Bank Locker : బ్యాంక్ లాకర్‌లో బంగారం పెట్టారా? ఈ ఒక్క పని చేయకపోతే భారీ నష్టం

Published : Dec 19, 2025, 08:17 PM ISTUpdated : Dec 19, 2025, 08:19 PM IST

Bank Locker Gold Safety : బ్యాంక్ లాకర్ పూర్తిగా సురక్షితం అనుకోవడం తప్పని నిపుణులు పేర్కొంటున్నారు. నష్టం జరిగితే బ్యాంక్ బాధ్యత పరిమితంగానే ఉంటుంది. అందుకే లాకర్‌లో ఉన్న వస్తువులకు ప్రత్యేక ఇన్సూరెన్స్ ముఖ్యమని సూచిస్తున్నారు.

PREV
16
బ్యాంక్ లాకర్‌పై పూర్తిగా నమ్మకం పెడుతున్నారా? నిజం తెలుసుకుంటే షాక్ అవుతారు

బ్యాంక్ లాకర్‌లో బంగారం, వెండి, ముఖ్యమైన డాక్యుమెంట్లు ఉంచడం చాలా మందికి అలవాటు. లాకర్‌లో పెట్టిన వస్తువులు పూర్తిగా సురక్షితంగా ఉంటాయని, ఏదైనా నష్టం జరిగితే బ్యాంకే మొత్తం బాధ్యత వహిస్తుందని చాలామంది భావిస్తుంటారు. కానీ ఈ భావన పూర్తిగా నిజం కాదు. బ్యాంక్ లాకర్ అనేది కేవలం భద్రంగా నిల్వ చేసుకునే ఒక సదుపాయం మాత్రమే. లాకర్‌లో ఏమి ఉంచుతున్నారో, దాని విలువ ఎంత అనే వివరాలు బ్యాంక్‌కు తెలియవు.

26
బ్యాంక్ లాకర్ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

నియమాల ప్రకారం బ్యాంక్, లాకర్ వినియోగదారుడి మధ్య సంబంధం కేవలం లాకర్‌ను అద్దెకు ఇవ్వడం వరకే పరిమితం. లాకర్‌లో ఉంచిన వస్తువులపై బ్యాంక్‌కు ప్రత్యక్ష నియంత్రణ ఉండదు. అలాగే, ఆ వస్తువుల విలువను బ్యాంక్ అంచనా వేయదు. ఈ కారణంగా లాకర్‌లో నష్టం జరిగితే ఆటోమేటిక్‌గా బ్యాంక్ మొత్తం నష్టాన్ని భర్తీ చేస్తుందని భావించడం సరైంది కాదని నిపుణులు పేర్కొంటున్నారు.

36
బ్యాంకు లాకర్.. ఆర్బీఐ మార్గదర్శకాలు ఏమంటున్నాయి?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, లాకర్‌లో ఉన్న వస్తువులకు నష్టం జరిగితే ప్రతి సందర్భంలోనూ బ్యాంక్ బాధ్యత వహించదు. బ్యాంక్ నిర్లక్ష్యం, పొరపాటు లేదా బ్యాంక్ ఉద్యోగుల మోసం వల్ల నష్టం జరిగినప్పుడు మాత్రమే బ్యాంక్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. అగ్నిప్రమాదం, వరదలు, భూకంపం వంటి సహజ విపత్తుల క్రమంలో నష్టం జరిగితే బ్యాంక్ బాధ్యత పరిమితంగానే ఉంటుంది.

46
బ్యాంక్ చెల్లించే పరిహారం ఎంత?

RBI నిబంధనల ప్రకారం, బ్యాంక్ బాధ్యత ఉన్న సందర్భాల్లో కూడా పరిహారం పరిమితంగానే ఉంటుంది. బ్యాంక్ గరిష్ఠంగా లాకర్ వార్షిక అద్దెకు 100 రెట్లు మాత్రమే చెల్లిస్తుంది. ఉదాహరణకు, ఒక లాకర్ వార్షిక అద్దె రూ.5,000 అయితే గరిష్ఠంగా రూ.5 లక్షల వరకే లభిస్తుంది. లాకర్‌లో కోట్ల విలువైన బంగారం లేదా ఆభరణాలు ఉన్నా కూడా ఈ పరిమితి వర్తిస్తుంది. ఇది వినియోగదారుడికి భారీ ఆర్థిక నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది.

56
లాకర్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం?

ఈ పరిస్థితుల నేపథ్యంలో బ్యాంక్ లాకర్‌లో ఉంచే విలువైన వస్తువులకు ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా అవసరం. లాకర్ ఇన్సూరెన్స్ ద్వారా దొంగతనం, అగ్నిప్రమాదం, వరదలు, భూకంపం వంటి ఘటనల్లో ఆర్థిక భద్రత లభిస్తుంది. బంగారం, వెండి, డైమండ్ జ్యువెలరీ, విలువైన డాక్యుమెంట్లు వంటి వస్తువులు ఈ ఇన్సూరెన్స్ పరిధిలోకి రావచ్చు. కవరేజ్ వివరాలు ఆయా ఇన్సూరెన్స్ కంపెనీలపై ఆధారపడి ఉంటాయి.

66
బ్యాంకు లాకర్: తక్కువ ప్రీమియంతో పెద్ద కవరేజ్

బ్యాంకు లాకర్ ఇన్సూరెన్స్‌ను వినియోగదారుడే స్వయంగా తీసుకోవాలి. కొన్ని బ్యాంకులు గ్రూప్ పాలసీలను కూడా అందిస్తున్నాయి. వీటి ద్వారా తక్కువ ప్రీమియంతో పెద్ద మొత్తంలో కవరేజ్ పొందే అవకాశం ఉంటుంది. తక్కువ ఖర్చుతో లక్షల రూపాయల విలువైన భద్రత లభిస్తుంది.

బ్యాంక్ లాకర్ పూర్తిగా సురక్షితం అనే భావనపై ఆధారపడకుండా, నిబంధనలు తెలుసుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. లాకర్‌లో ఉన్న విలువైన వస్తువులకు ఇన్సూరెన్స్ చేయించుకోవడం నేటి పరిస్థితుల్లో ఒక తెలివైన ఆర్థిక నిర్ణయంగా నిపుణులు సూచిస్తున్నారు. చిన్న ప్రీమియంతో పెద్ద నష్టాన్ని నివారించుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories