ఆగస్టు నెలలో పండుగల సందడి ఎక్కువగా ఉంటుంది. అయితే ఆర్బీఐ రూల్స్ ప్రకారం దేశవ్యాప్తంగా ఇచ్చే సెలవులతో పాటు కొన్ని ప్రత్యేక ప్రాంతీయ పండుగలకు ఆయా రాష్ట్రాల్లో మాత్రమే బ్యాంకులు క్లోజ్ ఉంటాయి.
• ఆగస్టు 4: త్రిపురలో 'కెర్ పూజ' సందర్భంగా బ్యాంకులు పనిచేయవు.
• ఆగస్టు 8: సిక్కింలో 'టెండోంగ్ లో రుమ్ ఫాట్' జరుపుకుంటారు.
• ఆగస్టు 13: మణిపూర్ లో 'పేట్రియాట్స్ డే' వేడుకల వల్ల బంద్.
• ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూతపడతాయి.
• ఆగస్టు 16: డామన్-డయ్యూ, గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాల్లో 'పార్సీ నూతన సంవత్సరం' సెలవు.
• ఆగస్టు 19: త్రిపురలో 'మహారాజా బీర్ బిక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్ జయంతి' సెలవు.
• ఆగస్టు 25: మిలాద్-ఉన్-నబీ / మొదటి ఓనం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.
• ఆగస్టు 26: ఈద్-ఎ-మిలాద్ / తిరువోణం సందర్భంగా తెలంగాణ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో సెలవు.
• ఆగస్టు 27: ఒడిశాలో 'ఝూలన్ యాత్ర' సందర్భంగా బ్రాంచీలు క్లోజ్.
• ఆగస్టు 28: రక్షా బంధన్, శ్రీ నారాయణ గురు జయంతి వంటి సందర్భాల్లో గుజరాత్, రాజస్థాన్, యూపీ, ఎంపీ, కేరళ వంటి పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు హాలిడే.