వరల్డ్స్ బెస్ట్ ఎంప్లాయర్స్ ర్యాంకింగ్స్ 2021లో రిలయన్స్ ఇండస్ట్రీస్.. కరోనా కాలంలో కూడా కొలువుల జాతర..

First Published Oct 14, 2021, 6:34 PM IST

 న్యూఢిల్లీ, అక్టోబర్ 14 : దేశంలోనే అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆదాయాలు, లాభాలు, మార్కెట్ విలువ ద్వారా ఫోర్బ్స్ ప్రచురించిన భారతీయ కార్పొరేట్లలో ప్రపంచ అత్యుత్తమ ఎంప్లాయర్స్ ర్యాంకింగ్స్ 2021లో అగ్రస్థానంలో నిలిచింది.          

ఫిలిప్స్, సనోఫీ, ఫైజర్ అండ్ ఇంటెల్ వంటి 750 ప్రపంచ కార్పొరేట్ కంపెనీల మొత్తం ర్యాంకింగ్‌లో రిలయన్స్(reliance) 52వ స్థానంలో నిలిచింది. ఫోర్బ్స్ ర్యాంకింగ్ ప్రకారం టాప్ 100 ర్యాంకింగ్స్‌లో ఇతర భారతీయ కంపెనీలు ఐ‌సి‌ఐ‌సి‌ఐ బ్యాంక్ 65 వద్ద, హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్ 77 వద్ద, హెచ్‌సి‌ఎల్ టెక్నాలజీస్  90 వద్ద ఉన్నాయి.
        
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 119 వద్ద, లార్సెన్ & టూబ్రో 127 వద్ద ఉన్నాయి. ఇన్ఫోసిస్ 588, టాటా గ్రూప్ 746వ స్థానంలో ఉన్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్ప్ (LIC)504వ స్థానంలో ఉంది. ర్యాంకింగ్‌లు లర్జ్ స్కేలు  సర్వేపై ఆధారపడి ఉంటాయి, ఇక్కడ ఉద్యోగులు వారి యజమానులను అనేక అంశాలపై రేట్ చేసారు.
       
 ప్రపంచ ర్యాంకింగ్‌లో దక్షిణ కొరియా దిగ్గజం శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ అగ్రస్థానంలో ఉండగా, అమెరికా దిగ్గజాలు ఐబీఎం, మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్, ఆల్ఫాబెట్, డెల్ టెక్నాలజీస్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చైనాకు చెందిన హువావే ప్రపంచంలోని 8వ అత్యుత్తమ యజమానిగా నిలిచింది.
        

మల్టీ నేషనల్ కంపెనీలు, సంస్థల కోసం పనిచేస్తున్న 58 దేశాల నుండి 1,50,000 ఫుల్ టైం, పార్ట్‌టైమ్ వర్కర్స్ పై సర్వే చేయడం ద్వారా ర్యాంకింగ్‌ని  చేయడానికి మార్కెట్ పరిశోధన సంస్థ స్టాటిస్టాతో భాగస్వామ్యమైనట్లు ఫోర్బ్స్ తెలిపింది.
     

 "సర్వేలో పాల్గొనేవారు తమ స్వంత యజమానులను స్నేహితులు, కుటుంబ సభ్యులుగా  సిఫారసు చేయడానికి వారి సుముఖతను రేట్ చేయమని అడిగారు. అలాగే పాజిటివ్లీ లేదా నెగటివ్లీ ఉన్న తమ పరిశ్రమలలోని ఇతర యజమానులను కూడా విశ్లేషించమని కూడా అడిగారు. ఈ జాబితాలో అత్యధిక స్కోర్లు పొందిన 750 కంపెనీలు ఉన్నాయి "అని చెప్పింది.

ఇమేజ్, ఎకనామిక్ ఫుట్‌ప్రింట్, టాలెంట్ డెవలప్‌మెంట్, జెండర్ ఈక్విటీ, సామాజిక బాధ్యత వంటి అంశాలపై కంపెనీలను రేట్ చేయాలని ఇందులో పాల్గొన్న వారు కోరారు.  "అత్యధిక మొత్తం స్కోర్‌ను అందుకున్న 750 కంపెనీలు తుది జాబితాను రూపొందించాయి" అని ఫోర్బ్స్ తెలిపింది.

ఆయిల్-టు-రిటైల్ కంగ్లోమరేట్ రిలయన్స్ 2020-21 కరోనా మహమ్మారి సంవత్సరంలో దాదాపు 75,000 కొత్త ఉద్యోగాలను జోడించింది. ఫోర్బ్స్ సర్వేలన్నీ అజ్ఞాతంగా ఉన్నాయని, ఇందులో పాల్గొనేవారు తమ అభిప్రాయాలను బహిరంగంగా పంచుకునేందుకు వీలు కల్పిస్తుందని చెప్పారు.
       

ఈ జాబితాలో ఉన్న ఇతర భారతీయ సంస్థలు బజాజ్ 215 స్థానంలో, యాక్సిస్ బ్యాంక్ 254 స్థానంలో, ఇండియన్ బ్యాంక్ 314 స్థానంలో, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్ప్ (ఒఎన్‌జిసి) 404 స్థానంలో, అమర రాజ గ్రూప్ 405 స్థానంలో, కోటక్ మహీంద్రా బ్యాంక్ 418 స్థానంలో, బ్యాంక్ ఆఫ్ ఇండియా 451 స్థానంలో, ఐ‌టి‌సి 453 స్థానంలో, సిప్లా 460 స్థానంలో, బ్యాంక్ ఆఫ్ బరోడా 496 స్థానంలో ఉన్నాయి.

click me!