రిక్టర్ స్కేలుపై 8 తీవ్రతతో భూకంపం వచ్చినా ఈ భవనానికి ఏమీ కాదు. ఇక్కడ 600 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇంటీరియర్ డిజైన్ కమలం, సూర్యుని ఆకారాలను ఉపయోగిస్తుంది. ఇక్కడ ఏ రెండు అంతస్తులు ఒకేలా ఉండవు. ప్రతి అంతస్తును విభిన్న రకాల వస్తువులు, ప్రణాళికతో నిర్మించారు.
4,00,000 చదరపు అడుగుల విస్తీర్ణం, 570 అడుగుల ఎత్తున్న ఆంటిలియాలో ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా, కుమారులు అనంత్, ఆకాష్, కోడళ్లు శ్లోకా, రాధిక, తల్లి వేద్ జోషి కలిసి నివసిస్తున్నారు. ఈ భారీ భవనంలో ముఖేష్ అంబానీ కుటుంబం ఏ అంతస్తులో నివసిస్తుందో మీకు తెలుసా? 27వ అంతస్తును అంబానీ కుటుంబం తమ నివాసానికి ఉపయోగిస్తోంది. దీనికి ప్రత్యేక ద్వారం కూడా ఉంది. దీని ద్వారా కొద్ది మందికి మాత్రమే లోపలికి ప్రవేశం ఉంటుంది.