ప్రతినెలా ఉద్యోగికి నెలవారీ జీతం (Salary) పడుతుంది. అలాంటిది తన జీతం కంటే 330 రెట్లు ఎక్కువ జీతం ఒకేసారి పడితే ఎలా ఉంటుంది? అలా డబ్బులు జమ అయినప్పుడు మీరు ఏం చేస్తారు? ఒక ఉద్యోగికి ఇదే అనుభవం ఎదురైంది. అతను ఏం చేశాడో తెలుసుకోండి.
నెలవారీ జీతానికి పనిచేసేవారు ఎవరైనా మొదటి తేదీకి జీతం పడగానే ఆనంద పడిపోతారు. కానీ ఒక నెల జీతానికి బదులు ఏకంగా 330 రెట్లు ఎక్కువ జీతం పడితే ఏమవుతారు? ఒక వ్యక్తికి ఇలాంటి సంఘటనే ఎదురైంది. వెంటనే అతను ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ ఘటన మన దేశంలో కాదు చిలీలో వెలుగులోకి వచ్చింది. ఒక ఆఫీసు అసిస్టెంట్ గా ఉన్న ఒక వ్యక్తి నెలవారి జీతం 330 రెట్లు ఎక్కువగా అందుకున్నాడు. డబ్బు ఇలా పడిందో లేదో అతను ఉద్యోగానికి రాజీనామా చేసేసింది.
23
డబ్బు ఇమ్మంటే ఉద్యోగి రాజీనామా
దీంతో సదరు కంపెనీ ఆ డబ్బును తిరిగి ఇవ్వమని కోరింది. కానీ ఆ వ్యక్తి ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో ఆ కంపెనీ కోర్టులో ఆమెపై కేసు వేసింది. అయితే కోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఉద్యోగికి అనుకూలంగానే వచ్చింది. ఆ డబ్బును తిరిగి కంపెనీకి ఇవ్వాల్సిన అవసరం లేదని, ఉద్యోగి ఉంచుకోవచ్చని తీర్చుచెప్పింది. కోర్టులో దాదాపు మూడేళ్ల పాటు ఈ కేసు నలుగుతూనే ఉంది. 2022 సంవత్సరంలో మే నెలలో ఈ ఘటన జరిగింది. ఒక ఉద్యోగి 46వేల రూపాయల జీతాన్ని అందుకోవాలి. కానీ అతడు కోటిన్నర రూపాయలని జీతంగా పొందాడు. తరువాత ఫోను స్విచ్ ఆఫ్ చేసుకుని పెట్టుకున్నాడు. దీంతో కంపెనీ ఉద్యోగి పై దొంగతనం కేసు పెట్టింది.
33
దొంగతనం ఎలా అవుతుంది?
2022 నుంచి కోర్టులోఈ ఘటనపై విచారణ జరుగుతూనే ఉంది. సెప్టెంబర్ 2025లో న్యాయమూర్తి తుది తీర్పును ఇచ్చారు. అది దొంగతనం చేసినట్టు కాదని అనధికార వసూలుగా చెప్పుకోవాలని తీర్పు చెప్పారు. అతడిపై క్రిమినల్ కేసు పెట్టడానికి వీలు లేదని కూడా చెప్పారు. దీంతో ఆ ఉద్యోగి నిర్దోషిగా బయటికి వచ్చారు. ఇప్పుడు ఈ తీర్పుపై సివిల్ కోర్టులో అపీలు చేస్తామని కంపెనీ చెబుతోంది.