Debt: త్వరగా అప్పు తీరే మార్గం ఏంటి.? ఛాట్ జీపీటీ చెప్పిన సమాధనం ఏంటంటే

Published : May 03, 2025, 09:25 AM IST

అప్పు తీసుకోవడం సర్వసాధారణమైన విషయం. మనలో ప్రతీ ఒక్కరం ఏదో ఒక సమయంలో అప్పు తీసుకునే ఉంటాం. అయితే కొందరు తీసుకున్న అప్పును పర్ఫెక్ట్ గా తిరిగి చెల్లిస్తే మరికొందరు మాత్రం చెల్లించడంలో ఇబ్బందులు పడుతుంటారు. అయితే చేసిన అప్పును తిరిగి సులభంగా ఎలా చెల్లించాలన్న ప్రశ్నను ఏఐ చాట్ జీపీటీని అడిగితే ఏం సమాధానం చెప్పిందో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
Debt: త్వరగా అప్పు తీరే మార్గం ఏంటి.? ఛాట్ జీపీటీ చెప్పిన సమాధనం ఏంటంటే
1. డెట్ స్నోబాల్ పద్ధతి

ఎలా పనిచేస్తుంది: పెద్ద అప్పులపై కనీస చెల్లింపులు చేస్తూ ముందుగా మీ చిన్న అప్పులను తీర్చండి. దీని ద్వారా మీ అప్పుల సంఖ్య త్వరగా తగ్గుతుంది. ఒకే సమయంలో ఎక్కువ చోట్ల అప్పులు ఉంటే అది మానసికంగా కూడా భారంగా ఉంటుంది. 

 

25
2. డెట్ అవలాంచీ విధానం

ముందుగా అత్యధిక వడ్డీ రేటుతో అప్పులను తీర్చండి, ఆపై జాబితాలో క్రిందికి వెళ్లండి. వడ్డీ ఎక్కువగా ఉన్న అప్పును మొదట తీర్చడం ద్వారా మీపై భారం క్రమేణా తగ్గుతుంది. వడ్డీ ఎక్కువగా చెల్లించడం తగ్గుతుంది. 

35
3. అప్పుల ఏకీకరణ

మీకు ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ అప్పులు ఉంటే వాటన్నింటినీ ఒకటే లోన్ కిందికి మార్చుకోండి. దీని వల్ల వడ్డీ తగ్గడంతో పాటు చెల్లింపులు కూడా సులభతరమవుతుంది. ఒకే చోట ఈఎమ్ఐ చెల్లించే విధానం ఉండడం ద్వారా సులభతరమవుతుంది. 

45
4. బ్యాలెన్స్ బదిలీ క్రెడిట్ కార్డ్

మీకు చిన్న మొత్తంలో అప్పు ఉంటే క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించడం ఉత్తమం. బయట ఎక్కువ వడ్డీ చెల్లించే కంటే క్రెడిట్ కార్డులో డబ్బు తీసుకొని తక్కువ వడ్డీ చెల్లించవచ్చు. 

55
5. ఆదాయం పెంచండి & ఖర్చులు తగ్గించండి

వీటన్నింటితో పాటు మీ ఖర్చులను తగ్గించుకుంటే అప్పు త్వరగా పూర్తవుతుంది. అప్పు తీరేంత వరకు అనవసర ఖర్చులను తగ్గించండి. అప్పు చెల్లించడంపైనే మీ చూపు ఉండేలా చూసుకోండి. 

 

Read more Photos on
click me!

Recommended Stories