ప్రీమియం లుక్ ఉన్న ఫోన్ కావాలనుకునే వారికి Motorola Moto G85 5G మంచి ఆప్షన్. తక్కువ ధరలోనే ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఉండే కర్వ్‌డ్ డిస్‌ప్లే, వీగన్ లెదర్ ఫినిష్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఈ ఫోన్‌లో Corning Gorilla Glass 5 ప్రొటెక్షన్‌తో కూడిన 6.67 అంగుళాల 3D కర్వ్‌డ్ pOLED (120Hz) డిస్‌ప్లే ఇచ్చారు. ఇది Qualcomm Snapdragon 6s Gen 3 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది.
కెమెరా పరంగా చూస్తే, OIS టెక్నాలజీతో కూడిన 50MP Sony LYTIA 600 మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరాతో పాటు క్లియర్‌గా ఫోటోలు తీసే 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. OIS ఫీచర్ ఉండటం వల్ల వీడియోలు, ఫోటోలు తీసేటప్పుడు కెమెరా షేక్ అవ్వకుండా ఉంటుంది.
అలాగే, Dolby Atmos సపోర్ట్ ఉన్న స్పీకర్లు, 5000mAh బ్యాటరీ దీనికి అదనపు ఆకర్షణ. ఫెస్టివల్ ఆఫర్‌లో దీని ధర రూ.15,999 గా ఉంది.