భారతదేశంలోని సంపన్నులంటే అందరికీ గుర్తొచ్చేది అంబానీలు (Ambani), అదానీలే. కోట్లు సంపాదిస్తున్న ఈ బిజినెస్ మ్యాన్‌లు ఏం చదువుకున్నారో తెలుసా? వీరి విద్యాభ్యాసం వివరాలు ఇక్కడ ఇచ్చాము తెలుసుకోండి.
మనదేశంలో కోటీశ్వరుల జాబితా ప్రతి ఏటా పెరిగిపోతోంది. అత్యంత సంపన్నుల జాబితాలో మొదట ఉండేది అంబానీ, అదానీలు ఉన్నారు. వీరి విలాసవంతమైన జీవితం గురించి వార్తలు వింటూనే ఉంటాం. వీరికొచ్చే వేల కోట్ల ఆదాయం రోజురోజుకి పెరుగుతూనే ఉంటుంది. కానీ వీరు ఎంత చదివారో మాత్రం చాలా మందికి తెలియదు.
26
ముఖేష్ అంబానీ ఏం చదివారు?
రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇతను ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచాడు. ఆయన మొదట ఒక కెమికల్ ఇంజనీర్. ముంబైలో డిగ్రీని పూర్తి చేశారు. ఆ తరువాత అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ జాయిన్ అయ్యారు. కానీ ఆ కోర్సు పూర్తి చేయకుండానే ఇండియా వచ్చేశారు.
36
గౌతమ్ అదానీ
అంబానీ తరువాత మనదేశంలో రెండో సంపన్నుడు గౌతమ్ అదానీ. ఇతను ముంబై కాలేజీలో సీటు కోసం ప్రయత్నించారు. కానీ అక్కడ సీటు రాకపోవడంతో గుజరాత్ యూనివర్సిటీలో బీకామ్‌లో చేరారు. కానీ అక్కడ కూడా చదవలేదు. రెండో ఏడాది చదువును మధ్యలో ఆపేసి ఇంటికి వచ్చారు. కాలేజీ చదువు మధ్యలోనే వదలేసినా అదానీ అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు.
హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్. ఇతని సంపద కూడా తక్కువేమీ కాదు. శివ్ నాడార్ సంపద 31.6 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఆయన కోయంబత్తూర్‌లోని పీఎస్‌జీ కాలేజీలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు.
56
సావిత్రి జిందాల్
భారతదేశంలో సంపన్న మహిళల్లో సావిత్రి జిందాల్ మొదటి స్థానంలో ఉంటారు. ఈమె తన భర్త ఓం ప్రకాశ్ జిందాల్ మరణం జిందాల్ గ్రూప్ బాధ్యతలు చేపట్టారు. ఈమె డిగ్రీ పూర్తి చేశారు. ఆమె మహారాజా అగ్రసేన్ మెడికల్ కాలేజీకి అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె ఆస్తి 40 బిలియన్ డాలర్లు ఉంటుంది.
66
దిలీప్ సంఘ్వీ
సన్ ఫార్మాస్యూటికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు దిలీప్ సంఘ్వీ. కోల్‌కతాలోని భవానీపూర్ ఎడ్యుకేషన్ సొసైటీ కాలేజీలో ఆయన కామర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఈయన దేశంలోని ప్రతిష్టాత్మక ఫార్మా కంపెనీని విజయవంతంగా నడిపిస్తున్నారు.