ఈ కారును తొలిసారి 2019లో భారత మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ కారును యల్లో, బ్లాక్, వైట్ కలర్స్‌లో తీసుకొచ్చింది. అలాగే ఎల్‌పీజీ, సీఎన్‌జీ వేరియంట్స్‌లో ఈ కారును రూపొందించారు. ఈ కారులో 216.6 సీసీతో కూడిన లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను అందించారు. 20.6 లీటర్లు ఈ కారు ఫ్యూయల్ కెపాసిటీ. ఈ కారు పరిమాణంలో చాలా చిన్నగా ఉండడంతో ఎంతటి ట్రాఫిక్‌లో అయినా దూసుకెళ్లొచ్చు. ఆటో గేర్, ఏసీ వంటి అధునాతన ఫీచర్లను అందించారు.