UPI Payments: యూపీఐ ఛార్జీల భారం నుంచి తప్పించుకోవడానికి 5 సింపుల్ ట్రిక్స్ ఇవే

Published : Sep 17, 2026, 07:02 AM IST

UPI Payments: ప్రభుత్వం యూపీఐ పేమెంట్స్ పై ఛార్జీల విధించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, మీరు యూపీఐ పేమెంట్స్‌పై ఎండీఆర్ భారం తగ్గించుకోవాలనుకుంటున్నారా? వ్యాపారులు రూల్స్ ప్రకారం ఛార్జీల నుండి ఎలా బయటపడొచ్చో ఈ 5 సింపుల్ ట్రిక్స్ లో చూద్దాం.

PREV
16
యూపీఐ ఎండీఆర్ రూల్స్: వ్యాపారుల ఆందోళన

డిజిటల్ పేమెంట్స్ కాలంలో యూపీఐ మన అందరికీ లావాదేవీలు చాలా ఈజీగా మార్చేసింది. కానీ అక్టోబర్ 15 నుండి రూ. 2,000 కంటే ఎక్కువ ఉన్న మర్చంట్ యూపీఐ పేమెంట్లపై 0.4% ఎండీఆర్ (Merchant Discount Rate) అమల్లోకి రానుంది. ఈ ఛార్జీల వల్ల వ్యాపారుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. డిజిటల్ పేమెంట్ సదుపాయం అందిస్తూనే, ప్రాసెసింగ్ ఖర్చులను అదుపులో ఉంచుకోవడం ప్రతి వ్యాపారికి ముఖ్యంగా మారింది. ఎండీఆర్ భారాన్ని తగ్గించుకోవడానికి వ్యాపారులు పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు గమనిస్తే..

26
పర్సనల్ క్యూఆర్ కోడ్‌ను తెలివిగా వాడటం

చాలా మంది చిన్న వ్యాపారులు తమ సొంత బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన పర్సనల్ క్యూఆర్ కోడ్‌ను వాడుతుంటారు. పర్సన్ టు పర్సన్ ట్రాన్స్‌ఫర్లపై ఎలాంటి సాధారణ మర్చంట్ ఎండీఆర్ ఛార్జీలు వర్తించవు. అయితే, కమర్షియల్ పేమెంట్లను కావాలని పర్సనల్ లావాదేవీలుగా చూపించడం బ్యాంకింగ్ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. అందుకే వ్యాపారులు తమ బ్యాంక్, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ మార్గదర్శకాలకు అనుగుణంగానే సరైన క్యూఆర్ కోడ్‌ను ఎంచుకోవడం మంచిది.

36
చిన్న పేమెంట్ల కోసం యూపీఐ లైట్ సదుపాయం

చిన్న మొత్తాల లావాదేవీల కోసం యూపీఐ లైట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది బ్యాంక్ సర్వర్లపై ఒత్తిడి లేకుండా త్వరితగతిన పేమెంట్ పూర్తి అయ్యేలా చేస్తుంది. అయితే పెద్ద పేమెంట్లపై పడే ఎండీఆర్ నుండి తప్పించుకోవడానికి దీన్ని ఒక మార్గంగా మాత్రమే చూడకూడదు. సజావుగా, వేగంగా చిన్న పేమెంట్లు పూర్తి చేయడమే దీని ప్రధాన ఉద్దేశం.

46
పెద్ద బిల్లులను పార్ట్ లు గా చేయడం

రూ. 5,000 లేదా రూ. 10,000 వంటి పెద్ద బిల్లులను రూ. 2,000 కంటే తక్కువ భాగాలుగా విభజించి పేమెంట్ తీసుకోవడం ఒక ప్రత్యామ్నాయంగా కనిపించవచ్చు. కానీ, కేవలం ఛార్జీలు తప్పించుకోవడానికే బిల్లులను కృత్రిమంగా ముక్కలు చేయడం మర్చంట్‌కు జరిమానా పడే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే ఈ పద్ధతి పాటించే ముందు పేమెంట్ అగ్రిగేటర్ నిబంధనలను సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

56
డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్

వ్యాపారులు తమ కస్టమర్ల నుండి నేరుగా బ్యాంక్ అకౌంట్‌కే డబ్బులు పంపే ఆప్షన్‌ను పరిశీలించవచ్చు. ఇందులో యూపీఐ అకౌంట్-టు-అకౌంట్‌తో పాటు ఐఎంపీఎస్ లేదా ఎన్ఈఎఫ్టీ వంటి విధానాలను ఉపయోగించవచ్చు. ఈ పద్ధతి వల్ల పేమెంట్ అగ్రిగేటర్ లేదా మర్చంట్ వాలెట్ ద్వారా పడే అదనపు ఛార్జీల నుండి తప్పించుకోవచ్చు. అయితే ఈ సేవలపై బ్యాంక్ విధించే సర్వీస్ ఛార్జీలను ముందే సరిచూసుకోవడం అవసరం.

66
స్టాటిక్ క్యూఆర్ తో డివైజ్ రెంటల్ ఆదా

ప్రతి చిన్న వ్యాపారి ఖరీదైన పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లు లేదా సౌండ్‌బాక్స్‌లు పెట్టాల్సిన అవసరం లేదు. సాధారణ బ్యాంక్ స్టాటిక్ క్యూఆర్ కోడ్‌ను వాడటం ద్వారా డివైజ్ రెంటల్, మంత్లీ మెయింటెనెన్స్ ఫీజులను ఈజీగా ఆదా చేసుకోవచ్చు. అయితే, ఎండీఆర్ పడటం అనేది క్యూఆర్ కోడ్ స్టాటిక్ లేదా డైనమిక్ అనే దానిపై ఆధారపడి ఉండదు, అది మర్చంట్ రిజిస్టర్డ్ కేటగిరీపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి.

Read more Photos on
click me!

Recommended Stories