Bank holidays: ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు.. ఏయే రోజుల్లో బ్యాంకులు పనిచేయవో తెలుసా? పూర్తి సమాచారం..

దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. దేశంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ బ్యాంక్‌ ఖాతా ఉంటోంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఆర్థిక సాయం నేరుగా అకౌంట్‌లో పడుతోన్న నేపథ్యంలో బ్యాంకు ఖాతాలు అనివార్యంగా మారాయి. దీంతో సహజంగానే బ్యాంకు వేళలు, సెలవుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది.. 
 
Bank Holidays in India (April to December 2025) Complete State-Wise List for Andhra Pradesh and Telangana in telugu VNR

ఎంత ఆన్‌లైన్‌ బ్యాంకింగ్ అందుబాటులోకి వచ్చినా, యూపీఐ పేమెంట్స్‌ విస్తృతి పెరిగినా బ్యాంకులకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. రకరకాల పనుల కోసం ఖాతాదారులు బ్యాంకులకు క్యూ కడుతుంటారు. అందుకే బ్యాంకులకు సంబంధించిన సెలవుల గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ నెల నుంచి 2025 డిసెంబర్‌ వరకు ఏయే నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు పనిచేయవో పూర్తి వివరాలు మీకోసం. 
 
Bank Holidays in India (April to December 2025) Complete State-Wise List for Andhra Pradesh and Telangana in telugu VNR

ఏప్రిల్‌ నెలలో ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకుల సెలవుల జాబితా: 

* ఏప్రిల్‌ 5వ తేదీన (శనివారం) బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. 

* ఏప్రిల్‌ 6వ తేదీన ఆదివారంతో పాటు రామ నవమి కూడా ఉండడంతో బ్యాంకులకు సెలవు ఉండనుంది. 

* ఏప్రిల్‌ 12వ తేదీన సెకండ్‌ శనివారం కావడంతో బ్యాంకులకు సెలవు. 

* ఏప్రిల్‌ 14వ తేదీన (సోమవారం) అంబేద్కర్‌ జయంతి సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. 

* ఏప్రిల్‌ 18వ తేదీన (శుక్రవారం) గుడ్‌ ఫ్రైడే రోజు బ్యాంకులకు పనిచేయవు. 

* ఇక ఏప్రిల్‌ 26వ తేదీన (శనివారం) ఫోర్త్‌ శనివారం సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. 

* వీటికి అదనంగా ఆదివారాలు బ్యాంకులు పనిచేయవు. 

ఏప్రిల్‌ నెలలో తెలంగాణలో బ్యాంకుల సెలవుల జాబితా: 

* తెలంగాణలో ఏప్రిల్‌ 1వ తేదీన (మంగళవారం) ఇదుల్ ఇఫ్తార్‌ (రంజాన్‌ మరుసటి రోజు) సందర్భంగా కొన్ని చోట్ల బ్యాంకులు పని చేయవు. 

* * ఏప్రిల్‌ 5వ తేదీన (శనివారం) బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. 

* ఏప్రిల్‌ 6వ తేదీన ఆదివారంతో పాటు రామ నవమి కూడా ఉండడంతో బ్యాంకులకు సెలవు ఉండనుంది. 

* ఏప్రిల్‌ 12వ తేదీన సెకండ్‌ శనివారం కావడంతో బ్యాంకులకు సెలవు. 

* ఏప్రిల్‌ 14వ తేదీన (సోమవారం) అంబేద్కర్‌ జయంతి సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. 

* ఏప్రిల్‌ 18వ తేదీన (శుక్రవారం) గుడ్‌ ఫ్రైడే రోజు బ్యాంకులకు పనిచేయవు. 

* ఇక ఏప్రిల్‌ 26వ తేదీన (శనివారం) ఫోర్త్‌ శనివారం సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. 
 
మే నెలలో ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకుల సెలవుల జాబితా: 

* మే 1వ తేదీన (గురవారం) మే డే సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. 

* మే నెల 10వ తేదీన సెకండ్‌ శనివారం బ్యాంకులకు సెలవు ఉంటుంది. 

* మే 12వ తేదీన బుద్ధ పూర్ణిమ సందర్భంగా సోమవారం బ్యాంకులు పనిచేయవు. 

* ఇక మే 24వ తేదీన సెకండ్ శనివారాన్ని పురస్కరించుకొని బ్యాంకులకు సెలవు దినంగా ప్రకటించారు. వీటికి అదనంగా అన్ని ఆదివారాలు బ్యాంకులకు సెలవు ఉంటుంది. 

మే నెలలో తెలంగాణలో బ్యాంకుల సెలవుల జాబితా: 

* మే 1వ తేదీన (గురవారం) మే డే సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. 

