TVS ఫియరో 125 బైక్ ధర ఇంత తక్కువా?

First Published | Oct 4, 2024, 4:08 PM IST

దసరా పండగ సందర్భంగా మీరు కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా? మీరు తక్కువ బడ్జెట్ లో మంచి బైక్ తీసుకోవాలనుకుంటే ఈ బైక్ మీకు మంచి ఆప్షన్. TVS కంపెనీ ఫియరో 125 పేరుతో కొత్త మోడల్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఆ బైక్ ధర, ప్రత్యేకతలు లాంటి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 
 

దసరా పండగ సందర్భంగా టీవీఎస్ కంపెనీ కొత్త బైక్ తో మార్కెట్ లో సందడి చేస్తోంది. ఫియరో 125 పేరుతో రిలీజ్ చేసిన ఈ బైక్‌ స్టైలిష్ డిజైన్ తో చాలా ఆకట్టుకుంటోంది. అధిక మైలేజీ ఇచ్చే ఈ బైక్ ఇతర కంపెనీల ద్విచక్ర వాహనాలతో పోల్చితే కూడా  చాలా తక్కువ ధరకు మీరు కొనుగోలు చేయవచ్చు. రూ.79,000 ప్రారంభ ధరతో ఈ బైక్ అధునాతన ఫీచర్లు, సమర్థవంతమైన ఇంజిన్‌ను కలిగి ఉంది. 

టీవీఎస్ ఫియరో 125 బైక్

బైక్ కొనాలంటే ఎంతైన ధర పెడతాం. కాని మైలేజీ తక్కువ వస్తే ఇబ్బందిగా ఉంటుంది. కొత్తలో బాగానే ఉన్నా ఎక్కువ సార్లు పెట్రోల్ కొట్టించాల్సి వస్తోందని బాధ పడుతుంటాం. అయితే TVS ఫియరో 125 బైక్ మంచి మైలేజీని ఇచ్చే బైక్స్ లలో ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే హైక్వాలిటీ బైక్‌లకు పేరుగాంచిన టీవీఎస్ కంపెనీ ఈ బైక్ ను తయారు చేసింది. 

TVS ప్రస్థానం ఇది..

TVS మోటార్స్ కంపెనీ చెన్నై ప్రధాన కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా ద్విచక్ర  మార్కెట్ ను సాధించింది. ఆదాయ పరంగా ఇతి ఇండియాలోనే మూడో అతి పెద్ద మోటార్ సైకిల్ కంపెనీగా రూపొందింది. TVS మోటార్ కంపెనీ కూడా 60 దేశాలకు ఎగుమతులు చేస్తూ భారతదేశంలో రెండో అతిపెద్ద ద్విచక్ర వాహనాల ఎగుమతిదారుగా నిలిచింది. ఈ కంపెనీని ప్రారంభించింది టీవీ సుందరం అయ్యంగార్. 1911 లో ఒక బస్సు సర్వీస్ ను ఆయన ప్రారంభించారు. తర్వాత ట్రక్కులు, బస్సులతో రవాణా వ్యాపారంలో మంచి లాభాలు  సంపాదించిన సుందరం.. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని క్లేటన్ దేవాండ్రే హోల్డింగ్స్ సహకారంతో 1962లో TVS స్థాపించారుర. ఇది ప్రారంభంలో బ్రేక్‌లు, ఎగ్జాస్ట్‌లు, కంప్రెసర్‌లు, అనేక ఇతర ఆటోమోటివ్ భాగాలను తయారు చేసింది. తర్వాత కాలంలో ద్విచక్రవాహనాల తయారీలోకి దిగి అగ్రగామిగా నిలిచింది. 

Latest Videos


TVS మోపెడ్ లను తయారు చేసేందుకు 1976లో హోసూర్‌లో ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. 1980లో TVS 50 మోపెడ్ ను ఇండియాలో రిలీజ్ చేసి చరిత్రలో నిలిచింది. ఇప్పటికీ ఈ మోపెడ్ కొత్త హంగులతో ఇప్పటికీ మార్కెట్ లో రారాజుగా నిలిచింది. 1987లో జపనీస్ ఆటో దిగ్గజం సుజుకి లిమిటెడ్‌తో సాంకేతిక సహకారం తీసుకొనేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. 1989లో మోటార్‌సైకిళ్ల వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది. సుజుకి సుప్రా, సుజుకి సమురాయ్, సుజుకి షోగన్, సుజుకి షావోలిన్ వంటి అనేక మోడళ్లను విడుదల చేసింది. 2001లో సుజుకితో విడిపోయిన తర్వాత కంపెనీకి TVS మోటార్‌గా పేరు మార్చబడింది. అప్పటి నుంచి TVS ఒంటరిగానే బైక్ లు తయారు చేస్తూ మార్కెట్ లో తన సత్తా చాటుతోంది. ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫియరో 125 బైక్ కూడా తక్కువ ధర, ఎక్కువ మైలేజీతో వినియోగదారులకు ఆకట్టుకుంటోంది. 

TVS ఫియరో 125 అధునాతన సాంకేతికతతో కనిపిస్తుంది. కంపెనీ ఈ బైక్‌ను వివిధ వేరియంట్‌లలో భారత మార్కెట్‌లో విడుదల చేసింది. మీరు కూడా కొత్త బైక్ కొనాలని ఆలోచిస్తుంటే ఒక్కసారి ఈ విషయం తెలుసుకోవాలి. టీవీఎస్ కంపెనీ ఈ బైక్ ఫీచర్లను మెరుగుపరచడానికి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఉపయోగించింది.
 

TVS ఫియరో

TVS ఫియరో బైక్ లోపల భద్రత కోసం డిస్క్ బ్రేక్‌తో కూడిన సింగిల్ ఛానల్ ABS ను కంపెనీ ఉపయోగించింది. TVS కంపెనీ అత్యుత్తమ, అధునాతన ఫీచర్లు, అధునాతన సాంకేతికతతో కనిపిస్తుంది. కంపెనీ ఈ బైక్‌ను వివిధ వేరియంట్‌లలో భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ప్రజలను ఆకర్షించే విధంగా ఆకర్షణీయమైన డిజైన్‌తో ఈ టీవీఎస్ బైక్‌ను విడుదల చేశారు.

TVS Fiero 125 ధర ఎంతంటే..

TVS ఫియరో 125 బైక్ ఇంజన్ 6300 rpm వద్ద 10.8 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ఇంజన్ శక్తిని పెంచడానికి 123.9 cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉపయోగించారు. ఈ టీవీఎస్ బైక్ గరిష్టంగా 45 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. టీవీఎస్ కంపెనీ ఈ బైక్‌ను తక్కువ బడ్జెట్‌తో భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మీరు కూడా కొత్త TVS బైక్‌ని కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే ఈ బైక్ కేవలం రూ.79,000 ప్రారంభ ధరతో మీకు లభిస్తుంది. 

click me!