బ్యాంక్ ఉద్యోగం అంటే బిందాస్ గా ఉంటుందని చాలా మంది మంది భావిస్తుంటారు. ముఖ్యంగా ప్రస్తుతం రెండో శనివారం, ఆదివారం సెలవు ఉండగా. త్వరలోనే వారానికి రెండు రోజులు సెలవులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో బ్యాంక్ ఉద్యోగాలపై మరింత క్రేజ్ పెరిగింది.
అయితే వారానికి రెండు రోజులు సెలవులు ఉంటాయని ఆనందించేలోపే ఓ బ్యాడ్ న్యూస్ బ్యాంక్ ఉద్యోగులను కలవరపెడుతోంది. ఇంతకీ ఏంటా వార్త, సర్వేలో తేలిన సంచలన విషయాలు ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
రానున్న 3 నుంచి 5 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలో దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని బ్లూమ్‌బెర్గ్ ఇంటెలిజెన్స్ సర్వేలో తేలింది. రొటీన్ వర్క్ చేసే ఉద్యోగులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తేలింది. దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా చెబుతున్నారు.
బ్యాంకింగ్ ఉద్యోగాలకు ముప్పు
ముఖ్యంగా బ్యాక్ ఆఫీస్, మిడిల్ ఆఫీస్, ఆపరేషన్స్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయని సర్వేలో తేలింది. ఈ ఉద్యోగాలు ఏఐ భర్తీ చేయడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.
కస్టమర్ సర్వీస్‌లో మార్పులు
కస్టమర్ సర్వీస్‌లో త్వరలో పెద్ద మార్పులు రానున్నాయి. ముఖ్యంగా కేవైసీ వెరిఫికేషన్ వంటి పనులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తి చేయనుంది. దీంతో ఈ విభాగంలో పనిచేసే ఉద్యోగుల ప్రమాదంలో ఉన్నాయని సర్వే చెబుతోంది.
బ్యాంకింగ్ రంగంలో మార్పులు
గత కొన్నేళ్లుగా బ్యాంకింగ్ రంంలో సమూల మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్ లో ఐటీ వినియోగం పెరుగుతోంది. దీంతో సహజంగానే బ్యాంకింగ్ వ్యవస్థలో టెక్నాలజీ వినియోగం పెరుగుతోంది.
బ్లూమ్‌బెర్గ్ ఇంటెలిజెన్స్ సర్వే
ప్రముఖ వ్యాపార సంస్థ బ్లూమ్ బెర్గ్ ఇంటెలిజెన్స్ ఇటీవల ప్రపంచంలోని పలు ప్రముఖ ఐటీ కంపెనీలపై సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగానే బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి.
బ్యాంకింగ్ రంగంలో ఏఐ వినియోగం
రానున్న 3-4 ఏళ్లలో బ్యాంకుల్లో 2 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని, వీటి స్థానాన్ని ఏఐ భర్తీ చేయనుందని ఈ సర్వేలో తేలింది. బ్లూమ్ బెర్ట్ ఇంటెలిజెన్స్ సీనియర్ విశ్లేషకుడు, రచయిత థామస్ నోట్జెన్ మాట్లాడుతూ.. ఒకే పనిని పలుసార్లు చేసే ఉద్యోగుల భద్రత ప్రమాదంలో ఉందని చెప్పుకొచ్చారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తుందని కాదని, కానీ శ్రామిక శక్తిని కొత్త పుంతలు తొక్కిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. రానున్న కొన్నేళ్లలో బ్యాంకింగ్ రంగంలో పెను విప్లవాలు వస్తాయని, ఈ మార్పు ప్రపంచమంతా కనిపిస్తుందని తేల్చి చెప్పారు.