Apple : సూపర్ కంప్యూటర్ మీ చేతుల్లోనే.. సరికొత్త M5 ప్రో, M5 మ్యాక్స్ చిప్‌లతో ఆపిల్ సంచలనం

Published : Mar 03, 2026, 11:07 PM IST

MacBook Air M5 : ఆపిల్ తన అత్యంత శక్తివంతమైన M5 ప్రో, M5 మ్యాక్స్ చిప్‌లను విడుదల చేసింది. కొత్త ఫ్యూజన్ ఆర్కిటెక్చర్‌తో రూపొందిన ఈ చిప్‌లు మ్యాక్‌బుక్ ప్రో పనితీరును, ఏఐ సామర్థ్యాలను టాప్ లోకి తీసుకెళ్లనున్నాయి.

PREV
16
ఆపిల్ నుంచి నెక్స్ట్ లెవల్ చిప్‌సెట్స్.. ఎం5 సిరీస్‌తో మ్యాక్‌బుక్ ప్రో అప్డేట్

టెక్ దిగ్గజం ఆపిల్ తన ప్రొఫెషనల్ లాప్‌టాప్‌ల కోసం ప్రపంచంలోనే అత్యంత అధునాతన చిప్‌లైన M5 ప్రో, M5 మ్యాక్స్ లను అధికారికంగా ప్రకటించింది. కొత్త మ్యాక్‌బుక్ ప్రో మోడళ్లకు శక్తినిచ్చే ఈ చిప్‌లు, ఆపిల్ సొంతంగా రూపొందించిన సరికొత్త ఫ్యూజన్ ఆర్కిటెక్చర్ (Fusion Architecture) ఆధారంగా నిర్మించారు. ఈ కొత్త టెక్నాలజీతో ప్రొఫెషనల్ వర్క్‌ఫ్లోలు, ఏఐ అప్లికేషన్లలో ఊహించని వేగాన్ని ఆపిల్ ఆవిష్కరించింది.

26
ఆపిల్ సరికొత్త ఫ్యూజన్ ఆర్కిటెక్చర్

M5 ప్రో, M5 మ్యాక్స్ చిప్‌లు ఆపిల్ రూపొందించిన అత్యాధునిక ఫ్యూజన్ ఆర్కిటెక్చర్‌ను పరిచయం చేస్తున్నాయి. ఇది రెండు వేర్వేరు డైలను ఒకే సిస్టమ్ ఆన్ చిప్ గా అనుసంధానిస్తుంది. మూడవ తరం 3-నానోమీటర్ టెక్నాలజీతో తయారైన ఈ చిప్‌లు, హై బ్యాండ్‌విడ్త్, తక్కువ లేటెన్సీని కలిగి ఉంటాయి. ఇందులో శక్తివంతమైన సీపీయూ, స్కేలబుల్ జీపీయూ, మీడియా ఇంజిన్, న్యూరల్ ఇంజిన్ కలగలిసి ఉంటాయి. దీనివల్ల ప్రొఫెషనల్ వినియోగదారులు క్లిష్టమైన పనులను కూడా అత్యంత వేగంగా పూర్తి చేయవచ్చు.

36
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆపిల్ సీపీయూ కోర్లు

ఈ చిప్‌లలో సరికొత్త 18-కోర్ CPU ఆర్కిటెక్చర్‌ను ఆపిల్ వాడింది. ఇందులో 6 సూపర్ కోర్లు ఉన్నాయి, ఇవి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సింగిల్-థ్రెడెడ్ పనితీరును అందిస్తాయి. వీటితో పాటు 12 కొత్త పెర్ఫార్మెన్స్ కోర్లు మల్టీ-థ్రెడెడ్ పనుల కోసం కేటాయించారు. మునుపటి M1 ప్రో, M1 మ్యాక్స్ చిప్‌లతో పోలిస్తే, ఇవి 2.5 రెట్లు ఎక్కువ పనితీరును కనబరుస్తాయి. దీనివల్ల డేటా విశ్లేషణ, కోడ్ కంపైలేషన్, భారీ సిమ్యులేషన్స్ వంటి పనులు సులభతరం అవుతాయి.

