ఈ 5 బిజినెస్ ఐడియాలు మిమ్మల్ని లక్షాధికారిని చేస్తాయి

First Published | Oct 4, 2024, 11:14 PM IST

మీరు బాగా చదువుకున్నారా? ఉద్యోగాల కోసం సిటీస్ కి వెళ్లడానికి మీకు ఇష్టం లేదా? మీ సొంత ఊరిలోనే ఉండి ఉపాధి పొందాలని భావిస్తున్నారా? అయితే ఈ 5 ఐడియాలు మీకు బాగా ఉపయోగపడతాయి. అయితే మీరు చేయాల్సిందల్లా మీ ఊరిలో జనానికి ఏం అవసరమో మీరు తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా మీరు వ్యాపారం ప్రారంభించాలి. వీటి ద్వారా మీరు మీ ఊరిలోనే ఉంటూ రూ.లక్షలు సంపాదించవచ్చు. 
 

గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇప్పుడు ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతున్నాయి. పల్లెల్లో అయితే తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు సంపాదించవచ్చు. టౌన్, సిటీస్ లో అయితే వ్యాపార పెట్టుబడి కంటే ఇతర ఖర్చులు పెరిగిపోతాయి. దీంతో లాభాల సంగతి ఎలా ఉన్నా పెట్టుబడి తిరిగి వస్తే చాలన్నట్లుగా మారుతోంది.  అందుకే ఇప్పుడు వ్యాపారాలు చేసే విధానాలు మారుతున్నాయి. సిటీస్ లోనే వ్యాపారాలు చేయాలని చాలా మంది అనుకోవడం లేదు. పల్లెల్లో యూనిట్లు పెట్టి పట్టణాలకు ఆ ప్రోడక్ట్స్ ను సరఫరా చేస్తున్నారు. తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభాలు తీసుకొచ్చే అలాంటి ఐడియాలు మీ కోసం ఇక్కడ ఉన్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. 

టీ బిజినెస్ ఎవర్ గ్రీన్

మీరు డిగ్నిటీ పక్కన పెట్టినట్లయితే టీ బిజినెస్ ఎవర్ గ్రీన్ గా ఉంటుంది. సొంతంగా టీ షాప్ పెడితే మీరు కేవలం రూ.20 వేలతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అయితే అవసరమైన వస్తువులు, డెకరేటెడ్ ఐటమ్స్ అన్నీ మీరే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇదంతా మన వల్ల కాదు అంటారా.. హ్యాపీగా ఫ్రాంఛైజీ తీసుకుంటే మీరు ఎలాంటి అవస్థలు పడాల్సిన అవసరం ఉండదు. అయితే కాస్త పెట్టుబడి ఎక్కువ అవుతుంది. సుమారు రూ.1.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అన్ని సరకులు, వసతులు కంపెనీయే ఇచ్చి ఆదాయంలో వాటా తీసుకుంటుంది. ఇది ఫ్రాంచైజీ ఇచ్చే కంపెనీని బట్టి మారుతూ ఉంటుంది. మీ ఊరి సెంటర్లో ఇప్పటికే టీ సెంటర్ ఉంటే మీరు ఇచ్చే టీ టేస్ట్ ను బట్టి మీ వ్యాపారం ఎంత బాగా రన్ అవుతుందన్నది ఆధారపడి ఉంటుంది. కాలేజీలు, మార్కెట్లు, బస్టాండ్ ఇలా రద్దీ ప్రదేశాల్లో టీ దుకాణం పెడితే ఈజీగా రన్ అవుతుంది. ఈ బిజినెస్ ద్వారా నెలకు కనీసం రూ.40 వేలకు పైగా సంపాదించవచ్చు.
 

ఫాస్ట్ ఫుడ్ సూపర్ బిజినెస్

ఫాస్ట్ ఫుడ్ ఇప్పటికీ సిటీస్, టౌన్స్ లోనే కనిపిస్తున్నాయి. పల్లెల్లో ఇవి పెద్దగా రాణించడం లేదు. మీరు ఫాస్ట్ ఫుడ్ తినాలనుకుంటే వెంటనే మీకు ఏ హోటల్ అయితే గుర్తు వస్తోందో.. అలాగే మీరు పెట్టే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా అంత క్లిక్ అవ్వాలి. అలా అవ్వాలంటే మీరు టేస్టీగా ఫాస్ట్ ఫుడ్ చేయాలి. దీంతో మీ షాప్ కు మంచి పేరు వస్తే  పక్క ఊర్ల నుంచి కూడా జనం మీ దగ్గరకు వచ్చి కొంటారు. ఏది ఏమైనా టేస్ట్, క్వాలిటీ మీద ఫుడ్ బిజినెస్ ఆధారపడి ఉంటుంది. ఎంత క్వాలిటీగా ఇవ్వగలిగితే అంత ఎక్కువ మందికి మీ బిజినెస్ రీచ్ అవుతుంది. మీకు కుకింగ్ రాకపోయినా టాలెంటెడ్ చెఫ్ ను పెట్టుకొంటే మీ బిజినెస్ బాగా రన్ అవుతుంది. ఈ బిజినెస్ ద్వారా మీరు నెలకు రూ.50 వేలకు పైగా సంపాదించవచ్చు. 


