అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్.. ధమాకా ఆఫర్లు.. ఒకరోజు ముందుగానే ప్రైమ్ మెంబర్స్‌కు యాక్సెస్

Published : Sep 08, 2025, 02:52 PM IST

Amazon Great Indian Festival 2025 : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 సెప్టెంబర్ 23న ప్రారంభం కానుంది. అయితే, ప్రైమ్ మెంబర్స్‌కు ఒకరోజు ముందుగానే అంటే 22 నుంచే యాక్సెస్ లభించనుంది. ఆ సేల్ లో భారీ ఆఫర్లు ఉన్నాయి.

PREV
16
సెప్టెంబర్ 23 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రారంభం

అమెజాన్ ఇండియాలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న షాపింగ్ ఈవెంట్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 అధికారికంగా సెప్టెంబర్ 23న ప్రారంభం కానుంది. అయితే ప్రైమ్ మెంబర్స్‌కు ఒక రోజు ముందుగానే, అంటే సెప్టెంబర్ 22నుండే ప్రత్యేక యాక్సెస్ లభిస్తుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ, హోమ్ ఎసెన్షియల్స్ వంటి వందల కొద్ది కేటగిరీల్లో భారీ ఆఫర్లు లభించనున్నాయి.

26
17 లక్షలకుపైగా సెల్లర్లతో అమెజాన్ ఫెస్టివల్

ఈ ఫెస్టివల్‌లో దేశవ్యాప్తంగా 17 లక్షలకుపైగా విక్రేతలు పాల్గొనబోతున్నారు. లాంచ్‌ప్యాడ్, హ్యాండీక్రాఫ్ట్, హ్యాండ్లూమ్ ఉత్పత్తుల ప్రోత్సాహక ప్రోగ్రామ్ కరిగా, లోకల్ షాప్స్, సహేలి వంటి ప్రత్యేక ప్రోగ్రామ్‌లలో భాగంగా అనేక కొత్త ఉత్పత్తులు లాంచ్ చేయబోతున్నారు. అంతేకాకుండా, కొత్త GST కోడ్స్‌ ప్రకారం సిస్టమ్స్ అప్‌డేట్ చేయడం ద్వారా, వినియోగదారులకు అదనపు లాభాలు అందేలా చర్యలు చేపట్టారు.

36
కొత్త డెలివరీ స్టేషన్లతో వేగవంతమైన డెలివరీ

ఈ సారి అమెజాన్ దేశవ్యాప్తంగా 45 కొత్త డెలివరీ స్టేషన్లు ఏర్పాటు చేసింది. ఇవి ప్రధానంగా టియర్ II, టియర్ III నగరాలు.. రాయ్ బరేలీ, బులంద్‌షహర్ (ఉత్తరప్రదేశ్), తిరుచిరాపల్లి, మరైమలై (తమిళనాడు), హావ్రా, ఈస్ట్ మిడ్నాపూర్ (పశ్చిమ బెంగాల్), పోర్ట్ బ్లెయిర్ (అండమాన్), నర్సీపట్నం (ఆంధ్రప్రదేశ్), శ్రీనగర్, ఉదంపూర్ (జమ్మూ కాశ్మీర్), రాంచి, గిరీడీహ్ (ఝార్ఖండ్), టిన్సుకియా, సిల్చర్ (అస్సాం)లో ప్రారంభించారు.

ప్రస్తుతం అమెజాన్‌కు దేశవ్యాప్తంగా 2,000 లాస్ట్ మైల్ డెలివరీ స్టేషన్లు ఉన్నాయి. అదనంగా, 12 కొత్త ఫుల్‌ఫిల్మెంట్ సెంటర్లు, 6 కొత్త సార్ట్ సెంటర్లు ప్రారంభించి, 8.6 మిలియన్ క్యూబిక్ ఫీట్ స్టోరేజ్ సామర్థ్యం, 5 లక్షల చదరపు అడుగుల సార్టేషన్ స్థలాన్ని కల్పించింది.

46
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో AI ఆధారిత షాపింగ్ ఫీచర్లు

ఈ ఫెస్టివల్‌లో వినియోగదారులకు మరింత సులభతరం చేయడానికి అమెజాన్ కొత్త AI టూల్స్ అందిస్తోంది. రూఫస్ AI ద్వారా ప్రొడక్ట్ పోలికలు, ప్రైస్ హిస్టరీ, వీడియో సమ్మరీలు, పర్సనలైజ్డ్ రికమండేషన్లు పొందవచ్చు. లెన్స్ AI ద్వారా ఫోటో తీసి ఆ ఉత్పత్తిని సులభంగా వెబ్‌సైట్‌లో కనుగొనవచ్చు. రివ్యూ హైలైట్స్, బయ్యింగ్ గైడ్స్ వంటి సదుపాయాలు షాపింగ్‌ను మరింత సులభతరం చేస్తాయని అమెజాన్ తెలిపింది.

56
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో భారీ ఆఫర్లు, బిగ్ డిస్కౌంట్లు

ఈ సేల్‌లో కొన్ని ముఖ్యమైన ఆఫర్లు గమనిస్తే..

• స్మార్ట్‌ఫోన్లపై 40% వరకు తగ్గింపు – యాపిల్, శాంసంగ్, వన్‌ప్లస్, ఐక్యూ బ్రాండ్లపై ప్రత్యేక ఆఫర్లు

• ఎలక్ట్రానిక్స్‌పై 80% వరకు తగ్గింపు – HP, Dell, Sony, Boat వంటి బ్రాండ్లు

• హోమ్ అప్లయెన్సెస్‌పై 65% వరకు తగ్గింపు – LG, Godrej, Samsung వంటి బ్రాండ్లు

• ఫ్యాషన్, బ్యూటీపై 50% నుండి 80% వరకు ఆఫర్లు – Crocs, Titan, L’Oreal, Libas వంటి బ్రాండ్లు

• చిన్న, మధ్య తరహా వ్యాపారాల ఉత్పత్తులపై 70% వరకు తగ్గింపు

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో బ్యాంక్ ఆఫర్లు, పేమెంట్ సదుపాయాలు

ఈ ఫెస్టివల్‌లో SBI క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, ₹60,000 వరకు ఇన్‌స్టంట్ క్రెడిట్, నో కాస్ట్ EMI, రివార్డ్స్ గోల్డ్ ప్రోగ్రామ్‌లో 5% వరకు క్యాష్‌బ్యాక్, ట్రావెల్ బుకింగ్స్‌పై 15% వరకు తగ్గింపు, హోటల్స్‌పై 40% వరకు ఆఫర్ లభిస్తుంది.

66
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ జోష్ మొదలైంది

అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. "ఈ ఫెస్టివల్‌లో వినియోగదారులు ఈ ఏడాది చాలా తక్కువ ధరలకు వందల కొద్ది ఉత్పత్తులను కొనుగోలు చేయగలరు. కొత్త లాంచ్‌లు, బ్లాక్‌బస్టర్ ఆఫర్లు, వినూత్న వినోదం అందించబోతున్నాం" అన్నారు.

అమెజాన్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అభినవ్ సింగ్ మాట్లాడుతూ.. "ఈ 45 కొత్త డెలివరీ స్టేషన్లు వినియోగదారులకు వేగవంతమైన, నమ్మకమైన సేవలు అందిస్తాయి. ఈ ఏడాది సేమ్ డే డెలివరీ 50% ఎక్కువ నగరాలకు, నెక్ట్స్ డే డెలివరీ రెండింతల లొకేషన్లకు విస్తరించాం" అని తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories