ఈ వీకెండ్ లో బ్యాంకులకు వరుసగా మూడ్రోజులు సెలవులే!

First Published | Sep 9, 2024, 10:38 PM IST

ఈ వారాంతంలో బ్యాంకులకు వరుసగా 3 రోజులు సెలవులు రాబోతున్నాయి. కాబట్టి ఆర్థిక లావాదేవీలే కాదు బ్యాంకుల్లో ఏ పని వున్నా ఈ నాలుగు రోజుల్లోనే చేసుకునేలా ప్లాన్ చేసుకొండి.

Bank Holidays

ప్రస్తుతం దేశమంతా డిజిటల్ మయమే అయ్యింది...  ప్రజలు ఆన్‌లైన్ లావాదేవీలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. అయినప్పటికీ బ్యాంకుల్లో రద్దీ తగ్గడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న గ్యాస్ సబ్సిడీ, వందరోజుల పని పథకం కూలీలు, సహాయసంఘాల మహిళలు, కొందరు సాధారణ కస్టమర్లు...  నేరుగా బ్యాంకుల నుండే లావాదేవీలు జరుపుతుంటారు. దీంతో ఆన్ లైన్ ఆర్థిక లావాదేవీలు పెరిగినా బ్యాంకుల వద్ద రద్దీ కొనసాగుతూనే వుంది. 

Bank Holidays

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకుల వద్ద రద్దీ మరీ ఎక్కువగా వుంటుంది. గ్రామీణ ప్రజలు ఆన్ లైన్ పేమెంట్స్ పై పెద్దగా అవగాహన లేకపోవడంతో నేరుగా బ్యాంకుల ద్వారానే జరుపుతుంటారు. అలాగే మహిళా సంఘాలు, ఉపాధి కూలీలు కూడా గ్రామీణ బ్యాంకుల వద్దకే వస్తుంటారు. కాబట్టి రద్దీ ఎక్కువగా వుంటుంది. 

Latest Videos


Bank Holidays

ఇలా బ్యాంకులను ఉపయోగించేవారు ఈ వారం ఏ ఆర్థిక లావాదేవీలు వున్నా నాలుగు రోజుల్లో పూర్తిచేసుకుంటే మంచింది. ఎందుకంటే ఈ వారాంతంలో వరుసగా 3 రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. ఈ నెల 14న రెండో శనివారం, 15న ఆదివారం, 16న మిలాద్ ఉన్ నబి సందర్భంగా వరుసగా 3 రోజులు సెలవులు ఉంటాయి. కాబట్టి  బ్యాంకింగ్ లావాదేవీలను ముందుగానే ప్లాన్ చేసుకుంటే మంచిది. 

Bank Holidays

ఇక సెప్టెంబర్ 17న వినాయక నిమజ్జనం. ఆరోజు కూడా బ్యాంకులు వెళ్లే అవకాశం వుండదు. అంటే ఈ వారంలో మీ బ్యాంక్ పని కాలేదంటే మళ్లీ సెప్టెంబర్ 18నే చేసుకోవాలి. వరుసగా సెలవులు వస్తాయి కాబట్టి ఆరోజు రద్దీ ఎక్కువగా వుంటుంది. కాబట్టి అత్యవసర బ్యాంక్ పనులు ఏమయినా వుంటే ఈవారంలో పూర్తిచేసుకోవడం మంచింది. 

click me!