మనదేశంలో 1000 కోట్ల రూపాయల అద్దెతో ఆఫీసు పెట్టబోతున్న ఆపిల్, ఆ స్థలం ఓనర్ జాక్‌పాట్ కొట్టినట్టే

Published : Aug 20, 2025, 11:35 AM IST

ఆపిల్ ఇండియాలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. బెంగళూరులో అతిపెద్ద ఆఫీసును పెట్టబోతోంది. ఆ ఆఫీస్ కోసం ఏకంగా 1000 కోట్ల ఒప్పందాన్ని చేసుకోబోతోంది. 

PREV
15
బెంగళూరులో ఐఫోన్ ఆఫీస్

ఐఫోన్ తయారీదారైన ఆపిల్‌కు ప్రపంచంలో అత్యంత ప్రముఖ సంస్థల్లో ఒకటిగా మంచి పేరుంది. ఇప్పుడు ఆపిల్ దృష్టి బెంగుళూరుపై పడింది. ఇక్కడ అతిపెద్ద ఆఫీసును ఏర్పాటు చేయబోతోంది. డేటా ఎనాలిటిక్స్ సంస్థ ప్రోప్ స్టాక్ చెబుతున్న ప్రకారం ఆపిల్ బెంగళూరులో ఏకంగా 2.7 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్థలాన్ని 10 ఏళ్ల పాటు లీజుకు తీసుకోండి. ఆ పదేళ్లలో ఆ స్థలం యజమానికి 1000 కోట్లను అద్దె రూపంలో చెల్లించబోతోంది. ఇంత పెద్ద మొత్తంలో అద్దెను చెల్లించడం మన దేశంలో ఇదే తొలిసారి అని చెప్పుకోవాలి. ఈ ఏడాది ఏప్రిల్ 3న ఈ లీజు ఒప్పందం కుదిరింది. భారతదేశంలో ఒక కంపెనీ చేసిన అతి పెద్ద పెట్టుబడుల్లో దీన్ని ఒకటిగా చెప్పుకోవాలి.

25
నెలకు ఎంత అద్దె?

ఈ కొత్త ఆఫీస్ కోసం ఆపిల్ మొదట నెలకు 6.3 కోట్ల అద్దెను ఇవ్వడానికి ఒప్పుకుంది. అలాగే ప్రతి ఏడాది ఈ అద్దె 4.5 శాతం చొప్పున పెరుగుతుంది. అంటే వచ్చే 10 ఏళ్లలో 1000 కోట్ల రూపాలకు పైగా అద్దెను చెల్లిస్తుంది. ఇందులోనే కార్ పార్కింగ్ మెయింటనెన్స్ ఛార్జీలు కూడా ఉంటాయి. అందుకే మన దేశంలో ఇప్పటివరకు ఖరీదైన ఆఫీసు లీజు ఒప్పందంగా ఇది చరిత్రలో నిలిచిపోతుంది.

35
అ యజమాని ఎవరు?

ప్రాప్ స్టాక్ చెబుతున్న ప్రకారం ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఎంబసీ గ్రూపుకు చెందిన భవంతి ‘ఎంబసీ జెనిత్’. భవంతిలో స్థలాన్ని ఆపిల్ ఆఫీసు స్థలాన్ని లీజుకు తీసుకుంది. బెంగళూరులోని ఎంబసీ జెనిత్ టవర్లోని ఐదవ అంతస్తు నుండి 13వ అంతస్థ వరకు మొత్తం తొమ్మిది అంతస్తులను ఆపిల్ కంపెనీ లీజుకు తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనితోపాటు కారు పార్కింగ్ కూడా ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే ఆపిల్ కొన్ని కోట్ల రూపాయలను యజమానులకు అందించింది. ఆ స్థల యజమానులకు అందించింది.

45
భారతదేశంలోనే ఇక యాపిల్?

భారతదేశము నుండి ఖరీదైన ఆపిల్ ఐఫోన్లను ఎగుమతి చేసే సంస్థగా ఆపిల్ అవతరించింది. గత ఏడాది ఈ కంపెనీ మన దేశం నుండే లక్షన్నర కోట్ల రూపాయల విలువైన ఐఫోన్లను ఎగుమతి చేసింది. ఇప్పుడు బెంగళూరులో కొత్త ఆఫీస్ పై భారీ పెట్టుబడులను పెడుతోంది. దీన్నిబట్టి భారతదేశాన్ని ఆపిల్ ముఖ్య స్థావరంగా మార్చుకోబోతోందని అర్థమవుతోంది. బెంగళూరు, హైదరాబాదు నుండి ఈ కంపెనీ ఇప్పటికే ఇంజనీరింగ్ బృందాలను పనిలో దింపింది.

55
ట్రంప్ కి నచ్చకపోయినా ఆపిల్ ముందడుగు

భారతదేశంలో ఆపిల్ ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఏ మాత్రం ఇష్టం లేదు. అతడు బహిరంగంగా భారతదేశంలో ఆపిల్ కార్యకలాపాలు పెరగడంపై విమర్శించాడు. అయినా కూడా ఆపిల్ అతడి విమర్శలను పక్కనపెట్టి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారతదేశంలో తమ కార్యాకలాపాల విస్తరణను వేగవంతం చేస్తోంది. భవిష్యత్తులో యాపిల్‌కు కీలక కార్యాలయంగా బెంగుళూరు మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories