ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో స్మార్ట్ ఫోన్లు ఇంత తక్కువా?

First Published | Sep 26, 2024, 10:22 AM IST

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. మొబైల్ ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రాన్ వస్తువుల నుంచి హోమ్ అప్లయన్సెస్ వరకు అన్ని రకాల వస్తువులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 27న వినియోగదారులందరికీ అందుబాటులో రానుంది. ఫ్లిప్ కార్ట్ ప్లస్ కస్టమర్లకు డిస్కౌంట్ ఆఫర్లు ఒకరోజు ముందుగానే అందుబాటులోకి వచ్చింది. ఈ పండగలో రూ.15 వేల కంటే తక్కువకు దొరికే స్మార్ట్ ఫోన్ల గురించి ఇక్కడ పూర్తి వివరాలు ఉన్నాయి. 
 

Reame 12x రూ.11,999
ఈ ఫోన్ ప్రత్యేకత ఏంటంటే సెకండ్ కెమెరా 2MP కాగా, ఫ్రంట్ కెమెరా 50MP కెపాసిటీ కలిగి ఉంది. ఇది పోర్ట్రెయిట్, లో లైట్ వంటి అనేక ఫీచర్స్ అందిస్తోంది. 6.6 ఇంచెస్ డిస్‌ప్లే, 5000 Mah బ్యాటరీని కలిగి ఉంది. అంతేకాకుండా MediaTek Dimensity 810 చిప్ సెట్ తో లభిస్తోంది. దీని ధర మార్కెట్లో రూ.14,000 కాగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024లో కేవలం రూ.11,999కి లభిస్తోంది. 

Vivo T3X 5G
ఈ ఫోన్ మార్కెట్లో రూ.14,999లకు లభిస్తుండగా, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024లో కేవలం రూ.11,999కి లభిస్తోంది. ఇది 64MP కెమెరాను కలిగి ఉంది. దీంతో ఫొటోలు అద్భుతంగా తీయవచ్చు. 5000mAh బ్యాటరీ మీకు ఎక్కువ సేపు ఛార్జింగ్ వచ్చేలా సహకరిస్తుంది. 6.58-అంగుళాల డిస్‌ప్లే ఫోన్ అందాన్ని పెంచింది.  Qualcomm Snapdragon 695 చిప్‌సెట్ ఫోన్ వర్కింగ్ కెపాసిటీని పెంచింది. 
 

CMF Phone 1
ఈ ఫోన్ అంచనా ధర మార్కెట్లో వివిధ ప్లాట్ ఫాం లలో రూ.15,000 వరకు ఉండగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024లో కేవలం రూ.12,999కి మీరు కొనుక్కోవచ్చు. దీని ప్రత్యేకతలు ఏంటంటే 48 MP కెమెరా, 4500 mAh బ్యాటరీ, 6.5 అంగుళాల AMOLED డిస్‌ప్లే, CMF కస్టమ్ చిప్‌సెట్. తక్కువ ధరకు మంచి ఫీచర్స్ అందిస్తున్న ఫోన్ ఇది. 

Moto G64 5G
ఈ ఫోన్ మార్కెట్ లో సుమారుగా రూ.16,000 ఉంది. 50 MP ట్రిపుల్ కెమెరా ఉండటం వల్ల ఫొటోలు, వీడియాలు చాలా క్వాలిటీగా వస్తాయి. 5000 mAh బ్యాటరీ, 6.8 అంగుళాల డిస్‌ప్లే, Qualcomm Snapdragon 695 చిప్‌సెట్ దీని ప్రత్యేకతలు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024లో కేవలం రూ.13,999కి ఈ ఫోన్ ను మీరు సొంతం చేసుకోవచ్చు. 


Vivo T3 Lite
ఇప్పటి వరకు చూపిన ఫోన్లలో చాలా తక్కువ ధరకు లభించే ఫోన్ Vivo T3 Lite. దీని ధర మార్కెట్లోని వివిధ ప్లాట్ ఫాంలలో దాదాపుగా రూ.15 వేల వరకు ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024లో కేవలం రూ.9,499కి లభిస్తోంది. తక్కువ బడ్జెట్ లో ఫోన్ కొనుక్కోవాలనుకున్న వారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. 50MP డ్యూయల్ కెమెరా, 5000mAh బ్యాటరీ, 6.51-అంగుళాల డిస్‌ప్లే, MediaTek Dimensity 700 చిప్‌సెట్ దీని ప్రత్యేకతలు. 

Samsung Galaxy A14 5G
దీని ధర మార్కెట్ లో రూ.16,499 ఉంది. ఇది కూడా 50MP ట్రిపుల్ కెమెరా, 5000mAh బ్యాటరీ, 6.6-అంగుళాల డిస్‌ప్లే, Exynos 1330 చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఇందులో ఉన్న 50MP ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ పవర్డ్ కెమెరా సెటప్ మీకు గొప్ప అనుభూతిని ఇస్తుంది. 
 

Moto G45 5G
దీని ధర మార్కెట్లో రూ.13,000 వరకు ఉండగా, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024లో కేవలం రూ.10,999కి లభిస్తోంది. 50 MP డ్యూయల్ కెమెరా, 5000mAh బ్యాటరీ, 6.4 అంగుళాల డిస్‌ప్లే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. MediaTek Dimensity 720 చిప్‌సెట్ ఫోన్ పనితీరును మెరుగుపరుస్తుంది. 

Realme 13 5G
దీని ధర వివిధ ప్లాట్ ఫాం లలో రూ.18,000 వరకు ఉంది. 108MP కెమెరా, 5500 mAh బ్యాటరీ, 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే, MediaTek Dimensity 930 చిప్‌సెట్ ఈ ఫోన్ ప్రత్యేకతలు. ఈ ఫోన్ ను మీరు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024లో రూ.13,999 కు సొంతం చేసుకోవచ్చు. 
 

Latest Videos

click me!