అదానీ ప్రపంచంలోనే మూడవ అత్యంత ధనవంతుడు ఎలా అయ్యాడు.. ఎవరికీ తెలియని సీక్రెట్ ఇదే..

First Published Sep 2, 2022, 1:55 PM IST

గత రెండేళ్లలో కోవిడ్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చాలా నష్టపోయింది. అయితే ప్రస్తుతం నెమ్మదిగా రికవరీ బాటలో పట్టింది. అయితే కొంతమంది పారిశ్రామికవేత్తల సంపదలో మాత్రం చాలా మార్పులు వచ్చాయి. భారతదేశపు అత్యంత సంపన్న వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సంపద మాత్రం ఈ కాలంలోనే విపరీతంగా పెరిగింది.

ప్రస్తుతం గౌతమ్ అదానీ భారతదేశంలోనే కాకుండా ఆసియాలోనే నెం.1 సంపన్న వ్యాపారవేత్త. అంతేకాదు గౌతమ్ అదానీ ప్రపంచంలోని మూడవ అత్యంత సంపన్న వ్యాపారవేత్తగా నిలిచాడు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో ప్రపంచంలోని మొదటి మూడు సంపన్నుల జాబితాలోకి ప్రవేశించిన ఆసియా నుండి అదానీ మొదటి వ్యక్తి అయ్యాడు. మొత్తం 137.4 బిలియన్ డాలర్ల (సుమారు 11 లక్షల కోట్లు) సంపదతో అదానీ లూయిస్ విట్టన్ బ్రాండ్ వ్యవస్థాపకుడు ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగమించి ప్రపంచంలోనే మూడో అత్యంత సంపన్న వ్యాపారవేత్తగా నిలిచాడు.
 

గౌతం అదానీ నెం.1 టైటిల్ కోసం ఇద్దరు మాత్రమే మిగిలారు. టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ 251 బిలియన్ల నికర విలువతో నెం.1 స్థానంలో ఉన్నారు. 153 బిలియన్లతో జెఫ్ బెజోస్ నెం.1 స్థానంలో ఉన్నారు. అదానీ ప్రపంచంలోనే మూడవ అత్యంత సంపన్న వ్యాపారవేత్తగా ఎలా నిలిచారు? ఆయన సంపద ఎలా పెరిగింది? అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలింది. .
 

2022 నాటికి అదానీ సంపదకు 60.9 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది. కానీ ఫిబ్రవరిలో అదానీ ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తగా అవతరించారు. ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముకేశ్ అంబానీని ఆయన అధిగమించారు. 
 

జనవరి 1, 2020న కోవిడ్ ప్రారంభానికి ముందు గౌతమ్ అదానీ సంపద 10 బిలియన్లు. అదే సమయంలో ముఖేష్ అంబానీ సంపద 59 బిలియన్ అమెరికన్ డాలర్లు. కానీ అదానీ సంపద కేవలం రెండేళ్లలో ఆరు రెట్లు పెరిగింది. నేడు అదానీ సంపద 137 బిలియన్ డాలర్లు. అదే ముఖేష్ అంబానీ సంపద 91.9 బిలియన్ డాలర్లు. ప్రపంచ సంపన్నుల జాబితాలో అదానీ మూడో స్థానంలో ఉండగా, అంబానీ 11వ స్థానంలో ఉన్నారు. 
 

2021లో 5 కంపెనీల స్థాపన
సెప్టెంబర్ 2021లో గౌతమ్ అదానీ రూ. 1 లక్ష కోట్ల మార్కెట్ విలువతో (13 బిలియన్ డాలర్లు) 5 కంపెనీలను స్థాపించారు. హురున్ ఇండియా సంపన్నుల జాబితా ప్రకారం అదానీ సంపద ఇతరులతో పోలిస్తే 2021లో భారీగా పెరిగింది. ఆయన సంపదకు 49 బిలియన్ డాలర్లు చేరాయి. ఆ కాలంలో ఆయన సంపద వారానికి రూ.6,000 కోట్ల మేర పెరిగింది. ఏప్రిల్ 2022లో, అదానీ మైక్రోసాఫ్ట్ CEO బిల్ గేట్స్‌ను అధిగమించి ప్రపంచంలోని నాల్గవ సంపన్న వ్యక్తిగా నిలిచాడు.

గత ఐదేళ్లలో గౌతమ్ అదానీ వీలైనన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టి తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. బొగ్గు గనుల నుంచి పోర్టులు, సిమెంట్, మీడియా, సిటీ గ్యాస్ పంపిణీ ఇలా అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. అదానీ గ్రూప్ ప్రస్తుతం భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ ఓడరేవు మరియు విమానాశ్రయ నిర్వహణ సంస్థగా ఉంది. 

click me!