Chat Gpt: గూగుల్ పే, ఫోన్‌పేలాగే ఇకపై చాట్ జీపీటీ.. పిన్ అవసరం లేకుండా మరింత భద్రతగా చెల్లింపులు

Published : Oct 12, 2025, 08:14 AM IST

గూగుల్ పే, ఫోన్‌పేలకు పోటీ ఇచ్చేందుకు చాట్ జీపీటీ (Chat Gpt) సిద్ధమైపోతోంది. యూపీఐ చెల్లింపుల రంగంలోకి అది కూడా అడుగుపెట్టబోతోంది. పిన్ అవసరం లేకుండానే బయోమెట్రిక్ చెల్లింపులను కూడా పరిచయం చేయబోతోంది.

PREV
14
చాట్ జీపీటీ వచ్చేస్తోంది

ఆన్ లైన్ చెల్లింపుల కోసం గూగుల్ పే, ఫోన్‌పేల మీద ఆధారపడే వారే ఎక్కువ. ఇప్పుడు ఈ రెండింటికీ పోటీగా మరింత అధునాతనంగా చాట్ జీపీటీ యూపీఐ సేవల్లోకి అడుగుపెట్టబోతోంది. ఈ విషయంలో నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఒక పెద్ద ముందడుగు వేసింది. త్వరలో చాట్‌జీపీటీ వంటి AI ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆన్ లైన్ చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటోంది. అది కూడా మరింత భద్రతతో కూడిన చెల్లింపులు.

24
ప్రస్తుతం టెస్టింగ్ దశలో

చాట్ జీపీటీ యూపీఐ ఫీచర్ ప్రస్తుతం ప్రైవేట్ బీటా టెస్టింగ్‌ దశలో ఉన్నట్టు రేజర్‌పే సంస్థ చెబుతోంది. ఇది విజయవంతమైతే కస్టబర్లు చాట్‌జీపీటీ ఇంటర్‌ఫేస్ నుండి బయటకు వెళ్లకుండానే AI ఏజెంట్ ద్వారా ఆన్ లైన్ చెల్లింపులను పూర్తి చేయవచ్చు. ఇది ఎంతో సురక్షితం కూడా.

34
ఈ బ్యాంకుల భాగస్వామ్యంతో

చాట్ జీపీటీ పైలట్ ప్రాజెక్ట్ కోసం యాక్సిస్ బ్యాంక్, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ భాగస్వాములుగా పనిచేస్తున్నాయి. ఇక ఇది సక్సెస్ అయితే బిగ్‌బాస్కెట్, వొడాఫోన్ ఐడియా వంటి సంస్థలు చాట్‌జీపీటీ ద్వారా యూపీఐ చెల్లింపులను అమలు చేసే మొదటి ప్లాట్‌ఫారమ్‌లుగా ఉంటాయి.

44
పిన్ అవసరం లేదు

చాట్ జీపీటీ కొత్త తరం చెల్లింపు పద్ధతులను అమల్లోకి తీసుకురాబోతోంది.  యూపీఐ వినియోగదారులకు చాట్ జీపీటీలో చెల్లింపులు చేసేందుకు ఎలాంటి పిన్ అవసరం లేదు.  బయోమెట్రిక్ పద్ధతిలో చెల్లింపు సౌకర్యం ఉంటుంది. అంటే పిన్ అవసరం లేకుండా మీ ముఖం లేదా వేలిముద్ర ఉపయోగించి డబ్బులు పంపడం వంటివి చేయాలి. పిన్ తో పోల్చుకుంటే ఇది మరింత సురక్షితమైన పద్దతిగానే చెప్పుకోవాలి.

Read more Photos on
click me!

Recommended Stories