ఈ ల్యాప్‌టాప్‌లో USB 2.0 టైప్ A పోర్ట్, సూపర్ స్పీడ్ USB Type C 5 Gbps సిగ్నలింగ్ రేట్ పోర్ట్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇది టచ్ స్క్రీన్ ల్యాప్‌టాప్ కావడంతో చాలా ప్రత్యేకమైనదిగా గుర్తింపు పొందింది. 11.6-అంగుళాల స్క్రీన్ 1366 x 768 రిజల్యూషన్‌తో హెచ్‌డి, ఐపిఎస్, యాంటీ గ్లేర్ ఫీచర్లను కూడా కలిగి ఉంది. స్పీకర్లు, మైక్రోఫోన్‌లు కూడా ఇందులో ఉన్నాయి.
HP Touch Chromebook లో వెబ్‌క్యామ్ సౌకర్యం కూడా ఉంది. HP కంపెనీ ఈ ల్యాప్‌టాప్ కోసం ఒక సంవత్సరం వారంటీని అందిస్తోంది. ఆన్‌లైన్ తరగతుల కోసం, బేసిక్ అవసరాల కోసం ఈ ల్యాప్ టాప్ చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ విద్యార్థులకు ఎక్కువ ఉపయోగంగా ఉంటుంది. ముఖ్యంగా ఆన్ లైన్ లో క్లాసెస్ అటెండ్ అయ్యే వారికి ఈ ల్యాప్ టాప్ లో ఉన్న సౌకర్యాలు బాగా ఉపయోగపడతాయి.