డిఫై 22 స్కూటర్ స్టైలిష్ లుక్ అదిరింది: ఓలా, ఏథర్‌కి పోటీ తప్పదు

First Published | Jan 15, 2025, 4:02 PM IST

ఆటో ఎక్స్‌పో 2025: OPG మొబిలిటీ కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘డిఫై 22’ ను ఆటో ఎక్స్‌పో 2025లో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అధునాతన ఫీచర్లు, స్టైలిష్ డిజైన్‌తో ఈ స్కూటర్ అందరినీ ఆకట్టుకుంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. మరి ఆ ఫీచర్స్ ఏంటో మనమూ ఓసారి తెలుసుకుందాం రండి. 

ఆటో ఎక్స్‌పో 2025 జనవరి 17న ప్రారంభం కానుంది. ఇదే వేదికపై OPG మొబిలిటీ కంపెనీ డిఫై 22ని లాంచ్ చేస్తోంది. భారత్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ పెరుగుతుండటంతో ఇలాంటి కొత్త మోడల్స్ కు ఆదరణ కూడా పెరిగేలానే ఉంది. అందుకే OPG మొబిలిటీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొనేందుకు ప్రయత్నిస్తోంది. ఇది కచ్చితంగా ఓలా, ఏథర్ కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్లకు పోటీగా నిలుస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

OPG మొబిలిటీ కంపెనీకి ఇంతకు ముందు పేరు Okaya EV. పేరు మార్చిన తర్వాత ఈ కంపెనీ నుంచి వస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్ ఇది. డిఫై 22 పేరుతో తయారు చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆ కంపెనీ ఆటో ఎక్స్‌పో 2025లో ఆవిష్కరించనుంది.

భారతీయ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఈ స్కూటర్ తయారైంది. అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా డిఫై 22 స్లైలిష్ లుక్, బోల్డ్ డిజైన్‌ చాలా అట్రాక్టివ్ గా ఉంది. 


డిఫై 22లో LED లైట్లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి బెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఇది ఫ్యూచరిస్టిక్, స్టైలిష్ లుక్‌కి కలిగి ఉంది. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులు ఏ వర్గం వారికైనా సరిగ్గా సరిపోయే లుక్, ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. డిఫై 22 భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు కంపెనీ MD అన్షుల్ గుప్తా చెప్పారు.

ఈ స్కూటర్ ముఖ్యంగా పట్టణాల్లో అవసరాలు తీర్చుకోవడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. OPG మొబిలిటీ పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. జనవరి 17 నుంచి 22 వరకు జరిగే ఆటో ఎక్స్‌పోలో పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. ఈ ఆటో ఎక్స్‌పోకు జనవరి 19 నుంచి ప్రజలకు ప్రవేశం ఉంటుంది. జనవరి 18న మీడియా వాళ్లకు ముందస్తు ప్రవేశం లభిస్తుంది. ఈ ఆటో ఎక్స్‌పోలోనే డిఫై 22 ఆవిష్కరణ జరుగుతుంది.

Latest Videos

click me!