రూ.12,000 కడితే.. 160 కి.మీ మైలేజ్ ఇచ్చే స్కూటర్ ఇంటికి తీసుకెళ్లొచ్చు

First Published | Nov 13, 2024, 3:45 PM IST

మీరు ఎక్కువ దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నారా?  కేవలం రూ.12 వేలు కడితే 160 కి.మీ. ప్రయాణించే స్కూటర్ మీరు ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఆ స్కూటర్ పేరు, ఎంత సేపు ఛార్జింగ్ పెట్టాలి ఇలాంటి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం రండి.

ఎలక్ట్రిక్ వెహికల్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా దూర ప్రయాణం చేయాలంటే మీరు కచ్చితంగా Ather Rizta Z తీసుకోవాలి. ఎందుకంటే Ather Rizta Z ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన ఫీచర్లు, లాంగ్ రన్ వర్కింగ్ ఇస్తుంది. అందుకే మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇది సిటీస్ లో, టౌన్స్ లో ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది. దీంతో పాటు కంపెనీ ఈ స్కూటర్‌పై ఆకర్షణీయమైన ఫైనాన్స్ స్కీమ్ కూడా అందిస్తోంది. 

బ్యాటరీ, మోటార్ వివరాలు..

Ather Rizta Z లో 4.3 kW PMSM మోటార్ ను అమర్చింది. ఇది 22 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 3.7 kWh లిథియం అయాన్ బ్యాటరీ కూడా ఉంది. దీనిపై కంపెనీ 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వారంటీని అందిస్తోంది. ఈ స్కూటర్ మాక్సిమం గంటకు 80 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం Ather Rizta Z ద్వారా మీరు పొందొచ్చు. 


ఆధునిక ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

Ather Rizta Z సెక్యూరిటీ అలారం, USB ఛార్జింగ్ పోర్ట్, ఫోన్ కాల్స్, SMS అలర్ట్, మ్యాప్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్, Wi-Fi కనెక్టివిటీ వంటి అనేక ఆధునిక ఫీచర్లను కలిగి ఉంది. ఇవి కాకుండా ఇందులో రోడ్‌సైడ్ అసిస్టెన్స్, మ్యూజిక్ కంట్రోల్స్, 7 అంగుళాల TFT డిస్ప్లే కూడా ఉన్నాయి. LED లైట్లతో  పాటు తక్కువ బ్యాటరీ ఇండికేటర్ కూడా ఇందులో ఉంది.
 

సస్పెన్షన్, బ్రేకింగ్ సిస్టమ్

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ కలిగి ఉంది. బ్రేకింగ్ కోసం ముందు చక్రంలో డిస్క్ బ్రేక్‌లు, వెనుక చక్రంలో డ్రమ్ బ్రేక్‌లు అమర్చారు. ఇవి ప్రమాదాలు జరగకుండా బండి వెంటనే ఆగేలా చేస్తుంది. అందువల్ల మీ ప్రయాణం సురక్షితంగా సాగుతుంది. 
 

.

ఫైనాన్స్ స్కీమ్ ఎలాగంటే.. 

Ather Rizta Z ఎక్స్-షోరూమ్ ధర రూ.1,27,046. ఇందులోనే టాప్ వేరియంట్ ధర రూ.1,47,047. మీ బడ్జెట్ తక్కువగా ఉంటే రూ.12,000 డౌన్ పేమెంట్ చెల్లిస్తే చాలు మీరు వెహికల్ ఇంటికి తీసుకెళ్లొచ్చు. మిగిలిన అమౌంట్ మీరు EMI ల ద్వారా చెల్లించాలి. బ్యాంక్ మీకు 9.7% వడ్డీ రేటుతో 36 నెలలకు లోన్ అందిస్తుంది. దాని నెలవారీ EMI రూ.3,450 కట్టాల్సి ఉంటుంది. 

కాబట్టి Ather Rizta Z ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన ప్రయాణ అనుభవాన్ని మీకు అందించడమే కాకుండా కంపెనీ ఇచ్చే ఫైనాన్స్ స్కీమ్ మీకు సులభ వాయిదాలు కట్టేలా అవకాశం కల్పిస్తుంది. మీరు స్మార్ట్ వెహికల్, పర్యావరణ అనుకూల వాహనాన్ని కోరుకుంటే Ather Rizta Z మీకు సరైన ఎంపిక అవుతుంది.

Latest Videos

click me!