రోజుకు కేవలం 5 రూపాయలే.. ఎయిర్ టెల్ సూపర్ రీచార్జ్ ప్లాన్, బెనిఫిట్స్ ఏంటో తెలుసా?

Published : Dec 01, 2025, 01:46 PM IST

Airtel Recharge Plan : ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ తమ వినియోగదారులకు సరికొత్త వన్ ఇయర్ రీచార్జ్ ప్లాన్ అందిస్తోంది. కేవలం రూ.5 తో ఓ రోజంతా ఏఏ బెనిఫిట్స్ పొందొచ్చో తెలుసా?

PREV
15
ఎయిర్ టెల్ సూపర్ ప్లాన్

Airtel : కేవలం 1GB డేటా కావాలంటే కనీసం 20 రూపాయలతో రీచార్జ్ చేసుకోవాలి. అలాంటిది రోజుకు కేవలం 5 రూపాయల ఖర్చుతో అపరిమిత కాల్స్ తో పాటు ఇతర బెనిఫిట్స్ పొందవచ్చు. ఇలా అతి తక్కువ ధరతో అత్యుత్తమ సేవలను పొందే రీచార్జ్ ప్లాన్ ను ఎయిర్ టెల్ తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

25
ఎయిర్ టెల్ రూ.1846 రీచార్జ్ ప్లాన్

ప్రస్తుతం ఓ కుటుంబం నెల ఖర్చుల్లో ఫోన్ రీచార్జ్ కూడా ఓ భాగమయ్యింది. నెల గడిచిందంటే చాలు కుటుంబసభ్యుల రీచార్జ్ ఖర్చు తప్పనిసరి. అయితే ఇలా నెలనెలా రీచార్జ్ చేసుకునే అవసరం లేకుండా ఏడాదికి సరిపడా రీచార్జ్ చేసుకునే ప్లాన్స్ ఎయిర్ టెల్ తీసుకువచ్చింది. రూ.1849 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే ఏడాది మొత్తం (365 రోజులు) సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు. అలాగే పలు సేవలను కూడా అతి తక్కువ ధరకు పొందవచ్చు.

35
కేవలం రూ.5 కే రోజంతా సేవలు

భారతదేశపు రెండో అతిపెద్ద టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన కస్టమర్లను ఆకట్టుకునేందుకు వన్ ఇయర్ ప్లాన్ ని తీసుకువచ్చింది. రోజుకు కేవలం 5 రూపాయలతో ఏడాది మొత్తం సిమ్ ను యాక్టివ్ గా ఉంచుకోవచ్చు. ఇంంటర్నెట్ డాటా అవసరం లేదు... కేవలం టాక్ టైమ్ చాలనుకునేవారికి ఈ రీచార్జ్ ప్లాన్ సరిపోతుంది.

45
ఎయిర్ టెల్ సూపర్ రీచార్జ్ ప్లాన్

ట్రాయ్ సూచనల మేరకు ఎయిర్‌టెల్ ఈ రూ.1849 రీచార్జ్ ప్లాన్‌ తెచ్చింది. కేవలం కాల్స్ కోసం, తక్కువ డేటా వాడేవారికి, ఏడాది పాటు రీఛార్జ్ టెన్షన్ వద్దనుకునే వారికి ఇది చాలా ఉత్తమైంది. ఇది ఎయిర్‌టెల్ లో చవకైన వార్షిక ప్లాన్. 365 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాల్స్, 3600 ఎస్ఎంఎస్, ఉచిత హలో ట్యూన్స్ లభిస్తాయి. ఈ ప్లాన్‌లో డేటా ఉండదు. అవసరమైతే డేటా ప్యాక్ వేసుకోవచ్చు.

55
ఎయిర్ టెల్ రీచార్జ్ ప్లాన్

ట్రాయ్ ప్రకారం, భారత టెలికాం మార్కెట్ వృద్ధి చెందుతోంది. దేశంలో మొత్తం టెలిఫోన్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 123.1 కోట్లకు చేరింది. వీరిలో 118.4 కోట్ల మంది మొబైల్ యూజర్లు ఉన్నారు. వీరిలో చాలామంది ఇంటర్నెట్ ఢాటా ఎక్కువగా ఉపయోగించనివారే. అలాంటివారి కోసం రీచార్జ్ ప్లాన్స్ తీసుకువస్తున్నాయి టెలికాం సంస్థలు. ఇందులో భాగమే ఎయిర్ టెల్ రూ.1849 రీచార్జ్ ప్లాన్.

Read more Photos on
click me!

Recommended Stories