Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌లో చౌకైన బైక్ ఇదే. ధర తెలిస్తే ఆశ్యర్యపోతారు

Published : Mar 08, 2025, 06:22 PM IST

Royal Enfield Hunter 350: యూత్ ఫేవరేట్ బైక్ అయిన రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ తన బైక్స్ అన్నింటిలో తక్కువ ధరకు హంటర్ 350 మోడల్ ని అందిస్తోంది. సాధారణంగా రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్స్ ప్రారంభ ధరే రూ.1.70 లక్షల నుంచి ఉంటుంది. కాని హంటర్ 350 మోడల్ ని తక్కువ ధరకు కంపెనీ అందిస్తోంది. దాని ధర, బైక్ ఫీచర్స్ తెలుసుకుందాం రండి. 

PREV
14
Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌లో చౌకైన బైక్ ఇదే. ధర తెలిస్తే ఆశ్యర్యపోతారు

యూత్ కి బాగా నచ్చిన బైక్ ఏదంటే చాలా మంది చెప్పే మాట రాయల్ ఎన్ ఫీల్డ్. అందులోనూ యంగ్ రైడర్స్‌కి ఫేమస్ బైక్ హంటర్ 350. దీని ధర తక్కువే కాకుండా స్టైలిష్ డిజైన్, పవర్ఫుల్ ఇంజిన్‌తో వస్తుంది. అంతేకాకుండా ఈ బైక్ హోండా CB350RS, జావా 42 మోడల్స్‌కి ఇది పోటీగా నిలుస్తోంది. 

 

24

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ధర

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 కొనాలనుకుంటే ఇదే మంచి టైం. ఎందుకంటే ఇది కొనేవాళ్లకి ఇప్పుడు కంపెనీ మంచి ఆప్షన్స్ ఇస్తోంది. అంటే బేసిక్ మోడల్ హంటర్ 350 రెట్రో ఫ్యాక్టరీ ధర కేవలం రూ.1,49,900 మాత్రమే. అదే మెట్రో డాంపర్ వేరియంట్ అయితే రూ.1,69,434.

ఇది కూడా చదవండి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఎన్ని వస్తువులైనా పెట్టుకోవచ్చు. స్టోరేజ్‌లో టాప్ 5 వెహికల్స్ ఇవే

34

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఫీచర్స్

ఈ బైక్ 20.2 bhp పవర్, 27 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ముందు, వెనక డిస్క్ బ్రేక్స్ కూడా ఉన్నాయి. అందువల్ల ప్రమాదాలకు ఆస్కారం మాక్సిమం ఉండదు. అంతేకాకుండా ఇందులో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఇక ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇది ఏకంగా 13 లీటర్ల కెపాసిటీని కలిగి ఉంది.

44

హంటర్ 350 మెట్రో వేరియంట్‌ ఫీచర్స్

మెట్రో వేరియంట్‌లో అలాయ్ వీల్స్ ఇచ్చారు. ఇందులో కూడా రెండు టైర్లకు డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ABS ఉంటాయి. హంటర్ 350 రాయల్ ఎన్‌ఫీల్డ్ J-ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. అందువల్ల రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంటుంది.

ఇది కూడా చదవండి  కారు టైర్లకు నార్మల్ గాలి మంచిదా? నైట్రోజన్ మంచిదా?

click me!

Recommended Stories