* మే నెల 10వ తేదీన సెకండ్‌ శనివారం బ్యాంకులకు సెలవు ఉంటుంది. 

* మే 12వ తేదీన బుద్ధ పూర్ణిమ సందర్భంగా సోమవారం బ్యాంకులు పనిచేయవు. 

* ఇక మే 24వ తేదీన సెకండ్ శనివారం సందర్భంగా బ్యాంకు బంద్‌ ఉంటుంది. వీటికి అదనంగా అన్ని ఆదివారాలు బ్యాంకులకు సెలవు ఉంటుంది. 

జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజుల్లో బ్యాంకులకు హాలీడే: 

* జూన్‌ 7వ తేదీ (శనివారం) బక్రీద్‌ సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. 

* జూన్‌ 14వ తేదీ (శనివారం) రెండో శనివారం సందర్భంగా బ్యాంకులకు హాలీడే ఉంటుంది. 

* జూన్‌ 28వ తేదీ (శనివారం) ఫోర్త్‌ శనివారం సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. 

జూన్‌లో తెలంగాణలో బ్యాంకులకు హాలీడేలు ఇవే: 

* జూన్‌ 7వ తేదీ (శనివారం) బక్రీద్‌ సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. 

* జూన్‌ 14వ తేదీ (శనివారం) రెండో శనివారం సందర్భంగా బ్యాంకులకు హాలీడే ఉంటుంది. 

* జూన్‌ 28వ తేదీ (శనివారం) ఫోర్త్‌ శనివారం సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. 
 
జూలై నెలలో ఏపీలో బ్యాంకుల సెలవుల జాబితా: 

* జూలై 6వ తేదీన మొహరం సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. అయితే ఈరోజు ఆదివారం వస్తోంది. 

* ఇక జూలై 12వ తేదీన సెకండ్‌ శనివారం సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. 

* 26వ తేదీన నాల్గవ శనివారం సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. వీటికి అదనంగా అన్ని ఆది వారాలు బ్యాంకులకు హాలీడే ఉంటుంది. 

జూలై నెలలో తెలంగాణలో బ్యాంకుల సెలవుల జాబితా: 

* జూలై 6వ తేదీన మొహరం సందర్భంగా బ్యాంకులు పనిచేయు. అయితే ఈరోజు ఆదివారం వస్తోంది. 

* ఇక జూలై 12వ తేదీన సెకండ్‌ శనివారం సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. 

* 26వ తేదీన నాల్గవ శనివారం సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. వీటికి అదనంగా అన్ని ఆది వారాలు బ్యాంకులకు హాలీడే ఉంటుంది.

ఆగస్టులో ఏపీలో బ్యాంకుల సెలవులు: 

* ఆగస్టు 9వ తేదీన రెండో శనివారం బ్యాంకు పనిచేయదు. 

* ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బ్యాంకు హాలీడే. 

* ఆగస్టు 16వ తేదీ (శనివారం) కృష్ణాష్టమి రోజున బ్యాంకులకు సెలవు. 

* ఆగస్టు 23వ తేదీన నాల్గవ శనివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు. 

* ఆగస్టు 27వ తేదీన వినాయక చవితి సందర్భంగా (బుధారం) బ్యాంకులకు హాలీడే. 

ఆగస్టులో తెలంగాణలో బ్యాంకుల సెలవులు: 

* ఆగస్టు 9వ తేదీన రెండో శనివారం బ్యాంకు పనిచేయదు. 

* ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బ్యాంకు హాలీడే. 

* ఆగస్టు 16వ తేదీ (శనివారం) కృష్ణాష్టమి రోజున బ్యాంకులకు సెలవు. 

* ఆగస్టు 23వ తేదీన నాల్గవ శనివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు. 

* ఆగస్టు 27వ తేదీన వినాయక చవితి సందర్భంగా (బుధారం) బ్యాంకులకు హాలీడే. 
 
సెప్టెంబర్‌ నెలలో ఏపీలో బ్యాంకుల సెలవుల జాబితా: 

* సెప్టెంబర్‌ 5వ తేదీన (శుక్రవారం) ఈద్‌ ఈ మిలాద్‌ సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. 

* 13వ తేదీన రెండో శనివారం సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. 

* 27వ తేదీన ఫోర్త్‌ శనివారం బ్యాంకులకు హాలీడే. 

* 30వ తేదీన మహా అష్టమి సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. 

సెప్టెంబర్‌ నెలలో తెలంగాణలో బ్యాంకుల సెలవుల జాబితా: 

* సెప్టెంబర్‌ 5వ తేదీన శుక్రవారం ఈద్‌ ఈ మిలాద్‌ సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. 

* 13వ తేదీన రెండో శనివారం సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. 