క్లాత్ బిజినెస్ బెస్ట్

రెడీమేడ్ బట్టల వ్యాపారం మీ ఊర్లో బాగా రన్ అవ్వాలంటే కొన్ని టెక్నిక్స్ పాటించాలి. సాధారణంగా గ్రామాల్లో బిజినెస్ లు పెద్దగా సక్సెస్ అవ్వకపోవడానికి కారణం బాకీలు. మీరు మీ ఊరిలో రెడీమేడ్ బట్టల దుకాణం పెడితే సరకు చాలా ఈజీగా, త్వరగా అమ్ముడైపోతుంది. కాని డబ్బులు మాత్రం జనాల నుంచి టైమ్ కు రావు. దీంతో ఊరుల్లో బిజినెస్ లు పెట్టడానికి చాలా మంది ఇంట్రస్ట్ చూపరు. మీరు అయితే మీ ఊరిలో జనాలకు నచ్చే విధంగా మంచి బ్రాండ్స్, డిజైన్స్ తెచ్చి పెడితే కొనుక్కొనేందుకు వెంటనే వస్తారు. డబ్బుల విషయంలో మొహమాటం లేకుండా ఉంటే మీ బిజినెస్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. జనరల్ గా రెడీమేడ్ బట్టల వ్యాపారం పెట్టేందుకు మీ కెపాసిటీని బట్టి రూ.10 వేల నుంచి కూడా బిజినెస్ ప్రారంభించవచ్చు. మీ ఊరికి దగ్గరగా ఉన్న ఏ సిటీలో అయితే హోల్ సేల్ కు దొరుకుతాయో తెలుసుకొని అక్కడి నుంచి ఒకేసారి తెచ్చుకోవడం ద్వారా మీకు ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు కలిసి వస్తాయి. 

వెజిటబుల్ బిజినెస్ తో లాభాలు

ఊరిలో చేయగల చక్కటి వ్యాపారం కూరగాయల బిజినెస్. మీకు సొంత పొలం ఉంటే రకరకాల కూరగాయలు పెంచుతూ వాటిని విక్రయించడం ద్వారా లాభాలు పొందవచ్చు. ఈ వ్యాపారం మరింత వేగంగా అభివఈద్ధి చెందాలంటే సేంద్రియ విధనాల్లో మీరు కూరలు పండిస్తే మంచి దిగుబడితో పాటు, రెట్టింపు ఆదాయం వస్తుంది. ఈ వ్యాపారం చేయడానికి కూడా పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. సొంత పొలం ఉంటే రూ.50 వేల కంటే తక్కువకే ఈ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. కౌలుకు తీసుకున్నా పెట్టుబడి పెద్దగా పెరగదు. కూరగాయల వ్యాపారం బాగా రన్ అవ్వాలంటే మీరు పండించిన కూరగాయలను సిటీస్ కి తీసుకెళ్లి అమ్మడం మంచిది. దీని వల్ల మీ పంటకు మంచి ధరతో పాటు, సరకు కూడా త్వరగా అమ్ముడవుతాయి.

నాటుకోళ్ల బిజినెస్ తో రూ.లక్షల్లో ఆదాయం

నాటుకోళ్ల బిజినెస్ ఏ ప్రాంతంలోనైనా బాగా రన్ అయ్యే బిజినెస్. ముఖ్యంగా పల్లెల్లో కోళ్ల పెంపకం చేయడానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ బిజినెస్ కోసం మీరు కనీసం రూ.2 లక్షలపైగా పెట్టుబడి పెట్టాలి. కోళ్లు పెంచిన తర్వాత  మీ ఊరిలోనే కాకుండా చుట్టు పక్కల గ్రామాలు, పట్టణాల్లోనూ విక్రయించొచ్చు. అంతేకాకుండా సిటీస్ లో డీలర్స్ తో కాంట్రాక్ట్ పెట్టుకొని వారికి నేరుగా ట్రాన్స్ పోర్ట్ చేయడం ద్వారా మీరు మంచి బిజినెస్ చేయొచ్చు. ఇలా మీరు మీ సొంత ఊరిలోనే ఉంటూ మీకు సరిపడా బిజినెస్ స్టార్ట్ చేసి విజయం సాధించవచ్చు.

Latest Videos

click me!