ప్ర‌తీ నెల రూ. 5 వేల పెన్ష‌న్‌.. రూ. 8.5 ల‌క్ష‌ల డ‌బ్బు.. ఇలాంటి అవ‌కాశం ఎవ‌రు వ‌దులుకుంటారు చెప్పండి

Narender Vaitla   | SIGWIRE
Published : Jun 23, 2026, 09:55 AM IST

APY: పేద, దిగువ మధ్య తరగతి, అసంఘటిత రంగ కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజనను (APY) అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా ప్రతీ నెల పెన్షన్ అలాగే రూ.8.5 లక్షల వరకు కార్పస్ పొందవచ్చు. 

PREV
16
పదవి విరమణ తర్వాత..

భారతదేశంలోని పేద, దిగువ మధ్య తరగతి ప్రజలు, ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని అమలు చేస్తోంది. అదే అటల్ పెన్షన్ యోజన (APY). ఈ పథకం ద్వారా, చందాదారులు నెలకు కేవలం రూ.210 చెల్లించడం ద్వారా 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. అంతేకాకుండా, రూ.8.5 లక్షల వరకు కార్పస్ ప్రయోజనం కూడా లభిస్తుంది. ఈ పథకాన్ని పింఛన్ నిధి నియంత్రణ, అభివృద్ధి అథారిటీ (PFRDA) నిర్వహిస్తుంది.

సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత పెన్షన్ లభిస్తుంది. అయితే, భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీల వంటి అసంఘటిత రంగంలోని వారికి అలాంటి సామాజిక భద్రత ఉండదు. ఈ లోపాన్ని భర్తీ చేయడానికి, 2015 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజనను ప్రకటించింది. ఈ పథకం ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పెన్షన్ అందించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఇటీవల వెల్లడించిన కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు 9 కోట్ల మందికి పైగా ఈ పథకంలో చేరారు.

26
అటల్ పెన్షన్ యోజన: ఎవరి కోసం, ఏంటి ప్రయోజనం?

అటల్ పెన్షన్ యోజన (APY) అనేది భారత పౌరులందరికీ అందుబాటులో ఉన్న ఒక సామాజిక భద్రతా పథకం. ఇది ముఖ్యంగా తక్కువ ఆదాయం కలిగిన అసంఘటిత రంగ కార్మికులను లక్ష్యంగా చేసుకుంది. ఈ పథకంలో చేరిన వారు 60 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు నిర్ణీత పెన్షన్ పొందుతారు. ఈ పెన్షన్ మొత్తం వారు చేసే నెలవారీ చెల్లింపులను బట్టి మారుతుంది.

36
అర్హతలు, ప్రీమియం చెల్లింపులు

అటల్ పెన్షన్ యోజనలో చేరడానికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సున్న భారతీయ పౌరులు అర్హులు. ఈ పథకంలో చేరడానికి పోస్టాఫీసు లేదా ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా తప్పనిసరి. అయితే, నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS)లో ఇప్పటికే ఉన్నవారు లేదా ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఈ పథకంలో చేరడానికి అర్హులు కారు. చెల్లించాల్సిన ప్రీమియం మొత్తం చందాదారుని వయస్సుతో పాటు కోరుకున్న పెన్షన్ మొత్తాన్ని బట్టి మారుతుంది. ఉదాహరణకు, 18 ఏళ్ల వయస్సులో చేరి, నెలకు రూ.5,000 పెన్షన్ పొందాలనుకునే వారు 42 సంవత్సరాల పాటు నెలకు రూ.210 చెల్లించాలి. అదే 40 ఏళ్ల వయస్సులో చేరినవారు 20 సంవత్సరాల పాటు నెలకు రూ.1454 చెల్లించాల్సి ఉంటుంది.

