Business Ideas: 5 సెకండ్ హ్యాండ్ ఆటోలతో అధిక లాభాలు సంపాదించే బిజినెస్ ఇది. రూ.10 లక్షల పెట్టుబడితో(ఒక్కో ఆటోకు రూ. 2 లక్షలు) 5 సెకండ్ హ్యాండ్ ఆటోలను కొనుగోలు చేయవచ్చు. ప్రతి ఆటోను రోజుకు రూ. 500 అద్దెకు ఇవ్వడం ద్వారా..
ఉద్యోగం చేసి విసిగిపోయిన వారు, ఆఫీస్‌లో బాస్ పోరు పడలేనివారికి ఈ బిజినెస్ ఓ బెస్ట్ ఛాయస్. ఇది ఒక డిమాండ్ ఉన్న బిజినెస్. పెట్టుబడికి కాస్త డబ్బు ఉంటే చాలు.. ప్రతీ నెలా మంచి రాబడి వస్తుంది. మరి ఆ బిజినెస్ ఐడియా ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ఓ అంచనా వేసేద్దాం.
25
రూ. 10 లక్షల పెట్టుబడితో
రూ. 10 లక్షల పెట్టుబడితో 5 సెకండ్ హ్యాండ్ ఆటోలు కొని అద్దెకు ఇవ్వడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చు. ప్రతి ఆటోకు రోజుకు రూ. 500 అద్దె.. అదనంగా యాడ్స్ ద్వారా ఆదాయం లభిస్తుంది. సర్వీసింగ్ ఖర్చులు పోగా, ఈ వ్యాపారంలో సంవత్సరానికి రూ. 9.15 లక్షల నికర లాభం సంపాదించవచ్చు. ఇది తక్కువ పెట్టుబడితో అధిక రాబడిని అందించే చక్కటి వ్యాపారం.
35
ఆటోలతో అధిక లాభాలు
5 సెకండ్ హ్యాండ్ ఆటోలతో అధిక లాభాలు సంపాదించే బిజినెస్ ఇది. రూ.10 లక్షల పెట్టుబడితో(ఒక్కో ఆటోకు రూ. 2 లక్షలు) 5 సెకండ్ హ్యాండ్ ఆటోలను కొనుగోలు చేయవచ్చు. ప్రతి ఆటోను రోజుకు రూ. 500 అద్దెకు ఇవ్వడం ద్వారా, 5 ఆటోల నుంచి రోజుకు రూ. 2,500 ఆదాయం వస్తుంది. నెలకు ఇది రూ. 75,000 అవుతుంది.
అదనంగా, ఆటోల వెనుక భాగంలో యాడ్స్ ద్వారా రోజుకు 5 ఆటోలకు రూ. 250 సంపాదించవచ్చు. ఇది నెలకు రూ. 7,500. మొత్తం నెలవారీ ఆదాయం రూ. 82,500. సంవత్సరానికి ఈ ఆదాయం రూ. 9.90 లక్షలకు చేరుకుంటుంది. ఏడాది నిర్వహణ, రిపేరు ఖర్చులు (ఒక్కో ఆటోకు రూ. 15,000.. 5 ఆటోలకు రూ. 75,000) తీసివేయగా, నికర వార్షిక లాభం రూ. 9.15 లక్షలుగా ఉంటుంది. తక్కువ పెట్టుబడితో స్థిరమైన, అధిక లాభాలను ఆర్జించడానికి ఈ ఆటో అద్దె వ్యాపారం ఒక మంచి అవకాశంగా నిలుస్తుంది.
55
మార్కెటింగ్ ముఖ్యం..
అటు ఇలాంటి వ్యాపారాలకు కష్టం, శారీరిక శ్రమ తప్పనిసరిగా ఉండాలి. అలాగే మార్కెటింగ్ లాంటి వాటిని కూడా మెయిన్టైన్ చేస్తే కచ్చితంగా మీ బిజినెస్ మంచిగా సాగుతుంది.