కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ : భారతదేశ అతిపెద్ద డైమండ్ కంపెనీ మూసివేత..

First Published Apr 6, 2021, 11:39 AM IST

ముంబై: దేశంలోని  అతిపెద్ద డైమండ్ కంపెనీ భారత్ డైమండ్ బోర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర  నగరంలో కరోనా వైరస్ కేసుల  పెరుదల మధ్య కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు నిర్ణయించింది.

భారతదేశంలో వజ్రాల ఎగుమతుల్లో 98 శాతం నిర్వహిస్తున్న ముంబైకి చెందిన భారత్ డైమండ్ బోర్స్ ఏప్రిల్ 5న రాత్రి 8 గంటల నుండి తదుపరి ఆదేశాల వరకు కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు తేలిపింది.
undefined
ఒక నివేదిక ప్రకారం కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆంక్షలు ప్రకటించిన తరువాత ఈ చర్య తీసుకోవాల్సి వచ్చినట్లు వెల్లడించింది.
undefined
భారత్ డైమండ్ బోర్స్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో 20 ఎకరాలలో విస్తరించి ఉంది, ఇందులో దాదాపు 2,500 మంది చిన్న, పెద్ద వజ్రాల వ్యాపారులు ఉన్నారు. ఈ కాంప్లెక్స్‌లో కస్టమ్స్ హౌస్, బ్యాంకులు, ఇతర సర్వీసు ప్రొవైడర్లు ఉన్నారు. వీరు రత్నాలు, ఆభరణాల వ్యాపారాన్ని నిర్వహిస్తారు.
undefined
సోమవారం ఈ ప్రాంగణాన్ని మూసి వేయడానికి ముందు ఉద్యోగులు తమ చెక్ పుస్తకాలు, విలువైన వస్తువులు, ల్యాప్‌టాప్‌లు, ఇతర అవసరమైన పత్రాలను తీసుకెళ్లాలని కోరారు. భద్రతా అవసరాలలో భాగంగా అలారం వ్యవస్థను ఆక్టివ్ గా ఉంచాలని సభ్యులను అభ్యర్థించారు.
undefined
ముంబైలో సోమవారం ఒక్కరోజునే అత్యధికంగా 11,163 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. సోమవారం నాటికి ముంబైలో మొత్తం కేసుల సంఖ్య 4,62,302 వద్ద ఉంది.
undefined
గత కొన్ని రోజులుగా భారీగా కేసులు పెరగడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 5 నుండి 30 వరకు వారాంతపు రోజులలో లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూను ప్రకటించింది.
undefined
undefined
click me!