డబ్బు పొదుపు చేయడానికి మనం రకరకాల మార్గాలను ఎంచుకుంటాం. కానీ తక్కువ పెట్టుబడితో.. ఎక్కువ రాబడి పొందాలంటే మాత్రం మ్యూచువల్ ఫండ్స్ మంచి ఎంపిక. అయితే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. అవేంటో చూద్దాం.
సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ తక్కువ. రిటర్న్స్ ఎక్కువ. కాబట్టి చాలామంది ప్రతినెలా కొంతమొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే కొందరు తెలిసో, తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు. దానివల్ల ఆర్థికంగా నష్టపోతుంటారు. మరి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
26
సరైన లక్ష్యాలు లేకుండా పెట్టుబడి పెట్టడం
చాలామంది సరైన లక్ష్యాలు నిర్దేశించుకోకుండానే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడుతుంటారు. కానీ దీనివల్ల కొన్నిసార్లు నష్టపోవాల్సి వస్తుంది. పిల్లల చదువు, పెళ్లి, ఇళ్లు, రిటైర్మెంట్ వంటి లక్ష్యాలను ఎంచుకోవడం ముఖ్యం. లేదంటే ఎప్పుడు డబ్బు అవసరమైతే.. అప్పుడు తీసుకొని నష్టపోతారు.
36
సరైన ఫండ్‌ను ఎంచుకోకపోవడం:
మ్యూచువల్ ఫండ్స్ లో స్వల్పకాలిక పెట్టుబడి పెట్టడం కంటే.. దీర్ఘకాలికంగా పొదుపు చేయడం మంచిది. 6 నెలలు, 1 సంవత్సరం పెట్టుబడితోనే భారీ రిటర్న్స్ ఆశించడం కరెక్ట్ కాదు. కనీసం 3 నుంచి 5 ఏళ్లు ఉన్న పెట్టుబడి వ్యవధితో ముందుకెళ్లాలి. అప్పుడే మనం అనుకున్న రాబడి వస్తుంది.
చాలామంది ఫండ్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండానే పెట్టుబడి పెడుతుంటారు. కానీ అది మంచిది కాదు. మనం ఎంచుకున్న ఫండ్ పనితీరు ఎలా ఉంది? గత 5 సంవత్సరాలలో రిటర్న్స్ ఎలా ఉన్నాయనే వివరాలు చెక్ చేసుకోవాలి. స్వల్పకాలిక మార్పులను బట్టి నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదు. మనం గుడ్డిగా పెట్టుబడి పెడితే ఆశించిన రిటర్న్స్ రాకపోవచ్చు.
56
మార్కెట్ వివరాలు
మార్కెట్ ఎప్పుడు పడిపోతుందో, ఎప్పుడు పెరుగుతుందో అంచనా వేయడం కష్టం. చాలా మంది తక్కువ ధరకే కొనాలని, ఎక్కువ ధరకే అమ్మాలని ట్రై చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. అంతేకాదు మార్కెట్ పడిపోయినప్పుడు భయపడి అమ్మేయడం ద్వారా కూడా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి స్థిరమైన పెట్టుబడి పెట్టడం ముఖ్యం.
66
ఇతరులను అనుసరించడం
ఫండ్స్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా.. ఇతరులు ఏదైనా ఫండ్ తీసుకున్నారు కాబట్టి మీరు తీసుకోవడం కరెక్ట్ కాదు. ఇతరులపై ఆధారపడి పెట్టుబడి పెడితే అది మీ లక్ష్యాలకు సరిపోకపోవచ్చు. మీ వ్యక్తిగత అవసరాలు, కాలపరిమితి, ఆర్థిక స్థితి ఆధారంగా నిర్ణయం తీసుకోవడం మంచిది.