మహిళలకు ఆర్థిక సాయం అందించే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకువచ్చారు. బీమా సఖి యోజన పథకాన్ని ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ద్వారా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మహిళలకు శిక్షణ, ఉద్యోగ అవకాశాలను కల్పించడంతో పాటు వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా కృషి చేస్తారు.
అర్హులెవరు?
మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. పదో తరగతి పాసైన వాళ్ళు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు 18 నుంచి 70 ఏళ్ల మధ్యలో ఉండాలి.