మీ బైక్‌కి ఏ బ్రాండ్ పెట్రోలు ఎంత మైలేజ్ ఇస్తుందో తెలుసా! ఈ టెస్ట్ రిజల్ట్ చూస్తే ఆశ్చర్యపోతారు

First Published | Sep 10, 2024, 8:33 AM IST

భారతదేశంలో అత్యుత్తమ పెట్రోల్ బ్రాండ్‌లు ఏవి? ఏ కంపెనీ పెట్రోల్ వాడితే మంచి మైలేజ్ వస్తుందో తెలుసా? యూట్యూబ్‌ చానల్‌ మ్యాడ్‌ బ్రదర్స్‌ ఇటీవల భారత్‌లో అమ్ముడవుతున్న వివిధ బ్రాండ్‌ల పెట్రోల్‌ల మైలేజ్‌ పరీక్ష చేసింది. ఏ బ్రాండ్‌ పెట్రోల్‌ ఎక్కువ మైలేజ్‌ ఇస్తుందో పరిశీలించింది. అయితే ఈ వీడియోని.. ఈ పరిశీలనను ఏసియానెట్ తెలుగు ధృవీకరించడం లేదు. వీడియోలో ఉన్న వివరాలను మాత్రమే కథనం గా ఇస్తున్నాం. ఈ కథనం ఆధారంగా నిర్ణయం తీసుకొనే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

ఇండియన్ ఆయిల్

భారతదేశంలో ఏ పెట్రోల్ బ్రాండ్ ఉత్తమ మైలేజ్ ఇస్తుందో కనుగొనడానికి యూట్యూబ్ చానల్ మ్యాడ్ బ్రదర్స్ పరీక్ష నిర్వహించింది. ఇందులో వారు ఏం చెప్పారో.. వారి మాటల్లోనే వినండి.. 'ఇప్పుడు దేశంలో ఆరు బ్రాండ్‌ల పెట్రోల్‌ అమ్ముడవుతోంది. అన్ని బ్రాండ్‌లకు తలా ఒక లీటర్‌ పెట్రోల్‌ కొనుగోలు చేశాము. ఏ బ్రాండ్ ఎక్కువ మైలేజ్ ఇస్తుందో చూద్దాం.

వాస్తవానికి ఈ బ్రాండ్ల  మైలేజ్ గురించి మాకు పెద్దగా తెలియదు. దాన్ని వీడియో చేసి మీకు చూపిస్తాము. మేము ప్రస్తుతం తమిళనాడులోని తోప్పూర్ టోల్ ప్లాజా వద్ద ఉన్నాము. దిండిగల్ ఇక్కడి నుండి 65 కి.మీ దూరంలో ఉంది. ఆ దూరాన్ని మేము దాటగలమా అని చూద్దాం. బైక్ స్పీడోమీటర్‌లో ప్రయాణించిన దూరాన్ని మేము పరిశీలించవచ్చు. ఇది 72452 కి.మీ చూపిస్తుంది.

లాంగ్ రన్ తర్వాత, పెట్రోల్ ఖాళీ అయ్యింది. వాహనం ఆగిపోయింది. బైక్ స్పీడోమీటర్ ప్రకారం, ఇది 72,502 కి.మీ, అంటే 1 లీటర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ దాదాపు 50 కి.మీ మైలేజ్ ఇచ్చింది. మా మొబైల్‌లో ఉన్న యాప్ కూడా అదే చూపిస్తుంది. 1 లీటర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ దాదాపు 50 కి.మీ మైలేజ్ ఇచ్చింది.

హిందుస్తాన్ పెట్రోలియం

తర్వాత హిందుస్తాన్ పెట్రోలియం (HP) బంక్ యొక్క పెట్రోల్‌ను పరిశీలించారు. బైక్‌లో కేవలం 50-60 కిలోమీటర్ల వేగాన్ని మెయింటెన్ చేశారు. HP పెట్రోల్‌ ద్వారా సగటున 60.88 కి.మీ మైలేజ్ వచ్చింది. దాదాపు 61 కి.మీ మైలేజ్ ఇచ్చింది. ఇండియన్‌ ఆయిల్‌ కంటే ఎక్కువ మైలేజ్, అందులోనూ 11 కి.మీ ఎక్కువ మైలేజ్ ఇచ్చినందుకు ఆశ్చర్యపడ్డారు.

ఈ తేడాకు కారణం ఏమిటో తమకు తెలియదని వారు చెప్పారు. అంతేకాక, ఇండియన్ ఆయిల్ కేవలం 50 కి.మీ మైలేజ్ ఎందుకు ఇచ్చింది అనేది తెలియదని చెప్పారు. రెండు కంపెనీల పెట్రోల్ లీటర్‌కు 102 రూపాయల ధర ఉంది. కానీ, మైలేజ్ లో ఇంత వేరియేషన్ రావడానికి కాణం తెలియదన్నారు.
 

