China Smart Phone: చైనా కంపెనీలకు షాక్...చైనీస్ స్మార్ట్ ఫోన్స్ బ్యాన్ చేసే దిశగా భారత్ కీలక నిర్ణయం ?

Published : Aug 08, 2022, 05:09 PM IST

ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ భారతదేశం . అయితే స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చైనా ఆధిపత్యానికి గండికొట్టేందుకు భారత్ సిద్ధం అవుతోంది. ముఖ్యంగా చైనీస్ దిగ్గజ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న తక్కువ ధర స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ నుంచి ఆయా కంపెనీలను తరిమికొట్టేందుకు భారత్ సిద్ధమవుతోంది. చైనీస్ తయారీదారులు 150 డాలర్లు అంటే రూ. 12,000 కంటే తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించకుండా భారత్ నిషేధించనుంది. 

PREV
14
China Smart Phone: చైనా కంపెనీలకు షాక్...చైనీస్ స్మార్ట్ ఫోన్స్ బ్యాన్ చేసే దిశగా భారత్ కీలక నిర్ణయం ?

Realme, Xiaomi వంటి చైనీస్ బ్రాండ్లు తక్కువ-ధర స్మార్ట్‌ఫోన్ సరఫరా నుండి ఉపసంహరణ ద్వారా ప్రభావితమవుతాయి. జూన్ 2022 నుండి త్రైమాసికంలో భారతదేశం యొక్క స్మార్ట్‌ఫోన్ విక్రయాలలో మూడవ వంతు ధర రూ.12,000 కంటే తక్కువ ధర కలిగిన స్మార్ట్‌ఫోన్‌లు. చైనా కంపెనీలు 80 శాతం వరకు దిగుమతి చేసుకున్నాయి. 

24

2020లో భారత్, చైనాలు ఘర్షణ వాతావరణం ప్రారంభమైనప్పటి నుంచి చైనా కంపెనీలపై భారత్ ఒత్తిడి పెంచింది. రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నందున టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ వీచాట్, బైట్‌డాన్స్ లిమిటెడ్ కు చెందిన టిక్ టాక్‌ యాప్ తో సహా 300కి పైగా యాప్‌లను భారత్ నిషేధించింది. అదే సమయంలో దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీ దారులు లావా,  మైక్రోమ్యాక్స్ వంటి కంపెనీలు మన మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో సగం కంటే తక్కువ వాటాను కలిగి ఉండటం గమనార్హం. 

34

కోవిడ్ -19 వ్యాప్తి చెందుతున్న సమయంలో భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రికార్డు స్థాయిలో అమ్మకాలను సాధించింది. సెప్టెంబర్ 2020లో, భారతదేశంలో 50 మిలియన్ స్మార్ట్‌ఫోన్‌లు అమ్ముడయ్యాయి. ఇందులో 76 శాతం చైనా కంపెనీలకు చెందినవే. చైనా కంపెనీ షియోమీ విక్రయాల్లో మొదటి స్థానంలో నిలిచింది. Xiaomi 2020లో 13.1 మిలియన్ యూనిట్ల ఫోన్‌లను విక్రయించింది. 

44

రూ.12,000 లోపు ధర కలిగిన చైనా దిగ్గజాల స్మార్ట్‌ఫోన్‌లకు నో చెప్పడంతో భారతీయ కంపెనీలకు అవకాశాలు పెరగవచ్చు. అయితే తక్కువ బడ్జెట్‌లో వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా దేశంలో మరిన్ని ఉత్పత్తులు ఉండటం విశేషం.

Read more Photos on
click me!

Recommended Stories