Best Cars: కొత్త కారు కొనేటప్పుడు దాని రీసేల్ వ్యాల్యూ గురించి కూడా తెలుసుకునే కొనాలి. సరైన కారును ఎంచుకుంటే, చాలా ఏళ్లు వాడిన తర్వాత కూడా దాని ధరలో 80 శాతం ధరకు వరకు అమ్యే అవకాశం ఉంటుంది. ఆ కార్లు ఏవో తెలుసుకోండి.
భారత కార్ మార్కెట్లో రీసేల్ వ్యాల్యూలో టయోటా కార్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి వాటిలో ఇన్నోవా క్రిస్టానే టాప్. 5 ఏళ్లు వాడిన తర్వాత కూడా దీనికి దాని అసలు ధరలో 75 శాతం నుంచి 80 శాతం ధరకు అమ్మేయచ్చు. దీనికి కారణం టయోటా ఇంజిన్ పై ఉన్న నమ్మకం. కుటుంబ ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉంటుంది. ట్యాక్సీ/కమర్షియల్ రంగంలో దీనికి తిరుగులేని డిమాండ్ ఉంది. పాత మోడల్స్ అయినా మార్కెట్లో వెంటనే అమ్ముడైపోతాయి.
25
టయోటా ఫార్చ్యునర్
ప్రీమియం ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో టయోటా ఫార్చ్యూనర్ అదరగొడుతోంది. దీని రీసేల్ వ్యాల్యూ 70% - 80% వరకు ఉంటుంది. ఇది కేవలం కారు మాత్రమే కాదు, ఒక 'స్టేటస్ సింబల్'. దీని గంభీరమైన లుక్, ఆఫ్-రోడ్ సామర్థ్యం, ఎక్కువ కాలం మన్నడం వంటివి సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కూడా దీని ధర తగ్గకుండా చూస్తున్నాయి. మెయింటెనెన్స్ ఖర్చు కొంచెం ఎక్కువే అయినా, రీసేల్ వ్యాల్యూ దాన్ని కవర్ చేస్తుంది.
35
మహీంద్ర థార్
అడ్వెంచర్ ప్రియులకు మహీంద్రా థార్ హాట్ ఫేవరెట్. దీని రీసేల్ వ్యాల్యూ అసలు ధరలో 70 శాతం వరకు కవర్ అవుతుంది. యువతలో దీనికి విపరీతమైన క్రేజ్ ఉంది. మార్కెట్లో సప్లై కన్నా డిమాండ్ ఎక్కువగా ఉండటంతో, సెకండ్ హ్యాండ్ మార్కెట్లో థార్ కార్లకు చాలా మంచి ధర పలుకుతోంది.
మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అమ్మకాల రికార్డులు సృష్టిస్తున్నాయి హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్. ఈ కార్లు 70% - 75% వరకు రీసేల్ వ్యాల్యూను అందిస్తున్నాయి. ఈ కార్లలో ఉన్న ఆధునిక ఫీచర్లు, స్టైలిష్ లుక్, అద్భుతమైన డ్రైవింగ్ క్వాలిటీ ఇవన్నీ రీసేల్ వాల్యూను పెంచుతున్నాయి. ముఖ్యంగా వీటి డీజిల్ వేరియంట్లకు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది.
55
మారుతి సుజుకి స్విఫ్ట్
తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ రీసేల్ వ్యాల్యూ ఇచ్చే కారు మారుతి సుజుకి స్విఫ్ట్. దీని రీసేల్ వ్యాల్యూ 70% - 75% వరకు ఉంటుంది. మారుతికి ఉన్న విస్తృతమైన సర్వీస్ నెట్‌వర్క్, చాలా తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, మంచి మైలేజ్. మొదటిసారి కారు కొనేవారికి, యువతకు ఇది ఫస్ట్ ఛాయిస్ కాబట్టి, దీనికి డిమాండ్ ఎప్పుడూ తగ్గదు.