పెట్రోల్ ధరలు పెరిగిపోవడం వల్ల ప్రజలంతా తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి ఇష్టపడుతున్నారు. అందువల్లనే మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరిగింది. పండగల సందర్భంగా ధరలు భారీగా తగ్గిస్తూ అనేక కంపెనీలు ప్రత్యేక ఆఫర్లు ఇచ్చాయి. ఇప్పటికే ఓలా, టీవీఎస్, బజాబ్ వంటి దిగ్గజ కంపెనీలు అనేక ఆఫర్లు ఇచ్చి వాటి సేల్స్ పెంచుకున్నాయి. ఇప్పుడు ఫ్రాంక్లిన్ EV ఎలక్ట్రిక్ స్కూటర్ల కంపెనీ తక్కువ ధరకు తమ కంపెనీ స్కూటర్లు విక్రయించేందుకు ముందుకు వచ్చింది. కేవలం 1.5 యూనిట్ల విద్యుత్‌తో 100 కి.మీ. ప్రయాణించే స్కూటర్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది.
ఫ్రాంక్లిన్ EV కంపెనీ తెలంగాణ రాష్టానికి చెందిన కంపెనీ. దక్షిణ భారత దేశంలోనే 50కి పైగా స్టోర్స్ ఉన్నాయి.మారుతున్న కాలానికి అనుగుణంగా వెహికల్స్ తయారు చేస్తూ ఈ కంపెనీ వేగంగా అభివఈద్ధి చెందుతోంది. ప్రసుత్తం ఈ కంపెనీ నుంచి ఫ్రాంక్లిన్ ఈవీ స్కూటర్లు తక్కువ రేటుకే మార్కెట్ లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
KORO, NIX-DLX, పవర్-ప్లస్ మోడల్స్ తీసుకొచ్చింది. ఇవి వరుసగా రూ.49,999, రూ.64,999, రూ.74,999 ధరల్లో లభ్యం అవుతున్నాయి. అన్ని మోడల్స్ ఒకే డిజైన్, రంగుల్లో వస్తాయి. ఫుల్ ఛార్జ్‌తో 100 కి.మీ. వరకు ప్రయాణం. అదీ కేవలం రూ.8 ఖర్చుతో మీరు 100 కి.మీ. వరకు ప్రయాణం చేయొచ్చు.
ఈ మూడు స్కూటర్లు గరిష్ఠంగా 60 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి. గ్రామాలు, పట్టణాల్లోనూ వినియోగించేందుకు వీలుగా వీటిని తయారు చేశారు. క్రూయిస్ కంట్రోల్ తో ఇవి నడుస్తాయి.
60V32Ah బ్యాటరీ కెపాసిటీ ఉన్న కోరో మోడల్ ధర రూ.49,999 మాత్రమే. అదే 60V26Ah బ్యాటరీ కెపాసిటీ ఉన్న NIX-DLX మోడల్ స్కూటర్ ధర రూ. 64,999. 65V35Ah బ్యాటరీ కెపాసిటీ ఉన్నపవర్-ప్లస్ మోడల్ ధర రూ.74,999. బ్యాటరీలు, BLDC మోటార్‌తో ఇవి రూపొందించబడ్డాయి. మూడు రైడింగ్ మోడ్‌లు, రివర్స్ గేర్, సెక్యూరిటీ సెన్సార్స్ ఇందులో ఉన్నాయి.