Aadhaar Update: వారి ఆధార్‌ అప్‌డేట్‌ చేయకపోతే ఇబ్బందులే.. కేంద్రం సంచలన నిర్ణయం

Published : Jul 21, 2025, 12:36 PM IST

Aadhaar Update:  ఆధార్ అప్‌డేట్‌లలో విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బయోమెట్రిక్ సమాచారం, చిరునామా వంటి వివరాలను అప్డేట్ చేయడానికి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. యాక్టివేషన్ లేకుండా ఉన్న కార్డులను డీయాక్టివ్ చేయాలని నిర్ణయించింది. 

PREV
15
ఆధార్ కార్డు అప్‌డేట్

ఆధార్ కార్డు.. భారతీయులకు ఒక ముఖ్యమైన గుర్తింపు. ఇది ప్రభుత్వ పథకాలు, ఆర్థిక సేవలను పొందేందుకు ఉపయోగపడుతుంది. అయితే.. ఇది భారతీయ పౌరసత్వానికి రుజువు కాదనే విషయం తెలుసుకోవాలి. ఓటరు కార్డుతో ఆధార్‌ను అనుసంధానించేటప్పుడు దాని పరిమితులను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆధార్ తప్పనిసరి అప్‌డేట్స్ చేయాలని  UIDAI తెలిపింది. ఈ మేరకు కేంద్రం బయోమెట్రిక్ సమాచారం, చిరునామా ఇతర వివరాలను నవీకరించడానికి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

25
ఇకపై ఆ మార్పులు ఆధార్ సేవా కేంద్రాలలో

ఆధార్ కార్డులో ఫోటో, బయోమెట్రిక్ లేదా జనాభా వివరాలను ఇంటి నుంచే అప్‌డేట్ చేయడం సాధ్యపడదని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ వివరాలను సవరించాలంటే  ఆధార్ సేవా కేంద్రం లేదా అధీకృత అప్‌డేట్ కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. ఆధార్ డేటాబేస్ భద్రతను కాపాడటానికే ఈ నిబంధన అమల్లోకి తెచ్చారు.

35
తల్లిదండ్రులకు బిగ్ అప్డేట్

తల్లిదండ్రులకు UIDAI కీలక సూచన జారీ చేసింది. ఏడు సంవత్సరాలు నిండిన పిల్లల బయోమెట్రిక్ డేటా (వేలిముద్రలు, కన్ను స్కాన్, ఫోటో) తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలి. ఇది చేయకపోతే వారి ఆధార్ చెల్లదు.  అలాగే భవిష్యత్తులో ప్రభుత్వ సేవలు పొందడంలో ఆటంకాలు తలెత్తవచ్చు.

45
ఆధార్ అప్‌డేట్ తప్పనిసరి

ఆధార్ సమాచారాన్ని అప్‌డేట్ చేయకపోతే సమస్యలు తలెత్తే అవకాశం ఉందని UIDAI హెచ్చరించింది.  తప్పు లేదా గడువు ముగిసిన డేటా వల్ల సబ్సిడీలు, బ్యాంకింగ్ సేవలు, అధికారిక ధృవీకరణల సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే.. క్రమం తప్పని అప్‌డేట్‌లు గుర్తింపు దొంగతనం, మోసాలను నివారించడంలో సహాయపడతాయి. కాబట్టి చిరునామా, పేరు, మొబైల్ నంబర్ లేదా బయోమెట్రిక్స్‌లో మార్పులు ఉంటే వెంటనే ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవడం మంచిది.

55
మీ సమీపంలో ఆధార్ కేంద్రాన్ని గుర్తించండిలా?

మీ ఆధార్‌ను అప్‌డేట్ చేయాలంటే.. మొదటగా UIDAI అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ‘నమోదు కేంద్రాన్ని కనుగొనండి’ ఎంపికను ఎంచుకోవాలి. అందులో మీ రాష్ట్రం, జిల్లా లేదా పిన్ కోడ్‌ నమోదు చేయండి. ఇలా సమీప ఆధార్ అప్‌డేట్ కేంద్రాన్ని గుర్తించవచ్చు. అప్‌డేట్ కోసం అవసరమైన పత్రాలతో అక్కడికి వెళ్లాలి. వివరాలు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకోవాలి. అప్‌డేట్ వల్ల బ్యాంకింగ్, సబ్సిడీ, ఇతర సేవలకు ఇబ్బందులేకుండా సజావుగా యాక్సెస్ లభిస్తుంది.  

Read more Photos on
click me!

Recommended Stories