఎంలను ఇన్‌స్టాల్ చేయడం ప్రారంభించింది, అలాగే దేశ పౌరుల కోసం  ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా క్రిప్టోకరెన్సీని యూ‌ఎస్ డాలర్లు నగదు రూపంలోకి మార్చుకొని ఉపసంహరించుకోవడానికి అనుమతిస్తుంది.

బుకెలే అడ్మినిస్ట్రేషన్ దేశవ్యాప్తంగా 200 బిట్‌కాయిన్ ఎటిఎమ్‌లను ఇన్‌స్టాల్ చేసింది, వీటిలో క్రిప్టోకరెన్సీని యుఎస్ డాలర్ నగదు రూపంలోకి మార్చుకోవడానికి ఉపయోగించవచ్చు. బిట్‌కాయిన్ లావాదేవీలకు సపోర్ట్ చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ బాంకో డి డేసరోల్లో డి లా రిపబ్లిక డి ఎల్ సాల్వడార్, బండెసల్‌లో 150 మిలియన్ డాలర్ల నిధిని సృష్టించింది.

45

పబ్లిక్ అకౌంటింగ్ ప్రయోజనాల కోసం డాలర్ జాతీయ కరెన్సీగా కొనసాగుతుందని, సాంకేతికంగా ఇ-కరెన్సీని అందుకోలేని వ్యాపారులు చట్టం నుండి మినహాయించబడతారని ప్రభుత్వం తెలిపింది.

ఎల్ సాల్వడార్ డాలరైజ్డ్ ఎకానమీ విదేశాల్లోని వలసదారులు వారి పంపిన చెల్లింపులపై ఎక్కువగా ఆధారపడుతుంది, ఇది గత సంవత్సరం మొత్తం  6 బిలియన్ల డాలర్లు,  అంటే గ్రాస్ డోమస్టిక్ ప్రాడక్ట్ లో దాదాపు 5వ వంతు. ఈ లావాదేవీలు సాల్వాడోరాన్స్‌కు సంవత్సరానికి 400 మిలియన్ డాలర్ల ఫీజును బిట్‌కాయిన్ ఆదా చేయగలదని బుకెలే చెప్పారు.


బుకెలే  స్వంతంగా అప్రోవల్ రేటింగ్‌లను ఆనందించినప్పటికి ఎల్ సాల్వడార్  యూనివర్సిడాడ్ సెంట్రోఅమెరికానా జోస్ సిమియాన్ కెనస్ గత వారం చేసిన పోల్‌లో బిట్‌కాయిన్ చట్టం విస్తృతంగా ప్రజాదరణ పొందలేదు. ప్రతివాదులు మూడింట రెండు వంతుల మంది ఈ చట్టాన్ని రద్దు చేయాల్సి ఉందని, 70 శాతం కంటే ఎక్కువ మంది తాము యూ‌ఎస్ డాలర్లను ఉపయోగించడానికి ఇష్టపడుతున్నామని చెప్పారు.

55

అంతర్జాతీయ ద్రవ్య నిధి ఏప్రిల్ నుండి మే వరకు దాదాపు సగం విలువను కోల్పోయిన బిట్‌కాయిన్‌ ప్రమాదాల గురించి హెచ్చరించింది. పర్యావరణ, పారదర్శకత లోపాలను పేర్కొంటూ ప్రభుత్వం దానిని స్వీకరించడంలో సహాయపడటానికి ఎల్ సాల్వడార్ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను ప్రపంచ బ్యాంక్ తిరస్కరించింది. బిట్ కాయిన్ వార్తలు ఎల్ సాల్వడార్ డాలర్ బాండ్లను విక్రయించడానికి కూడా సహాయపడ్డాయి, అయినప్పటికీ అవి నష్టాలను మిగిల్చాయి.

"క్రిప్టో కరెన్సీ అద్భుతం కానీ పరీక్షించలేదు. ముఖ్యంగా ఎల్ సాల్వడార్ వంటి దేశానికి సంక్లిష్టమైనది" అని స్టెఫెల్ నికోలస్ & కో మేనేజింగ్ డైరెక్టర్ నథాలీ మార్షిక్ అన్నారు. 

బహామాస్ ఈ సంవత్సరం సొంత సెంట్రల్ బ్యాంక్-ఆధారిత డిజిటల్ కరెన్సీ శాండ్ డాలర్ ని అలాగే వెనిజుల పెట్రో అనే దాని స్వంత ఇ-మనీని కలిగి ఉండగా ఇవి బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీకి చాలా భిన్నంగా ఉంటాయి.

 గత నెలలో క్యూబా ఇప్పటికే క్రిప్టోకరెన్సీని చట్టబద్ధం చేసింది, పనామా అలాగే ఉరుగ్వే వంటి ఇతర దేశాలలో చట్టసభ సభ్యులు కూడా ఇదే చట్టాన్ని ప్రతిపాదించారు.

బుకెలే మిత్రపక్షం అధ్యక్షతన ఉన్న దేశ అత్యున్నత న్యాయస్థానం గత వారం అధ్యక్షుడిగా రెండోసారి పోటీ చేయవచ్చని తీర్పు ఇవ్వడంతో బిట్‌కాయిన్ స్వీకరణ జరిగింది. అమెరికా ఈ నిర్ణయాన్ని విమర్శించింది ఇది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తుందని పేర్కొంది.

click me!

Recommended Stories