Latest Videos


లయన్స్ పెట్రోల్‌

తర్వాత రిలయన్స్ పెట్రోల్‌ను పరిశీలించారు. పరీక్ష చేసే ముందు స్పీడోమీటర్‌లో 72593 కి.మీ కనిపించింది. 1 లీటర్ పెట్రోల్ ఖాళీ అయిన తర్వాత స్పీడోమీటర్ 72,660 కి.మీ చూపించింది. అంటే, రిలయన్స్ పెట్రోల్ లీటర్‌కు 67 కి.మీ మైలేజ్ ఇచ్చింది అని మ్యాడ్ బ్రదర్స్ తెలిపారు. ఇంతవరకు పరీక్షలో, రిలయన్స్‌ బ్రాండ్‌ పెట్రోల్‌ టాప్‌లో ఉందని అన్నారు.

ఆ తర్వాత వారు నయారా పెట్రోల్‌ను పరిశీలించారు. బైక్‌ స్పీడోమీటర్‌ 72660 కిలోమీటర్లు అని  చూపించింది. బైక్‌లోని 1 లీటర్‌ నయారా పెట్రోల్‌ ఖాళీ అయిన తర్వాత 72,718 కిలోమీటర్లు అని చూపించింది. అంటే, నయారా పెట్రోల్‌ 1 లీటర్‌కు 58 కిలోమీటర్ల మైలేజ్‌ ఇచ్చింది. ఫోన్‌లోని జిపిఎస్ ప్రకారం, ఇది 56.34 కి.మీ చూపించింది. అందువల్ల, మేము పరిశీలించిన 4 బ్రాండ్‌లలో నయారా 3వ స్థానంలో ఉంది.

67 కి.మీ మైలేజ్‌తో రిలయన్స్ మొదటి స్థానంలో ఉంది. దీని తర్వాత మళ్లీ వారు ఇండియన్ ఆయిల్‌ పెట్రోల్‌ను పరిశీలించారు. మరో ఇండియన్‌ ఆయిల్‌ బంక్‌లో పెట్రోల్‌ కొనుగోలు చేసిన వారు, ఈసారి మొదట కొనుగోలుకు వచ్చిన ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌తో పోలిస్తే ఈ పెట్రోల్‌ కొంచెం థిక్ గా ఉందని అన్నారు.
 

ఇండియన్‌ ఆయిల్‌

ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ స్టార్ట్‌ చేయకముందు బైక్‌ స్పీడోమీటర్‌లో 72813 కిలోమీటర్లు చూపించింది. ప్రయాణం తర్వాత ఈ సంఖ్య 72868 కిలోమీటర్లుగా మారింది. అంటే 55 కిలోమీటర్ల మైలేజ్‌ ఇచ్చింది. అంటే, మొదటి టెస్ట్‌తో పోలిస్తే 2వ సారి ఇండియన్‌ ఆయిల్‌ టెస్ట్‌లో కొంచెం ఎక్కువ మైలేజ్‌ ఇచ్చినప్పటికీ, పెద్ద తేడా లేదు అన్నారు. ఆ తర్వాత చివరి రెండు బ్రాండ్‌ల పెట్రోల్‌లను పరిశీలించారు. భారత్‌ పెట్రోలియం పెట్రోల్‌ టెస్ట్‌కు ముందు స్పీడోమీటర్‌ 72,869 కి.మీ చూపించింది. ఫోన్‌ జిపిఎస్‌ ప్రకారం 58.51 కిలోమీటర్లు కానీ, బైక్‌ స్పీడోమీటర్‌ ప్రకారం 60 కి.మీ మైలేజ్‌ ఇచ్చింది. దీని ప్రకారం గరిష్ట మైలేజ్‌లో భారత్‌ పెట్రోలియం మూడవ స్థానంలో ఉంది.
 


తర్వాత వారు దేశంలో అత్యంత ఖరీదైన పెట్రోల్‌గా ఉన్న శెల్ పెట్రోల్‌ను పరిశీలించారు. మిగతా పెట్రోల్స్ లీటర్‌కు 101 నుంచి 102 రూపాయలైతే, శెల్ సాధారణ పెట్రోల్ లీటర్‌కు 113 రూపాయలు ఉంది. ఇది ఎక్కువ మైలేజ్ ఇస్తుందేమో అన్న ఆశలో టెస్ట్ చేశారు. టెస్ట్‌కు ముందు స్పీడోమీటర్‌ 72,929 కి.మీ చూపించింది. 1 లీటర్ శెల్ పెట్రోల్ 65 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చింది అన్నారు. సాధారణ పెట్రోల్ కంటే 10 రూపాయల ఎక్కువ ఉన్నా 65 కి.మీ మైలేజ్ మాత్రమే ఇచ్చిందని చెప్పారు.

ఇవీ రిజల్ట్స్

మొత్తానికి  67 కి.మీ మైలేజ్ ఇచ్చిన రిలయన్స్ మొదటి స్థానంలో ఉండగా, ఇండియన్ ఆయిల్‌ను రెండు సార్లు టెస్ట్ చేసినప్పటికీ చివరి స్థానంలో ఉందన్నారు. శెల్ రెండవ స్థానం పొందితే HP మూడవ స్థానంలో ఉందని మ్యాడ్ బ్రదర్స్ తమ యూట్యూబ్ చానల్‌లో విడుదల చేసిన వీడియోలో తెలిపారు. భారత్ పెట్రోలియం నాలుగో స్థానంలో నిలిచింది, నయారా ఐదో స్థానంలో ఉంది. ఈ వీడియో వైరల్ అవుతోంది.
 

click me!