కారు టైర్లలో ఏ గాలి నింపాలన్నది చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. ముందుగా ఖర్చు. సాధారణ గాలి నింపాలంటే రూ.5, రూ.10 ఇస్తే సరిపోతుంది. అదే నైట్రోజన్ నింపాలంటే రూ.30 నుంచి రూ.50 వరకు తీసుకుంటారు. అయితే ఒక్కసారి టైర్లలో నైట్రోజన్ నింపితే ఎక్కువ కాలం ప్రెషర్ ని పట్టి ఉంచుతుంది. సాధారణ గాలి అయితే తగ్గిపోతుంది. అందుకే తరచూ గాలి కొట్టించాల్సి వస్తుంది.
టైర్లలో సాధారణ గాలి నింపినప్పుడు అందులో ఉండే ఆక్సిజన్ అణువులు చిన్నవిగా ఉండటం వల్ల అవి టైర్ల నుండి వేగంగా బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. దీని కారణంగా తరచుగా టైర్ల ప్రెజర్ చెక్ చేస్తూ, అవసరమైతే నింపాల్సి ఉంటుంది.