Bank Account: ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉండడం సర్వసాధారణంగా మారింది. అయితే కొన్ని సందర్భాల్లో బ్యాంక్ ఖాతాలను క్లోజ్ చేస్తుంటారు. అయితే ఇలా చేసే సమయంలో కొన్ని తప్పులు చేయకూడదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..
మీ EMI, SIP, బీమా ప్రీమియం, విద్యుత్–నీటి బిల్లులు ఆ అకౌంట్ నుంచి ఆటో డెబిట్ అవుతూ ఉంటే, అకౌంట్ మూసిన వెంటనే ఆ చెల్లింపులు ఆగిపోతాయి. ఇలా జరిగితే ఫైన్ పడే అవకాశాలు ఉంటాయి. బీమా పాలసీ రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే EMI పై పెనాల్టీలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అకౌంట్ క్లోజ్ చేసే ముందు కొత్త అకౌంట్‌ను అన్ని సేవల్లో అప్‌డేట్ చేయాలి.
25
అకౌంట్‌లో బకాయిలు ఉన్నాయా?
కొన్ని అకౌంట్‌లలో ఛార్జీలు ఆటోమేటిక్‌గా యాడ్ అవుతుంటాయి. ఇలా బ్యాలెన్స్ మైనస్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకే అకౌంట్ క్లోజ్ రిక్వెస్ట్ ఇవ్వక ముందే బ్యాలెన్స్ చెక్ చేయాలి. ఉన్న బకాయి మొత్తం క్లియర్ చేయాలి. అలా చేయకపోతే బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసే ముందు ఆ మొత్తం చెల్లించమని చెబుతుంది.
35
పాత కార్డుల ఫీజులు పెండింగ్‌లో ఉన్నాయా?
మీరు ఆ అకౌంట్‌కి సంబంధించిన డెబిట్ కార్డు, చెల్లింపు సేవలు చాలాకాలం ఉపయోగించకపోయినా కూడా డెబిట్ కార్డు వార్షిక ఛార్జీలు, SMS అలర్ట్ ఫీజులు, ఇతర సేవా ఛార్జీలు అన్నీ కొనసాగుతూనే ఉంటాయి. అకౌంట్ మూసే ముందు ఈ ఛార్జీలన్నీ క్లియర్ చేయాలి. లేకపోతే భవిష్యత్తులో సమస్యలు వస్తాయి.
అకౌంట్ క్లోజ్ చేసిన తర్వాత చెక్‌బుక్ లేదా పాస్‌బుక్ ప్రయోజనం ఉండదు. కానీ వాడని చెక్కులు ప్రమాదం కలిగించవచ్చు. చివరి స్టేట్‌మెంట్ తీసుకోవాలి. అలాగే అకౌంట్ క్లోజింగ్ సర్టిఫికెట్ తీసుకోవాలి. ఇవి భవిష్యత్తులో ఉపయోగపడతాయి.
55
బ్యాంక్ క్లోజింగ్ ప్రక్రియ పూర్తి అయ్యిందో లేదో చూడాలి
అకౌంట్ క్లోజ్ ఫామ్ సమర్పించిన తర్వాత. బ్యాంక్ మీ KYC చెక్ చేస్తుంది. అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్ మీకు రిఫండ్ చేస్తుంది. అకౌంట్ పూర్తిగా క్లోజ్ చేసినట్టు SMS లేదా మెయిల్ పంపిస్తారు. ఈ మెసేజ్ రాకుండా ప్రక్రియ పూర్తయిందని అర్థం కాదు. కాబట్టి ఫైనల్ కన్ఫర్మేషన్ పొందాలి.