* తెలంగాణలో సెప్టెంబర్‌ 22వ తేదీన బతుకమ్మ తొలి రోజు సందర్భంగా సోమవారం కొన్ని స్థానిక బ్యాంకులకు హాలీడే ఉంటుంది.

* 27వ తేదీన ఫోర్త్‌ శనివారం బ్యాంకులకు హాలీడే. 

* 30వ తేదీన మహా అష్టమి సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. 
 
అక్టోబర్‌ నెలలో ఏపీలో బ్యాంకుల సెలవుల జాబితా: 

* అక్టోబర్‌ 2వ తేదీన (గురువారం) గాంధీ జయంతి సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. విజయదశమి కూడా ఇదే రోజు వస్తుంది. 

* అక్టోబర్‌ 11వ తేదీన రెండో శనివారం బ్యాంకులకు హాలీడే. 

* అక్టోబర్‌ 21వ తేదీన మంగళవారం దీపావళి సందర్‌భంగా బ్యాంకులకు సెలవు. 

* అక్టోబర్‌ 25వ తేదీన ఫోర్త్‌ శనివారం బ్యాంకులు పనిచేయవు. 

అక్టోబర్‌ నెలలో తెలంగాణలో బ్యాంకులు ఈ రోజుల్లో పనిచేయవు: 

* అక్టోబర్‌ 2వ తేదీన (గురువారం) గాంధీ జయంతి సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. విజయదశమి కూడా ఇదే రోజు వస్తుంది. 

* అక్టోబర్‌ 11వ తేదీన రెండో శనివారం బ్యాంకులకు హాలీడే. 

* అక్టోబర్‌ 21వ తేదీన మంగళవారం దీపావళి సందర్‌భంగా బ్యాంకులకు సెలవు. 

* అక్టోబర్‌ 25వ తేదీన ఫోర్త్‌ శనివారం బ్యాంకులు పనిచేయవు. వీటికి అదనంగా అన్ని ఆదివారాలు బ్యాంకులు పనిచేయవు. 
 
నవంబర్‌ నెలలో ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకుల సెలవుల జాబితా: 

* నవంబర్‌ నెలలో 8వ తేదీ సెకండ్‌ శనివారం, 22వ తేదీ నాల్గవ శనివారం మాత్రమే బ్యాంకులకు సెలవు దినాలు ఉన్నాయి. అయితే సాధారణంగానే అన్ని ఆదివారాలు బ్యాంకులు పనిచేస్తాయి. 

నవంబర్‌ నెలలో తెలంగాణలో బ్యాంకుల సెలవులు: 

* తెలంగాణ విషయానికొస్తే నవంబర్‌ 5వ తేదీన బుధవారం గురు నానక్‌ జయంతి సందర్భంగా బ్యాంకులకు హాలీడే ఉండే అవకాశం ఉంది. 

* ఇక నవంబర్‌ 8వ తేదీ, నవంబర్‌ 22వ తేదీన రెండో శనివారం, నాల్గవ శనివారం బ్యాంకులు పనిచేయవు. 
 
డిసెంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకుల సెలవులు: 

* ఏడాదిలో చివరి నెల అయిన డిసెంబర్‌ 13వ తేదీన రెండో శనివారం బ్యాంకులు పనిచేయవు. 

* డిసెంబర్‌ 25వ తేదీన క్రిస్టమస్‌ సందర్భంగా బ్యాంకులకు హాలీడే. 

* డిసెంబర్‌ 27వ తేదీన నాల్గవ శనివారం రోజున బ్యాంకులు పనిచేయవు. 

డిసెంబర్‌లో తెలంగాణలో బ్యాంకు సెలవుల జాబితా: 

* డిసెంబర్‌ 13వ తేదీన రెండో శనివారం బ్యాంకులు పనిచేయవు. 

* డిసెంబర్‌ 25వ తేదీన క్రిస్టమస్‌ సందర్భంగా బ్యాంకులకు హాలీడే. 

* డిసెంబర్‌ 27వ తేదీన నాల్గవ శనివారం రోజున బ్యాంకులు పనిచేయవు. వీటికి అదనంగా అన్ని ఆదివారాలు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. 

నోట్‌: ఈ వివరాలు ఇప్పటికే పేర్కొన్న సెలవుల క్యాలెండర్ ఆధారంగా అందించడం జరిగింది. అయితే కొన్ని ప్రాంతీయ బ్యాంకులకు ప్రత్యేకంగా సెలవులు ఉండే అవకాశం ఉంది. అయితే ఈ రోజుల్లో బ్యాంకులు పనిచేయకపోయినా ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఏటీఎమ్‌లు, యూపీఐ పేమెంట్స్‌ యథావిధిగా పని చేస్తాయి. 

Latest Videos

click me!