Business Ideas: మీ దగ్గర 5 వేలు ఉంటే, ఈ వ్యాపారం ప్రారంభించండి..నెలకు 30 వేల నుంచి లక్ష వరకు సంపాదించవచ్చు

First Published Aug 8, 2022, 11:15 AM IST

వర్షాకాలం మొదలైంది. దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మీరు ఈ సీజన్‌లో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే, ఇది మీకు మంచి బిజినెస్ ఐడియా అని చెప్పవచ్చు.  ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి పెద్ద పెట్టుబడి అవసరం లేదు. తక్కువ పెట్టుబడితో చాలా లాభాలు పొందవచ్చు.

కేవలం 5 వేల రూపాయల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. వర్షాకాలంలో రెయిన్‌కోట్‌లు, గొడుగులు, వాటర్‌ప్రూఫ్ స్కూల్ బ్యాగ్‌లు, రబ్బరు షూలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే, మీకు మంచి లాభం వస్తుంది. రెయిన్‌కోట్‌లు, గొడుగులు, వాటర్‌ప్రూఫ్ బ్యాగులు మొదలైనవి మన దేశంలో పెద్ద సంఖ్యలో అమ్ముడవుతాయి. ప్రతినెలా లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. మీరు చిన్నగా ప్రారంభించినా, ప్రతి నెలా పెద్ద ఆదాయం వస్తుంది.,

మీరు కూడా ఈ వ్యాపారం చిన్న స్థాయిలో ప్రారంభించాలంటే... 5 వేల రూపాయల మూలధనం కావాలి.  రెయిన్‌కోట్‌లు, గొడుగులు, వాటర్‌ప్రూఫ్ స్కూల్ బ్యాగ్‌లు, రబ్బరు షూలను హోల్‌సేల్ మార్కెట్‌లో కొనుగోలు చేయాలి. వాటిని స్థానిక మార్కెట్లు, స్ట్రీట్ వెండర్స్ కు  విక్రయించాలి.,

ఈ విధంగా మీరు గొడుగులు, రెయిన్‌కోట్లు, వాటర్‌ప్రూఫ్ బ్యాగ్‌లను విక్రయించి మంచి లాభాలను పొందవచ్చు. తక్కువ ఖర్చుతో యిన్‌కోట్‌లు, గొడుగులు, వాటర్‌ప్రూఫ్ స్కూల్ బ్యాగ్‌లు, రబ్బరు షూలను కొనుగోలు చేసి, మీకు ఆల్రెడీ ఒక షాపు లేదా కమర్షియల్ స్పేస్ ఉన్నట్లయితే స్వయంగా మీరే విక్రయిస్తే, ఎక్కువ మార్జిన్ వస్తుంది. ఎక్కువ లాభం పొందుతారు. ప్రత్యామ్నాయంగా, దీనిని తక్కువ ధరకు హోల్ సేల్ గా అమ్మవచ్చు.

ఈ వస్తువులను 20 నుంచి 25 శాతం మార్జిన్‌తో విక్రయిస్తే... ఈ వ్యాపారం ద్వారా ప్రతి నెలా 15 నుంచి 35 వేల రూపాయల వరకు సులభంగా సంపాదించవచ్చు. ఈ వ్యాపారాన్ని పెద్ద ఎత్తున ప్రారంభిస్తే.. నెలకు లక్ష రూపాయల వరకూ సంపాదించవచ్చు. 

NOTE: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న నివేదికలు, సమాచారం ఆధారంగా మాత్రమే రూపొందించబడింది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణులను సంప్రదించడం మంచిది

click me!