కేంద్రం గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు.. నేటి నుండి అమల్లోకి...

First Published | Apr 1, 2024, 11:17 AM IST

నేడు 19 కిలోల కమర్షియల్ సిలిండర్, ఐదు కిలోల ఎఫ్‌టిఎల్ (ఫ్రీ ట్రేడ్ ఎల్‌పిజి) సిలిండర్ ధరలను చమురు కంపెనీలు  తగ్గించాయి. ప్రస్తుతం  19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.30.50 తగ్గినట్లు, ఐదు కేజీల ఎఫ్‌టీఎల్‌ ధర రూ.7.50 తగ్గిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దింతో  ఏప్రిల్ 1 నుండి ఢిల్లీలో దీని ధర రూ.1764.50. 

అయితే గత నెల మార్చి 1న చమురు కంపెనీలు ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే. అప్పుడు  19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.25 పెంచగా, సిలిండర్ ధర రూ.1795కి చేరింది. అంతేకాదు మార్చి 1 నుంచి అన్ని మెట్రో నగరాల్లో  గ్యాస్ సిలిండర్ ధరల్లో పెరుగుదల కనిపించింది. 
 

ఎన్నికల ముందు ఎల్‌పీజీ సిలిండర్ ధర తగ్గింపు
గత మూడు నెలలుగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరల పెంపుదల ప్రభావం చూపుతోంది. అయితే మూడు నెలల తర్వాత ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించారు.  ఏప్రిల్ 1, 2024న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు రూ. 30.50 తగ్గాయి.


IOCL ప్రకారం,  గ్యాస్ సిలిండర్ల ధర తగ్గింపు తర్వాత, ఇప్పుడు కోల్‌కతాలో 19కిలోల సిలిండర్ ధర రూ.1879. ఇంతకు ముందు  రూ.1911.  ముంబైలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.1717.50కి తగ్గింది, గతంలో రూ.1749గా ఉంది. చెన్నైలో వాణిజ్య LPG సిలిండర్ ఇప్పుడు రూ.1930కి అందుబాటులో ఉంది.

Latest Videos


దేశీయ LPG గ్యాస్ సిలిండర్ ధర ?
ఇక 14 కిలోల వంటింటి  గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.  దేశీయ గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.803, కోల్‌కతాలో రూ.829, ముంబైలో రూ.802.50 , చెన్నైలో రూ.818.50గా ఉంది.

దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై విండ్ ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ ను పెంచిన ప్రభుత్వం.. 
మార్చిలో దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై విండ్ ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ ను టన్నుకు రూ.3,300 నుంచి రూ.4,600కి పెంచింది. ఈ పన్ను ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ (SAED) రూపంలో విధించబడుతుంది. నోటిఫికేషన్ ప్రకారం, దేశీయ ముడి చమురుపై విండ్ ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ పెంచారు, అయితే డీజిల్ ఎగుమతిపై పన్ను లీటరుకు రూ.1.50 నుండి సున్నాకి తగ్గించబడింది. ఇది కాకుండా, పెట్రోల్ ఇంకా విమాన ఇంధనంపై పన్ను (ATF) ఇప్ప్పటిలాగే   సున్నాగా ఉంచబడింది.  

 హైదరాబాద్‌లో కూడా 19కిలోల సిలిండర్  ధర తగ్గినట్లు తెలుస్తోంది. గత నెలలో రూ. 25 పెరిగి రూ. 2027 కు చేరగా ఇప్పుడు రూ. 30.50 తగ్గింది. హైదరాబాద్‌లో  14కిలోల గ్యాస్ ధర రూ. 855 గా ఉంది.  అలాగే ఉజ్వల యోజన లబ్ధిదారులకు రూ. 300 సబ్సిడీ ఉండగా వారికి  రూ. 503 నుండి  రూ. 555 కే గ్యాస్ సిలిండర్ అందుబాటులో ఉండటం విశేషం.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) అండ్  హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ప్రతి నెలా 1వ తేదీన LPG ధరలను  సవరిస్తాయి. ఇంధన ధర అండ్   మార్కెట్ పరిస్థితులను బట్టి ధరలు మారుతూ ఉంటాయి.
 

click me!