46
ఆపిల్ కొత్త చిప్ లతో AI, గ్రాఫిక్స్ రంగంలో భారీ మార్పులు

గ్రాఫిక్స్ విషయానికి వస్తే, M5 మ్యాక్స్ 40-కోర్ జీపీయూ వరకు సపోర్ట్ చేస్తుంది. ప్రతి జీపీయూ కోర్‌లో న్యూరల్ యాక్సిలరేటర్ ఉండటం వల్ల, ఏఐ పనుల్లో మునుపటి తరం కంటే 4 రెట్లు ఎక్కువ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. రే ట్రేసింగ్ అప్లికేషన్లలో 35 శాతం వరకు మెరుగైన గ్రాఫిక్స్ లభిస్తాయి. ఎం5 ప్రో చిప్ 64GB వరకు, ఎం5 మ్యాక్స్ చిప్ 128GB వరకు యూనిఫైడ్ మెమరీని సపోర్ట్ చేస్తాయి. దీనివల్ల భారీ ఎల్ఎల్ఎం, 3D రెండరింగ్ చేసే వారికి ఇది ఒక వరంగా మారనుంది.

56
M5 చిప్‌తో మ్యాక్‌బుక్ ఎయిర్, ప్రో.. ధరలు ఎంత?

ఆపిల్ కేవలం చిప్‌లనే కాకుండా, M5 చిప్‌తో కూడిన కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ (MacBook Air) ను కూడా ప్రకటించింది.

• మ్యాక్‌బుక్ ఎయిర్: 13-అంగుళాల మోడల్ ప్రారంభ ధర సుమారు ₹91,100 ($1,099). ఇందులో బేస్ స్టోరేజీని 512GB కి పెంచారు.

• మ్యాక్‌బుక్ ప్రో: M5 ప్రో చిప్‌తో కూడిన 14-అంగుళాల మోడల్ ప్రారంభ ధర సుమారు ₹1,82,300 ($2,199). ఇందులో ఇప్పుడు 1TB స్టోరేజ్ బేస్ వేరియంట్ గా వస్తుంది.

ఈ కొత్త మ్యాక్‌లు మార్చి 4 నుండి ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంటాయి, మార్చి 11 నుండి విక్రయాలు ప్రారంభమవుతాయి.

66
ఆపిల్ కొత్త చిప్ : అధునాతన ఫీచర్లు, పర్యావరణ స్పృహ

కొత్త చిప్‌లలో తండర్ బోల్ట్ 5 (Thunderbolt 5) పోర్ట్‌లు, వేగవంతమైన 16-కోర్ న్యూరల్ ఇంజిన్, ఇండస్ట్రీలోనే మొదటిసారిగా 'మెమరీ ఇంటిగ్రిటీ ఎన్‌ఫోర్స్‌మెంట్' అనే సెక్యూరిటీ ఫీచర్‌ను చేర్చారు. ఆపిల్ 2030 లక్ష్యంలో భాగంగా, ఈ చిప్‌లు తక్కువ శక్తిని వినియోగిస్తూ పర్యావరణానికి మేలు చేసేలా రూపొందించారు. గ్లోబల్ మార్కెట్‌లో మెమరీ చిప్‌ల ధరలు పెరుగుతున్నప్పటికీ, ఆపిల్ తన వినియోగదారులకు బేస్ స్టోరేజీని రెట్టింపు చేయడం విశేషం.

"M5 ప్రో, M5 మ్యాక్స్ చిప్‌లు ఆపిల్ సిలికాన్ ప్రయాణంలో ఒక మైలురాయి" అని ఆపిల్ హార్డ్‌వేర్ టెక్నాలజీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జానీ స్రూజీ పేర్కొన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories