ఈ కోళ్లు మధ్యస్థంగా బరువు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాలతో పాటుగా, పట్టణ ప్రాంతాల్లో కూడా వీటిని ఇష్టంగా తింటారు. వీటికి రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ. ఈ కోళ్లు వేగంగా కదులుతాయి. అంతేకాదు కుక్కులు, పిల్లులు, గద్దలు వంటి జంతువులకు దొరకవు. అంతేకాదు వీటి గుడ్లు కూడా గోధుమ రంగులో ఉంటాయి. అందుకే వీటిని సాధారణ కోడి గుడ్ల కన్నా కూడా ఎక్కువ ధరకు విక్రయించవచ్చు.