46
పెన్షన్, కార్పస్ వివరాలు

ఈ పథకంలో చేరినవారు 60 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత వారు చేసిన చెల్లింపులకు అనుగుణంగా నెలకు రూ.1,000, రూ.2,000, రూ.3,000, రూ.4,000 లేదా రూ.5,000 పెన్షన్ పొందుతారు. APY ద్వారా మూడు రకాల ప్రయోజనాలు లభిస్తాయి. పదవీ విరమణ వయస్సు దాటాక పెన్షన్ తో పాటు, ఒకవేళ చందాదారుడు మరణిస్తే జీవిత భాగస్వామికి అదే పెన్షన్ బదిలీ అవుతుంది. చందాదారుడు, జీవిత భాగస్వామి ఇద్దరూ మరణిస్తే, నామినీకి రిటైర్మెంట్ కార్పస్ మొత్తం అందుతుంది. ఎంచుకున్న పెన్షన్ మొత్తాన్ని బట్టి కార్పస్ కూడా మారుతుంది: రూ.1,000 పెన్షన్ కోసం రూ.1.70 లక్షలు, రూ.2,000 పెన్షన్ కోసం రూ.3.40 లక్షలు, మరియు రూ.5,000 పెన్షన్ కోసం రూ.8.50 లక్షల కార్పస్ లభిస్తుంది.

56
పథకంలో ఎలా చేరాలి.?

అటల్ పెన్షన్ యోజనలో చేరడం చాలా సులభం. పోస్టాఫీసులతో పాటు దేశంలోని అన్ని జాతీయ బ్యాంకుల్లో ఈ పథకంలో చేరవచ్చు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ లో దరఖాస్తు చేయాలంటే, బ్యాంక్ శాఖకు వెళ్లి రిజిస్ట్రేషన్ ఫామ్ లోని అన్ని వివరాలను నింపి, అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలి. ఆన్‌లైన్ లో దరఖాస్తు చేయాలనుకుంటే, బ్యాంక్ మొబైల్ యాప్ లేదా eNPS పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు అవసరమైన పత్రాలలో ఆధార్ కార్డు, సేవింగ్స్ ఖాతా వివరాలు, ఫోన్ నంబర్, వయసు ధ్రువీకరణ పత్రంతో KYC పత్రాలు ఉంటాయి.

66
నియమాలు, పెనాల్టీలు, మరణానంతర ప్రయోజనాలు

చందాదారులు తమ బ్యాంక్ ఖాతాను కంట్రిబ్యూషన్ ఖాతాతో లింక్ చేసి, నెలవారీ ఆటో డెబిట్ సదుపాయాన్ని ఎంచుకోవచ్చు. అయితే, ప్రతి నెలా బ్యాంక్ ఖాతాలో తగిన బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. లేనిపక్షంలో ఆలస్య రుసుములు (పెనాల్టీలు) వర్తిస్తాయి. నెలకు రూ.100 వరకు కట్టేవారికి రూ.1, రూ.101 నుండి రూ.500 కట్టేవారికి రూ.2, రూ.1,000లోపు చెల్లించేవారికి రూ.5, రూ.1,000 పైన చెల్లించేవారికి రూ.10 చొప్పున పెనాల్టీ పడుతుంది.

వరుసగా 6 నెలలు కంట్రిబ్యూషన్లు చెల్లించకపోతే పెన్షన్ ఖాతాను నిలిపివేస్తారు. 24 నెలల వరకు కట్టకపోతే, ఖాతాను మూసివేసి అప్పటి వరకు చెల్లించిన డబ్బును తిరిగి ఇచ్చేస్తారు. ఒకవేళ చందాదారుడు 60 సంవత్సరాలు రాకముందే మరణిస్తే, ఖాతా కొనసాగింపు ఆప్షన్ జీవిత భాగస్వామికి మాత్రమే ఉంటుంది. జీవిత భాగస్వామి చందాదారుని వయస్సు 60 ఏళ్లు దాటే వరకు ఖాతాను కొనసాగించవచ్చు. లేదా, ఖాతాను మూసివేసి, చందాదారుడు చేసిన పెట్టుబడిపై వచ్చే వడ్డీతో సహా మొత్తం డబ్బును జీవిత భాగస్వామి పొందవచ్చు. మరణించిన వ్యక్తి అవివాహితుడైతే లేదా విడాకులు తీసుకున్నట్లయితే, నామినీకి ఆ డబ్బు అందుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories