బంగారం, వెండి ధరలకు రెక్కలు.. నేడు 10 గ్రాముల పసిడి ధర ఎంత పెరిగిందంటే..?

First Published Jul 28, 2021, 11:30 AM IST

దేశీయ మార్కెట్లో నేడు అంటే బుధవారం బంగారం, వెండి ధరలు కాస్త పెరిగాయి. ఈ రోజు ఎంసిఎక్స్ లో గోల్డ్ ఫ్యూచర్స్ 0.18 శాతం అంటే 87 రూపాయలు పెరిగి 10 గ్రాములకు రూ.47660 చేరుకుంది. వెండి గురించి మాట్లాడితే  0.40 శాతం (రూ. 264) పెరిగి కిలోకు రూ.66320 వద్ద ఉంది. 

పసుపు లోహం గతేడాది గరిష్ట స్థాయి నుండి రూ .8540 తగ్గింది (10 గ్రాములకు 56,200 రూపాయలు). భారతదేశంలో బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లచే ప్రభావితమవుతాయి. పెరుగుతున్న కొరోనావైరస్ కేసులు, ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ, చైనా ఆర్థిక వ్యవస్థపై ఉన్న ఆందోళనల మధ్య బలహీనమైన యుఎస్ డాలర్, సురక్షితమైన డిమాండ్ బంగారానికి మద్దతు ఇస్తుందని కొటక్ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ హెడ్ రవీంద్రరావు అన్నారు.
undefined
యుఎస్ డాలర్ సూచీ పతనం మధ్య, పరిమిత అమ్మకాలు బంగారంలో కనిపించాయి, కాని వెండి దాదాపు నాలుగు నెలల కనిష్టానికి పడిపోయింది. ఈ రోజు ప్రపంచ మార్కెట్లలో బంగారం ధరలు ఫ్లాట్‌గా ఉన్నాయి. స్పాట్ బంగారం ఔన్సుకు 1,798.75 డాలర్లకు పెరిగింది. యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్సు 0.1 శాతం పడిపోయి 1798.20 డాలర్లకు చేరుకుంది. ఇతర విలువైన లోహాలలో వెండి ఔన్సు కి 24.67 డాలర్లు. మంగళవారం వెండి దాదాపు నాలుగు నెలల కనిష్ట స్థాయి 24.46 డాలర్లను తాకింది. పల్లాడియం 0.1 శాతం తగ్గి 2605.01 వద్ద, ప్లాటినం 0.22 శాతం పెరిగి 1052.93 డాలర్లకు చేరుకుంది.
undefined
ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం, అత్యధిక స్వచ్ఛత కలిగిన బంగారం సోమవారం స్పాట్ మార్కెట్లో 10 గ్రాములకు రూ.47,724 అమ్ముడైంది, వెండి ధర కిలోకు రూ.66,988 అమ్ముడైంది. జూన్ నెలలో రత్నాలు, ఆభరణాల మొత్తం ఎగుమతి 92.37 శాతం పెరిగి రూ .20,851.28 కోట్లకు చేరింది. రత్నాలు, ఆభరణాల ఎగుమతి గత ఏడాది ఈ కాలంలో రూ .10,838.93 కోట్లుగా ఉందని జిజెఇపిసి తెలిపింది. అదేవిధంగా జూన్‌లో పాలిష్ చేసిన వజ్రాల ఎగుమతి 113.25 శాతం పెరిగి రూ .14,512.11 కోట్లకు చేరుకుంది.
undefined
దేశ ఆర్థిక పునరుద్ధరణ కోసం బాండ్ల కొనుగోళ్లపై ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ (FOMC) నిర్వహిస్తున్న రెండు రోజుల సమావేశానికి ముందే జాతీయ అంతర్జాతీయ మార్కెట్‌లలో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ సమావేశానికి ముందే ఇన్వెస్టర్లు ఆచితూచి ట్రేడింగ్‌ చేయడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర 1,800 డాలర్ల కంటే తక్కువగా నమోదు అవుతోంది.
undefined
ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,660 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,660 గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,600 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,660గా ఉంది.ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,660 గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,660గా ఉంది. హైదరాబాద్‌ లో కిలో వెండి ధర రూ.71,900గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.71,900గా, ముంబైలో కిలో వెండి ధర రూ.67,100గా ఉంది.
undefined
click me!