Gold price: గోల్డ్ కొనేందుకు ఇదే స‌రైన స‌మ‌యం.. కొన‌సాగుతోన్న బంగారం ప‌త‌నం. శ‌నివారం ఎంత త‌గ్గిందో తెలుసా.?

Published : May 03, 2025, 06:44 AM IST

బంగారం ధ‌ర‌లు ఆకాశ‌మే హ‌ద్దుగా దూసుకుపోయాయి. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా తులం ధ‌ర రూ. ల‌క్ష దాటేసి అంద‌రినీ షాక్‌కి గురి చేసింది. ఇక సామాన్యుడు బంగారం కొన‌డం క‌లే అనే అభిప్రాయం వచ్చింది. అయితే తాజాగా బంగారం ధ‌ర‌లు దిగొస్తున్నాయి. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా కేవ‌లం వారం రోజుల్లోనే సుమారు రూ. 7 వేల వ‌ర‌కు త‌గ్గ‌డం విశేషం. మ‌రి శ‌నివారం దేశంలోని ప‌లు ప్ర‌ధాన న‌గరాల్లో బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.   

PREV
16
Gold price: గోల్డ్ కొనేందుకు ఇదే స‌రైన స‌మ‌యం.. కొన‌సాగుతోన్న బంగారం ప‌త‌నం. శ‌నివారం ఎంత త‌గ్గిందో తెలుసా.?

మొన్నటికి మొన్న తులం బంగారం ల‌క్ష‌దాటేసింది. అయితే చూస్తుండ‌గానే బంగారం ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. ప్ర‌తీ రోజూ బంగారం ధ‌ర‌లో క్షీణ‌త క‌నిపిస్తోంది. రోజుకు క‌నీసం రూ. 500 చొప్పున త‌గ్గుతూ వ‌స్తుంది. తాజాగా శ‌నివారం మ‌రోసారి బంగారం ధ‌ర‌లో త‌గ్గుద‌ల క‌నిపించింది.
 

26

దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 87,540కి చేరింది. కాగా 24 క్యారెట్ల తులం బంగారం ధ‌ర రూ. 95,500కి దిగొచ్చింది. ఈ మ‌ధ్య కాలంలో బంగారం రూ. 95 వేల మార్క్‌కి చేర‌డం ఇదే తొలిసారిగా చెప్పొచ్చు. 

36

దేశంలో ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..

* దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 87,690గా ఉండ‌గా 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 95,650 వ‌ద్ద కొన‌సాగుతోంది. 

* ఆర్థిక రాజ‌ధాని ముంబైలో శ‌నివారం 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 87,540గా ఉండ‌గా, 24 క్యారెబ్ల గోల్డ్ రేట్ రూ. 95,550గా ఉంది. 
 

46

* చెన్నై విష‌యానికొస్తే ఇక్క‌డ 22 క్యారెట్ల తులం బంగారం ధ‌ర రూ. 87,540గా ఉండ‌గా, 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 95,550 వ‌ద్ద కొన‌సాగుతోంది. 

* బెంగ‌ళూరులో కూడా బంగారం ధ‌ర‌లో త‌గ్గుదల క‌నిపించింది. ఇక్క‌డ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 87,540గా ఉండ‌గా, 24 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 95,550 వ‌ద్ద కొన‌సాగుతోంది. 

56

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే.? 

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 87,540కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 95,550 వ‌ద్ద కొన‌సాగుతోంది. 

* విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల్లో22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 87,540గా ఉండ‌గా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధ‌ర రూ. 95,550 వ‌ద్ద కొన‌సాగుతోంది. 

66

వెండి ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే.. 

వెండి ధ‌ర‌లు కూడా బంగారం బాట‌లోనే ప‌య‌నిస్తున్నాయి. శ‌నివారం కిలో వెండిపై రూ. 100 త‌గ్గి రూ. 97,900 వ‌ద్ద కొన‌సాగుతోంది. ముంబై, ఢిల్లీ, కోల్‌క‌తా, బెంగ‌ళూరు, పుణె వంటి అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల్లో కిలో వెండి ధ‌ర రూ. 97,90గా ఉంది. అయితే చెన్నై, హైద‌రాబాద్‌, కేర‌ళ‌లో మాత్రం కిలో వెండి ధ‌ర రూ. 1,09,100 వ‌ద్ద నమోద‌వుతోంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories