భార‌త యూజ‌ర్ల‌కు 'ఆపిల్' బంపరాఫర్.. ఐఫోన్ 16 సిరీస్ స‌హా అన్ని గాడ్జెట్ల పై భారీ త‌గ్గింపు

First Published | Oct 9, 2024, 6:57 PM IST

Apple giving Rs 10,000 off on devices: ఆపిల్ సంస్థ ఫెస్టివ్ ఆఫర్‌లో భాగంగా భారీ తగ్గింపులు అందిస్తోంది. మ్యాక్, iPhone 16 సిరీస్‌తో సహా తన ఉత్పత్తులపై ఆపిల్ రూ. 10000 వరకు తగ్గింపులు అందిస్తోంది. Apple festive offer వివరాలు మీకోసం. 

Apple giving Rs 10,000 off on devices: ఆపిల్ పండగ సీజన్ ను పురస్కరించుకుని భారతీయులకు బంపరాఫర్లు తీసుకువచ్చింది. ఆపిల్ నుంచి మార్కెట్ లోకి వ‌చ్చిన‌ ఎంపిక చేసిన గాడ్జెట్స్ పై భారీ త‌గ్గింపుల‌ను ప్ర‌క‌టించింది. రూ. 10,000 వరకు ఆదా చేసే పండుగ ఆఫర్ ల‌ను ప్రారంభించింది. అక్టోబరు 3న ప్రారంభమై డిసెంబర్ 31 వరకు కొనసాగే ఈ ఆఫిల్ సంస్థ ఫెస్టివ్ ఆఫర్లు భారతదేశంలోని కొనుగోలుదారులకు యాపిల్ ఉత్పత్తులను మరింత తక్కువ ధరలకు అందిస్తుంది. 

apple diwali sale 2024

ఆపిల్ ఫెస్టివ్ ఆఫ‌ర్లు కేవ‌లం పాత గాడ్జెట్ పైన మాత్ర‌మే కాకుండా ఇటీవ‌ల విడుద‌ల చేసిన M3 చిప్ ఆధారిత MacBook Air, కొత్తగా మార్కెట్ లోకి వ‌చ్చిన iPhone 16 సిరీస్ వంటి కొత్త పరికరాలపై కూడా ఈ ఆఫర్లు ఉన్నాయి. అలాగే, ఇప్పుడు కొనుగోలు చేసే ఉత్ప‌త్తుల‌పై ఆపిల్ సంస్థ ప్ర‌త్యేక వారంటీ క‌వ‌రేజీని కూడా అందిస్తోంది. ఇది వివిధ డివైస్ ల‌ను బ‌ట్టి మారుతుంది. కాబ‌ట్టి ఆపిల్ ప్రోడ‌క్టుల‌ను కొనుగోలు చేయ‌డానికి వినియోగ‌దారుల‌కు ఇది ఉత్తమ సమయంగా చెప్ప‌వ‌చ్చు. 

రూ. 10,000 తక్షణ క్యాష్‌బ్యాక్ అయిన టాప్-మోస్ట్ డిస్కౌంట్ మ్యాక్ ల్యాప్‌టాప్‌లు, మ్యాక్ డెస్క్‌టాప్‌ల కొనుగోలుపై అందుబాటులో ఉంది. ఐఫోన్ 16 సిరీస్ పై కూడా డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల కోనుగోలుపై తక్షణ క్యాష్‌బ్యాక్ రూ. 5,000 అందిస్తోంది. 


అలాగే, భార‌త ఆపిల్ ల‌వ‌ర్స్ ను దృష్టిలో పెట్టుకుని కొన్ని ప్రొడ‌క్టుల‌ను కూడా ఆ సంస్థ తీసుకువ‌చ్చింది. వాటిలో Apple ఇయర్‌బడ్లు ఉన్నాయి. కేవ‌లం భార‌త వినియోగ‌దారుల కోసమే తయారు చేసిన ఆపిల్ బీట్స్ సోలో బడ్స్ ఫెస్టివ్ స్పెషల్ ఎడిషన్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిపై కూడా ఆఫ‌ర్లు ఉన్నాయి. 

iPhone 16, 16 Plus, 16 Pro, 16 Pro Max సెప్టెంబర్ 9న విడుద‌ల అయ్యాయి. సెప్టెంబరు 20 నుండి అమ్మకానికి మార్కెట్ లోకి వ‌చ్చాయి. లాంచ్ అయిన ఒక నెలలోపు భారీ డిస్కౌంట్ల‌ను ప్ర‌క‌టించ‌డం ఆపిల్ నుంచి పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇప్ప‌టికే Flipkart, Amazon వంటి థర్డ్-పార్టీ ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ల‌లో కూడా భారీ ఆఫ‌ర్లు అందించింది. ఇప్పుడు ఆపిల్ అఫిషియ‌ల్ వెబ్ సైట్ లో కూడా ఆఫ‌ర్లు అందుబాటులో ఉన్నాయి. 

