Samsung: మీరు నడిస్తే చాలు.. గెలాక్సీ వాచ్ అల్ట్రా ఫ్రీగా పొందొచ్చు. ఎలాగంటే..

Published : Apr 23, 2025, 01:40 PM IST

Samsung Walkathon India Challenge: శాంసంగ్ కంపెనీ ప్రజలకు అద్భుతమైన అవకాశాన్ని ఇస్తోంది. కేవలం నడిస్తే గెలాక్సీ వాచ్ అల్ట్రాను ఫ్రీగా పొందే అవకాశాన్నిస్తోంది. దీని కోసం వాక్-ఎ-థాన్ ఇండియా ఛాలెంజ్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో కంపెనీ రూల్స్ పాటిస్తూ నడిస్తే ఉచితంగా గెలాక్సీ వాచ్ అల్ట్రాను పొందే అవకాశం ఉంటుంది. 

PREV
15
Samsung: మీరు నడిస్తే చాలు.. గెలాక్సీ వాచ్ అల్ట్రా ఫ్రీగా పొందొచ్చు. ఎలాగంటే..

దేశవ్యాప్తంగా ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేయడానికి శాంసంగ్ కంపెనీ వాక్-ఎ-థాన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించింది. 30 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు హెల్త్ యాప్ ను ఉపయోగించాలి. 30 రోజుల్లో 2 లక్షల అడుగులు నడిచిన వారికి కంపెనీ బహుమతులు అందజేస్తుంది. 
 

25

ఈ ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన వారికి శాంసంగ్ కంపెనీ గెలాక్సీ వాచ్ అల్ట్రాను గెలుచుకునే అవకాశం అందిస్తోంది. ఫ్లాగ్‌షిప్ వేరబుల్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్‌లు వంటి అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. 

శాంసంగ్ ప్రకటించిన వివరాల ప్రకారం వినియోగదారులు ఏప్రిల్ 21న ఛాలెంజ్‌ను ప్రారంభించాలి. మే 20, 2025న ఈ ఛాలెంజ్ పూర్తవుతుంది. ఈ నెల రోజుల పాటు రోజు కొంచెంసేపు టైమ్ కేటాయించుకొని నడుస్తూ ఉండాలి. ఎవరు ఎన్ని అడుగులు నడుస్తున్నారో తెలుసుకోవడానికి శాంసంగ్ హెల్త్ యాప్‌ని ఉపయోగించాలి. ఈ నెల రోజుల్లో మొత్తం రెండు లక్షల అడుగులు వేయాలి. ఇవి పూర్తి చేసిన ప్రతి ఒక్కరికీ అవార్డులు అందజేస్తామని కంపెనీ ప్రకటించింది. 
 

35

రెండు లక్షల లేదా అంతకంటే ఎక్కువ అడుగులు పూర్తి చేసిన వారందరూ గెలాక్సీ వాచ్ అల్ట్రాపై భారీగా 25% డిస్కౌంట్ పొందుతారు. అయితే వారిలో ముగ్గురిని డ్రా ద్వారా ఎంపిక చేసి విజేతలుగా ప్రకటిస్తారు. వారికి గెలాక్సీ వాచ్ అల్ట్రాను బహూకరిస్తారు. 
 

45

పోటీలో ఎలా పాల్గొనాలి?

మీ శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లో హెల్త్ యాప్‌ను ఓపెన్ చేసి వాక్-ఎ-థాన్ ఇండియా ఛాలెంజ్‌కి వెళ్లండి. రూల్స్ చదవండి. వాటిని పాటిస్తూ 30 రోజుల వ్యవధిలో మొత్తం 2 లక్షల అడుగులు నడవండి. ఛాలెంజ్ ని పూర్తి చేసిన వారిలో లక్కీ డ్రాలో గెలుపొందిన వారు ఫ్రీగా గెలాక్సీ వాచ్ అల్ట్రాను సొంతం చేసుకుంటారు. 

55

కండీషన్స్ ఇవి..

వాక్-ఎ-థాన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడానికి వినియోగదారులు ఈ షరతులను పాటించాలి. 
శాంసంగ్ హెల్త్ యాప్ ఇన్‌స్టాల్ చేసిన గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించాలి.
శాంసంగ్ హెల్త్ యాప్ ద్వారా ‘వాక్-ఎ-థాన్ ఇండియా’ ఛాలెంజ్‌లో చేరాలి.
ఏప్రిల్ 21, మే 20 మధ్య కనీసం 2,00,000 అడుగులు పూర్తి చేయాలి. 
ఛాలెంజ్ పూర్తి చేసిన తర్వాత బహుమతిని పొందడానికి మే 26, జూన్ 15, 2025 మధ్య శాంసంగ్ హెల్త్ యాప్‌ను చెక్ చేయండి. 

Read more Photos on
click me!

Recommended Stories