Gold price today: తులం బంగారం 60 వేలు అయ్యే చాన్స్, ప్రూఫ్స్ ఇవే...పసిడి ప్రేమికులకు రక్త కన్నీరే...

First Published Jul 4, 2022, 6:16 PM IST

బంగారం ధరలు గడిచిన నెల రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి.  ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ఒక ఔన్సు (31 గ్రాముల) ధర 1800 డాలర్లు దాటింది. ప్రస్తుతం ఒక ఔన్స్ పసిడి ధర 1807 డాలర్లు అంటే రూ.1,42,605 పలుకుతోంది. అటు దేశీయంగా 24 కేరట్ల పసిడి ధర హైదరాబాద్ లో రూ. 53, 857 పలుకుతోంది. అయితే అతి త్వరలోనే పసిడి ధర రూ.60 వేలు దాటే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.  


మీరు విన్నది నిజమే అతి త్వరలోనే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం కోసం దాదాపు రూ. 60000 చెల్లించాల్సి ఉంటుంది.  ఇండియా బులియన్ అసోసియేషన్ విడుదల చేసిన స్పాట్ రేట్ ప్రకారం, ఈ రోజు బులియన్ మార్కెట్‌లలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 548 పెరిగింది, 10 గ్రాముల పసిడి ధర రూ. 53,857 పలుకుతోంది. అదే సమయంలో కిలో వెండి ధర రూ.240 పెరిగి రూ.58013 పలుకుతోంది. మీరు 24 క్యారెట్ల బంగారంపై 3 శాతం జిఎస్‌టిని జోడిస్తే, దాని రేటు రూ. 54,000 దాటుతుంది.

IBJA జారీ చేసిన రేట్లు దేశవ్యాప్తంగా సార్వత్రికమైనవి. అయితే, ఈ వెబ్‌సైట్‌లో ఇవ్వబడిన రేటుకి GST ఉండదు. మీరు బయట బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు, విక్రయించేటప్పుడు మీరు IBJA రేటును ప్రామాణికంగా తీసుకోవచ్చు. ఇండియా బులియన్, జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం, ibja దేశవ్యాప్తంగా 14 కేంద్రాల నుండి ప్రస్తుత బంగారం, వెండి ధరను తీసుకుంటుంది,  దాని సగటు విలువను ఇస్తుంది. బంగారం, వెండి ప్రస్తుత ధర లేదా స్పాట్ ధర ఒక్కో ప్రదేశానికి భిన్నంగా ఉండవచ్చు. కానీ వాటి ధరల్లో స్వల్ప వ్యత్యాసం ఉంది.

ఇక బంగారం వరుసగా పెరగడానికి కారణాలు లేకపోలేదు. కరోనా సమయంలో 2020 సంవత్సరంలో పసిడి ధర ఏకంగా 56 వేలు దాటి ఆల్ టైం గరిష్ట స్థాయిని నమోదు చేసింది. దీనికి కారణం లేకపోలేదు. ఆ సమయంలో స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. దీంతో మదుపరులు, బంగారం వైపు తమ పెట్టుబడులను నడిపించారు. దీంతో పసిడికి డిమాండ్ పెరిగి ఒక్కసారిగా ఊపందుకుంది. ఆ తర్వాత మార్కెట్ పుంజుకోవడంతో పసిడి నుంచి స్టాక్ మార్కెట్ వైపు పెట్టుబడులు తరలాయి. దీంతో పసిడి ధర 50 వేల దిగువకు వచ్చింది. 

కానీ ప్రస్తుతం స్టాక్ మార్కెట్ లో గడిచిన నెల రోజులుగా మార్కెట్ ను గమనించినట్లయితే, సెన్సెక్స్ 4.5 శాతం నష్టపోయింది. అదే సమయంలో నిఫ్టీ సైతం 4 శాతం పైనే నష్టపోయింది. దీంతో మదుపరులు మరోసారి సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు తమ పెట్టుబడులను తరలిస్తున్నారు. దీంతో పసిడి ధర మరోసారి 50 వేలు దాటింది. ప్రస్తుతం తులం బంగారం 54 వేల సమీపంలో ట్రేడవుతోంది. అయితే అతి త్వరలోనే పసిడి ధర రూ.60 వేలు తులం దిశగా వేగంగా కదిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

దీంతో పసిడి ప్రేమికుల్లో ఒక్కసారిగా హాహాకారాలు గమనించవచ్చు. గతంలో 56 వేల గరిష్ట స్థాయిని తాకినప్పుడే, పసిడి ప్రేమికులు హతాశులయ్యారు. అలాంటిది ఏకంగా 60 వేలు దాటితే, బులియన్ మార్కెట్ మరింత డీలా పడే అవకాశం ఉందని, జువెలరీ రంగ నిపుణులు అంటున్నారు. దీనికి తోడు దేశీయంగా పసిడి దిగుమతులను తగ్గించేందుకు, బంగారంపై కస్టమ్స్ డ్యూటీ పెంపు కూడా పసిడి ధరల పెరుగుదలకు కారణం అవుతోంది. 

click me!