ఆపిల్ Mac ల‌పై రూ. 10000 తగ్గింపు

Apple పండుగ ఆఫర్ లో రూ. 10,000 తగ్గింపుతో Mac అందుబాటులో ఉంది. రూ. 99,900 ప్రారంభ ధర కలిగిన M3 MacBook Air ప్రస్తుతం రూ. 10,000 తక్షణ క్యాష్‌బ్యాక్‌తో విక్రయిస్తోంది. ఆపిల్ పండుగ ఆఫర్ 13, 15-అంగుళాల స్క్రీన్ మోడల్స్ కు కూడా అందుబాటులో ఉంది. ఇది ప్ర‌స్తుతం ఆపిల్ నుంచి వ‌చ్చినా లెటెస్ట్ MacBook Air వెర్షన్. ఎయిర్‌తో పాటు Apple 14, 16-అంగుళాల మ్యాచ్ బుక్ ప్రో, మ్యాచ్ స్టూడియో, ఐమ్యాక్ డెస్క్‌టాప్‌ల‌పై కూడా రూ.10,000 తక్షణ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది.

ప్ర‌స్తుతం MacBook Pro రూ. 1,69,900 నుండి, Mac Studio రూ. 2,09,900 నుండి ప్రారంభ ధ‌ర‌తో అందుబాటులో ఉన్నాయి. ఇక iMac  రూ. 1,34,900 ధ‌ర‌లో అందుబాటులో ఉంది. ఇవి ఆపిల్ లెటెస్ట్ M3 చిప్ తో అందుబాటులోకి వ‌చ్చాయి. ఐమ్యాచ్ M3  చిప్ తో 24-అంగుళాల స్క్రీన్ 4.5K రెటినా డిస్‌ప్లేతో ఉంది. అలాగే, 1080p వెబ్‌క్యామ్, Wi-Fi 6E సపోర్ట్ తో ఆకుపచ్చ, పసుపు, నారింజ, గులాబీ, ఊదా, నీలం, సిల్వ‌ర్ క‌ల‌ర్ల‌లో అందుబాటులో ఉన్నాయి.

iPhone 16 సిరీస్ పై రూ. 5,000 తగ్గింపు

iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro, iPhone 16 Pro Maxతో కూడిన మొత్తం iPhone 16 సిరీస్ స్మార్ట్ ఫోన్ల‌పై ఆపిల్ ఫెస్టివ్ ఆఫర్ 2024 కింద రూ. 5,000 తక్షణ క్యాష్‌బ్యాక్‌తో అందుబాటులో ఉంది. iPhone 16 ప్రారంభ ధర రూ. 79,900 కాగా ఐఫోన్ 16 ప్లస్ ప్రారంభ ధర రూ. 89,900. ఐఫోన్ 16 ప్రో ప్రారంభ ధర రూ. 1,19,900 కాగా, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర రూ. 1,44,900గా ఉంది. 

Mac, iPhone 16 సిరీస్‌పై రూ. 10,000 వరకు తగ్గింపు ఎలా పొందాలి?

ఆపిల్ ఫెస్టివ్ సీజ‌న్ లో భాగంగా  మీరు కొనుగోలు చేసే  ఆపిల్ ఉత్పత్తులపై వెంటనే క్యాష్ బ్యాక్ అందిస్తోంది. మీరు మీ కొనుగోలును అర్హత కలిగిన అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్ కార్డ్‌లతో చేయాలి. పండుగ ఆఫర్ కింద ఉన్న అన్ని డీల్‌లు యాపిల్ స్టోర్ ఆన్‌లైన్, న్యూఢిల్లీ (సాకేత్), ముంబై (బికెసి)లోని ఆపిల్ ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉన్నాయి.

Latest Videos

click me!