Business Idea: ఉద్యోగం బోర్ కొడుతోందా.? ఈ వ్యాపారం చేస్తే నెలకు రూ. లక్ష సంపాదన

Published : Feb 19, 2025, 05:07 PM ISTUpdated : Feb 19, 2025, 06:40 PM IST

యువత ఆలోచన మారుతోంది. ఉద్యోగం చేసే కంటే తాము స్వయంగా వ్యాపారం చేయాలనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇందుకోసం రకరకాల మార్గాలను అన్వేషిస్తుంటారు. అలాంటి ఒక బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా గురించి ఈ రోజు తెలుసుకుందాం..   

PREV
14
Business Idea: ఉద్యోగం బోర్ కొడుతోందా.?  ఈ వ్యాపారం చేస్తే నెలకు రూ. లక్ష సంపాదన
Banana Powder

వ్యాపారం చేయాలని చాలా మంది ఆలోచిస్తుంటారు. అయితే వ్యాపారంలో లాభాలు వస్తాయో,రావో అనే భయంతో వెనుకడుగు వేస్తుంటారు. కానీ మంచి ఐడియా, మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా వ్యాపారలు మొదలు పెడితే మంచి లాభాలు ఆర్జించవచ్చు. అలాంటి బిజినెస్‌ ఐడియాల్లో అరటి పొడి తయారీ ఒకటి. ఇంతకీ అరటి పొడిని ఎందుకు ఉపయోగిస్తారు.? ఈ వ్యాపారం ప్రారంభించాలంటే ఎంత పెట్టుబడి అవసరమవుతుంది? లాభాలు ఎలా ఉంటాయి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం. 

24

అరటిపొడికి ఇటీవల భారీగా డిమాండ్ పెరుగుతోంది. ప్రాసెస్డ్‌ ఫుడ్‌ ఉత్పత్తిగా అరటిపొడికి పేరుంది. అరటి పొడిని బేబీ ఫుడ్‌, బేకరీ ఉత్పత్తులు, హెల్త్ సప్లిమెంట్స్‌తో పాటు పలు రకాల ఆహార ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. ఇతర దేశాలకు కూడా అరటిపొడిని ఎగుమతి చేస్తున్నారు. ఈ కామర్స్‌ సంస్థల్లో కూడా అరటి పొడిని విక్రయిస్తున్నారు. మంచి ప్రోటీన్‌ ఫుడ్‌గా ఇది ఉపయోగపడుతుంది. 
 

34

అరటి పొడి తయారీకి కావాల్సినవి: 

* అరటి కాయలు 

* ప్రిజర్వేటివ్‌లు (ఆర్గానిక్ అయితే అవసరం లేదు)

* పీలింగ్ మషీన్ – అరటి తొక్కలను తొలగించడానికి. 

* స్లైసింగ్ మషీన్ – అరటిని చిన్న చిన్న ముక్కలుగా కోయడానికి. 

* డ్రయింగ్ మషీన్ - ముక్కలుగా చేసుకున్న అరటిని ఎండబెట్టడానికి. 

* గ్రైండింగ్ మషీన్  – అరటి ముక్కలను పొడి చేయడానికి

* ప్యాకేజింగ్ మషీన్ - అరటి పొడిని ప్యాక్‌ చేయడానికి. 

అవసరమైన లైసెన్సులు, బిజినెస్‌ రిజిస్ట్రేషన్‌: 

ఈ వ్యాపారం ప్రారంభించాలంటే FSSAI లైసెన్స్ (Food Safety and Standards Authority of India)నుంచి సర్టిఫికేట్ పొందాలి. అదే విధంగా MSME రిజిస్ట్రేషన్ ఉండాలి. ఇక జీఎస్‌టీ రిజిష్ట్రేన్‌, ఎగుమతి చేయడానికి ఇంపోర్ట్‌, ఎక్స్‌పోర్ట్‌ కోడ్ ఉండాలి. ఇవన్నీ సర్టిఫికేట్స్‌ ఉంటే కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా పెట్టుబడి సాయాన్ని కూడా పొందొచ్చు. 

44

పెట్టుబడి, లాభాలు.. 

అరటి పొడి తయారీకి అవసరమయ్యే ముడ సరుకుకు సుమారు రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇక మిషిన్స్‌, సెటప్‌ కోసం గరిష్టంగా రూ. 3 నుంచి రూ. 5 లక్షలు కావాలి. అదే విధంగా లైసెన్స్, ఇతర ఖర్చులకు రూ. 50 వేలు, మార్కెటింగ్‌.. బ్రాండింగ్‌ కోసం రూ. 1 లక్ష వరకు అవసరపడుతుంది. ఇలా సుారు రూ. 5 నుంచి రూ. 7 లక్షల్లో ఈ బిజినెస్‌ సెటప్‌ చేసుకోవచ్చు. అయితే ప్రారంభంలో చిన్న చిన్న మిషిన్స్‌తో ప్రారంభిస్తే కేవలం రూ. 2 లక్షల్లో కూడా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. 

ఇక లాభాల విషయానికొస్తే మార్కెట్లో ప్రస్తుతం కిలో అరటి పొడి ధర రూ. 200 నుంచి రూ. 500 పలుకుతోంది. ఒక్క కిలో అరటి పొడి తయారు చేసేందుకు 8 నుంచి 10 కిలోల అరటి అవసరపడుతుంది. తక్కువలో తక్కువ 50 నుంచి 60 శాతం లాభాలు వస్తాయి. తక్కువలో తక్కువ ప్రతీ నెలా రూ. లక్ష వరకు లాభాలు ఆర్జించవచ్చు. 

వ్యాపారం ఎలా చేయాలి.? 

అరటి పొడిని మీ సొంత బ్రాండింగ్‌తో ప్యాక్‌ చేసుకొని విక్రయించవచ్చు. స్థానికంగా ఉన్న సూపర్‌ మార్కెట్లతో పాటు అమెజాన్‌, ఫ్లిక్‌కార్ట్‌, బిగ్‌బాస్కెట్‌, జెప్టో వంటి వాటితో ఒప్పందం చేసుకోవచ్చు. అదే విధంగా మీ ప్రొడక్ట్‌ బ్రాండింగ్‌ కోసం ఫేస్‌బుక్‌‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ బిజినెస్‌ వంటి ప్లాట్‌ఫామ్స్‌ వాటిలో ప్రమోట్‌ చేసుకోవచ్చు. వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిచాలంటే మంచి నాణ్యత ఉన్న అరటి పండ్లను ఉపయోగించాలి. అదే విధంగా ప్రాసెసింగ్, ప్యాకేజీంగ్‌ విషయంలో శుభ్రత పాటించాలి. 
 

click me!

Recommended Stories