Bank account: మీ బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయ్యిందేమో చెక్ చేసుకున్నారా? డిజిటల్ మోసాల నుంచి ఇలా రక్షణ పొందండి

Published : Jun 10, 2025, 10:55 AM ISTUpdated : Jun 10, 2025, 01:18 PM IST

Bank account: ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నాం కదా.. బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ చేయడానికి హ్యాకర్లకు ఇదే సులభమైన మార్గంగా మారుతోంది. డిజిటల్ మోసాల నుంచి రక్షణ పొందాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
బ్యాంక్ అకౌంట్స్ కూడా హ్యాక్ అవుతున్నాయి

డిజిటల్ బ్యాంకింగ్ మన రెగ్యులర్ లైఫ్ లో ఒక భాగంగా మారిపోయింది. అందుకే సైబర్ మోసాలు, బ్యాంక్ అకౌంట్ హ్యాకింగ్‌లు కూడా వేగంగా పెరుగుతున్నాయి. పర్సనల్ అకౌంట్స్ ని కూడా హ్యాక్ చేయడానికి హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారు. అందుకే అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా ఆన్‌లైన్ బెదిరింపుల నుండి మీ బ్యాంక్ అకౌంట్‌ను రక్షించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

25
స్ట్రాంగ్ పాస్‌వర్డ్ పెట్టుకోండి

హ్యాకర్లు మీ అకౌంట్ హ్యాక్ చేయడానికి సులభమైన మార్గాల్లో ఒకటి పాస్‌వర్డ్‌. చాలామంది పాస్ వర్డ్ అంటే 1234 గాని, 1111 లాంటి సింపుల్ పాస్ వర్డ్ పెట్టుకుంటారు. అదేవిధంగా కొందరు పేరు, పుట్టిన తేదీ, సంవత్సరాన్ని పాస్ వర్డ్ కింద పెట్టుకుంటారు. ఇలాంటి అకౌంట్స్ ని హ్యాక్ చేయడం చాలా సింపుల్. అందుకే బిగ్, స్మాల్ లెటర్స్, నంబర్, సింబల్స్ కలిపి పాస్‌వర్డ్‌ పెట్టుకుంటే అది స్ట్రాంగ్ గా ఉంటుంది. 

అదనపు భద్రత కోసం టూ ఫ్యాక్టర్(2FA) ఎంపికను ఎనేబుల్ చేయండి. చాలా బ్యాంకులు లాగిన్ లేదా లావాదేవీల సమయంలో వన్ టైమ్ పాస్‌వర్డ్(OTP) వెరిఫికేషన్‌ను అందిస్తాయి. దాన్ని ఎప్పుడూ డిసేబుల్ చేయవద్దు.

35
బ్యాంక్ అకౌంట్‌ను చెక్ చేస్తూ ఉండండి

మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివిటీని తరచుగా తనిఖీ చేస్తుండాలి. రీసెంట్ ట్రాన్సాక్షన్స్ చూడటానికి ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ను ఉపయోగించండి. ఏదైనా అనుమానాస్పద ట్రాన్సాక్షన్ మీకు కనిపిస్తే వెంటనే మీ బ్యాంక్‌కు తెలియజేయండి. నెలవారీ స్టేట్‌మెంట్ కోసం వెయిట్ చేయకుండా, మీ అకౌంట్‌ను తరచుగా చెక్ చేసుకుంటూ ఉండండి. ఏదైనా పెద్ద నష్టం జరగకుండా ఉండటానికి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

45
ఫేక్ కాల్స్ కి స్పందించకండి

చాలా మంది మోసగాళ్ళు బ్యాంక్ అధికారులుగా నటించి కాల్స్, ఇమెయిల్స్, ఎస్ఎంఎస్ ల ద్వారా ప్రజలను సంప్రదిస్తారు. ఒక విషయం గుర్తుంచుకోండి. బ్యాంకులు మీ పాస్‌వర్డ్, కార్డ్ పిన్, ఓటీపీ వంటి ముఖ్యమైన వివరాలను ఎప్పుడూ అడగవు. అలాంటి కాల్స్, మెసేజ్ లు వస్తే స్పందించకండి. వెంటనే మీ బ్యాంక్ అధికారులకు, సైబర్ క్రైమ్ అధికారులకు కంప్లైంట్ చేయండి.

55
పబ్లిక్ వైఫై ఉపయోగించడం మంచిది కాదు

విమానాశ్రయాలు, కేఫ్‌లు, హోటళ్లలో బిల్స్ పే చేయడానికి పబ్లిక్ వైఫైని ఉపయోగించకండి. ఈ నెట్‌వర్క్‌లు అన్ని వేళలా సురక్షితం కాదు. ఇది హ్యాకర్లకు డేటాను దొంగిలించడాన్ని సులభతరం చేస్తుంది. మీ బ్యాంక్ అకౌంట్‌ను యాక్సెస్ చేసేటప్పుడు సురక్షిత ఇంటర్నెట్ కనెక్షన్, నమ్మదగిన పరికరాన్ని ఉపయోగించడం మంచిది. అలాగే వెంటనే వార్నింగ్ మెసేజ్ లు వచ్చేలా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఇమెయిల్ అప్ డేట్ చేసుకోండి. 

Read more Photos on
click me!

Recommended Stories